Friday, March 19, 2010

పరాత్పరమ అత్యాశ్రమ బాబా మంగళ హారతి

బాబా సర్వకేంద్రుల శారీరక జన్మస్థలమైన ఇండ్లూరు గ్రామ నివాసి, బాబా పాదజ్యోతి శ్రీ బసవోజు బ్రహ్మచారి విరచిత అత్యద్భుత కవితా స్రవంతి

పరాత్పరమ అత్యాశ్రమ బాబా మంగళ హారతి

మంగళమని పాడరె అత్యాశ్రమ బాబాకు // మంగళమని //
భక్తిశ్రద్దలతోడను మన బాబాకు పాదపూజలు చేయరె // మంగళమని //
స్పర్శ మాత్రమున సద్గతికి చేర్చే స్వామి బాబాకు // మంగళమని //
అగరు గంధము చల్లరే హరి బాబాకు సెంటు మల్లెలు వేయరె
జనమంతా మెచ్చి, జగమంత మ్రోగేటి జగదాచార్యబాబాకు//మంగళ//
సకల తీర్ధపాద, సర్వక్షేత్రవాసి సర్వశరణ్యునకు // మంగళమని //
అఖిలాండకోటి బ్రహ్మాండ నిలయ అచ్యుతీశ హరి పరబ్రహ్మకు
సర్వస్వరూపుడు, సర్వాకారుడు, సర్వస్థలవాసికి // మంగళమని //
విశ్వస్వరూపుడు, విశ్వాత్మతేజుడు, విశ్వగర్భునకు // మంగళమని //
చేరి స్థుతించిన సన్మతినిచ్చి, కోరి భజించిన
కోరికలు దీర్చేటి కల్ప తరువుకు // మంగళమని //
తత్త్వాతీత త్రిపుర హరీశుడు, ప్రణవాలయహరి పరంధామునకు/మంగళ/
నిర్వికార నిర్వాణ నిలయ, సర్వకళా ప్రపూర్ణ జ్యోతికి,
అచల ప్రదీప్తి అవతార కూడలికి // మంగళమని //
దేవాదిదేవ దివ్య ప్రభావునకు, ఆద్యంతరహిత అవ్యక్తతేజునకు/మంగళ/
సాంఖ్య తారకమనస్క, సంపూర్ణ బోధకునకు
భూ, జల, విహంగ, సర్వలయ యానునకు // మంగళమని //
సంగరహితుడు, సర్వాత్ముడు, సర్వోన్నత ప్రభుస్వామికి,
సత్య శివ సుందర సరస్వతీ గర్భులకు // మంగళమని //
శశి సూర్య నేత్ర, సర్వాంతరంగుడు
సర్వధరిత, సర్వభరిత, సర్వశక్తి సంపన్నునకు // మంగళమని //
పతితుల పాలిట ఉద్ధారకుడై దీనుల పాలిట
దిక్కై నిలిచిన దేశికేంద్రునకు // మంగళమని //
కాలాతీత కాలజ్ఞానికి, వేదపూజ్య దయాసాగరునకు
దివ్య సత్పురుష దైవజ్ఞ మూర్తికి // మంగళమని //
గుహ్యద్గుహ్యుడు, పరమ కారణుడు,
స్వత:స్సిద్ధ సర్వాత్మ జ్ఞానికి // మంగళమని //
అష్టవిధ గురువుల కావల నిలచి అతీత బోధ
ననుగ్రహించెటి అమృత సంజీవికి // మంగళమని //
సృష్టి, స్థితి, లయాతీత పరాత్పరమ అత్యాశ్రమ వాసికి
జనన మరణములేని జాడనెరిగించి
మాయాతీత మరుగు తెలిపే మార్గదర్శికి // మంగళమని //
కాళీ రూపునకు, కాండత్రయాతీతునకు
శ్రీమన్నారాయణ, పరమపద వాసికి // మంగళమని //
స్వయంభు: సత్యార్ధ ప్రకాశుడు, సర్వమతారాధ్య స్వామికి/మంగళ/
పంచభూతముల వివరముగ తెలిపి, సంచితాగామి కర్మల
దగ్ధము గావించి, ఉపదేశ మంత్రము ఊర్ధ్వమందున తెలిపే స్వామికి/మంగ
పరమ నిశ్శబ్ధుని, గంగం నిలయుని
గంగా యమునల నడుమన హరి బాబాను గుర్తు చేసికొని // మంగళమని //
కల్లలు గానట్టి, ఎల్లలు లేనట్టి ఏ-టు-జడ్ బాబాకు
ఎంగిలి లేనట్టి ఆత్మ నైవేద్యమిచ్చి // మంగళమని //
సూరి జన స్త్రోత్ర సత్య సద్గురు సార్వభౌమునకు
చిత్కళాతీత చిన్మయ చైతన్యునకు
సర్వలయ యాన చిద్గగన శరీరికి /మంగళ/
మంగళప్రదమైన మహితాత్మ మాతకు
మనసు దక్షిణ యిచ్చి మరుగు తెలిసికోని // మంగళమని //
విశుద్ధుడు, విశ్వగర్భుడు, విధి సూత్రధారునకు
ఏదిగాని, ఏమిలేని ఎరుకనంటని నేతి నేతి వాచ్యునకు // మంగళమని //
తీరుగ త్రిపురార మండలమందున వెలసిన
ప్రశాంతి నిలయ, దైవమత సంస్థాపకునకు // మంగళమని //
వాసిగ ఇండ్లూరి బ్రహ్మదాసుని కవిత
మణులందు సూత్రమున్న రీతిగ గాంచి // మంగళమని //
ధరణి శ్రీ ఇండ్లూరి దాసుని నమ్మిన
పరమ పదవి చేరే పలుకు పలకండి
శబ్ధ, స్థూల, సాకార పలక వదలండి
ఇదియే బాబా దర్శన లయ భాగ్యమండి
ఇంతకు మించి ఇక ఏమియు లేదనుచు // మంగళమని //

జై బాబా ఇతి సర్వం సర్వకేంద్ర పితార్పణమస్తు
శుభం - పావనం - దివ్యం

ఓం సర్వేత్ర స్సుఖినస్సంతు
సర్వేజనా సుఖినోభవంతు
లోకాస్సమస్తా స్సుఖినోభవంతు
శాంతి! శాంతి!! శాంతి:!!!బాబా సర్వకేంద్రుల అనుగ్రహ కృపసిద్ధి స్తోత్ర సూత్రములు:

నీలో జ్యోతిని దర్శించు, నీవే వెలుగై వ్యాపించు


1. ఓం నమో సర్వకేంద్రాయ, ఓం నమో విశ్వగర్భాయ
అన్యధా శరణం నాస్తి సదా త్వమేవ శరణం మమ

2. జై బాబా జై ఓం సర్వకేంద్ర భజ
జై బాబా జై ఓం పరంధామ జయ

3. ఓం శివరామ కృష్ణ గోవింద నారాయణ
జై విశ్వగర్భ సర్వకేంద్ర స్వామియే నమ:

4. హరి: ఓం శివకాళీ పరాత్పరీ
శ్రీం దుర్గ విశ్వమాతా భవాని సర్వేశ్వరి

5. ఓం శివ శంకర శ్రీహరి సద్గురు శ్రీమన్నారాయణ
పరమ పిత పారాయణ జై సర్వకేంద్ర బాబా ఆరాధన

6. జై సర్వకేంద్ర బాబా జై సర్వకేంద్ర బాబా జై సర్వకేంద్ర బాబా
జై జై జై

7. హరి హరి హరి శ్రీ గోవిందాయని హరిని స్మరించవె ఓ మనసా
శివ హరిని స్థుతించవె ఓ మనసా

8. ఓం శ్రీ త్రిపుర హరీశ సర్వశరణ్య యెహోవా సాయిరాం
అల్లా హరి బాబా నమో భజ సర్వకేంద్ర విధాత
పాహిమాం, విశ్వగర్భ రక్షమాం

9. దేహమనిత్యం, దైవం సత్యం, శరణం, షరణం
శ్రీహరి అల్లా బాబా శరణం

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home