Tuesday, June 17, 2008

పర్యావరణ పరిరక్షణ

మాట కల్తి మనసు కల్తి
నీరు కల్తి బీరు కల్తి
మానవ ప్రాణంబు నిలిపె
మందులలో మరీ కల్తి

బియ్యంలో రాళ్ళాయె
పాలల్లో నీళ్ళాయె
అన్నంలో సున్నమాయె
అన్నిట అనుకరణలాయె

నీడనిచ్చె చెట్టుగొట్టి
గోడకు దిగ్గొట్టినావు
అడవంతా నరికివేసి
కాలుష్యం బెంచినావు

జనాలుండె ఇళ్ళల్లో
రసాయనాల పొగలాయె
భూగర్భ జలమందున
మందుల వ్వర్ధంబులాయె

భూమాత గుండెల్లో
బోరులెన్నొ గుచ్చి గుచ్చి
జలమంతా లాగినావు
భూకంపం దెచ్చినావు

లెక్కలేని వాహనాలు
ఒక్కసారి రోడ్డునెక్కి
గుప్పు గుప్పుమను పొగలతొ
కాలుష్యం చిమ్ముచుండె

ఉత్తచేతులు ఊపుకుంటు
సరుకులకై సంతకెల్లి
పలు ప్లాస్టిక్ సంచులతో
పరుగులెత్తి ఇంటికొచ్చి
పర్యావరణం పాడుజేసి
పాపం మూటగట్టినావు

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

2 Comments:

At March 7, 2009 at 10:37 PM , Blogger Rajendra Devarapalli said...

అద్భుతంగా ఉంది,అయ్యా నేనూ పర్యావరణం మీద విశాఖలో కాస్త కృషి చేస్తున్నాను.మీరు ఒక్కసారి నాకొక మెయిల్ చెయ్యగలరా?
devarapalli.
rajendrakumar
@gmail.
com

 
At June 4, 2009 at 6:08 AM , Blogger srinu said...

sir,
mee kavitha bagundi

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home