Thursday, January 17, 2008

ఓం శ్రీ భగవతి స్వపరాది శక్తినిలయ, యెహోవా శ్రీహరల్లా, శ్రీమన్నాదినారాయణ, పరమపిత సర్వకేంద్రాయ నమ:

ఆహ్వాన పావన పత్రిక

బాబా సర్వకేంద్రుల పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం, త్రిపురారం

ఇందుమూలముగ సమస్త భక్త మహాశయులకు తెలియపరచు ముఖ్య విషయం ఏమనగా ది.17-02-2008 (ఆదివారం) భీష్మ ఏకాదశి వార్షిక దివ్యోత్సవ సందర్భములో ఈ క్రింది కార్యక్రమములు వుండును. 17-02-2008 ఆదివారం ఉదయం 8.00 గంటలకు కర్మ, భక్తి, జ్ఞాన యోగముల గీతా యజ్ఞము శ్రీవారి పాద జ్యోతి కుమారి చి. కుమారి నాగులవంచ శ్రుతి ఆధ్వర్యములో జరుపబడును. తదనంతరము బాబా సర్వకంద్రుల సశరీర పరిధిలో సర్వాకార, సర్వ మతారాధ్య పూజ శ్రీవారి పవిత్ర ప్రధాన పాదజ్యోతి నేతి విజయదేవ్ (పూర్వాశ్రమ నామధేయులు శ్రీ నాగులవంచ వసంత రావు) మరియు ఆశ్రమ అధ్యక్షులు గురుమూర్తి బాబా పవిత్ర పాదజ్యోతి శ్రీ పందిరి శ్రీరాములు గారల ఆధ్వర్యములో నిర్వహించబడును.

ఈనాటి రాత్రి పవిత్ర వాతావరణములో జ్ఞాన నేత్ర జాగరణ, భజన, పారాయణ, సత్సంగం, ఇండ్లూరు గ్రామ భక్తబృందముచే బుర్రకధ మొదలగు కార్యక్రమములు ఆశ్రమ దత్తపుత్రిక శ్రీమతి అరుణమ్మగారి ఆధ్వర్యములో నిర్వహించబడును. కావున ఆసక్తిగల భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొని జన్మ చరితార్ధులు కండి అని కోరుచున్నాము. ఈ వార్షికోత్సవ పర్వదిన సందర్భమును పురస్కరించుకొని ఆశ్రమ అన్నపూజ నిర్వహణతో పాటు బాబా సర్వకేంద్రులవారికి నూతన వస్త్రాలంకరణ ద్రవ్య దాతలు, శ్రీవారి పాద జ్యోతులు శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివస రెడ్డి పుణ్య దంపతులు, వనస్ధలిపురం వాస్తవ్యుల ఆధ్వర్యములో జరుపబడును.

శూచన: భక్తులు ఎవరైనను స్వచ్చంద ముగా వారికి తోచిన సహాయం చేయ వచ్చు.

లోకాస్సమస్తా స్సుఖినోభవంతూ
ఓం శాంతి! శాంతి!! శాంతి!!!

ఆశ్రమ అధ్యక్షులు ప్రధాన కార్యడర్శి
పందిరి శ్రీరాములు, నగిరి వెంకన్న
మిర్యాలగూడ, త్రిపురారం.










బాబా సర్వకేంద్రుల పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం, త్రిపురారం


1. భీష్మ ఏకాదశి ది.08-02-2006 (బుధవారము) పంచమ వార్షికోత్సవ సందర్భములో శివలింగ నిర్మాణ ప్రతిష్ఠ మరియు ప్రతి సంవత్సర వార్షికోత్సవ అన్నపూజ ద్రవ్య దాతలు, శ్రీవారి పవిత్ర పాద జ్యోతులు శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివసరెడ్డి గారలు, హుడా సాయినగర్ కాలని, వనస్ధలిపురం, హైదరాబాదు వాస్తవ్యులు.


2. భీష్మ ఏకాదశి ది.08-02-2006 (బుధవారము) పంచమ వార్షికోత్సవ సందర్భములో నంది విగ్రహ ప్రతిష్ఠ ద్రవ్య దాతలు, శ్రీవారి పవిత్ర పాద జ్యోతులు శ్రీమతి ఎడ్ల వెంకటమ్మ, శ్రీ మోహన్ రెడ్డి గారలు, వెంకటరమణ కాలని, వనస్ధలి పురం, హైదరాబాదు వాస్తవ్యులు.

1 Comments:

At April 9, 2008 at 8:42 AM , Blogger సుధాకర బాబు said...

వసంతరావు గారూ,

నమస్కారం.

[http://te.wikipedia.org/wiki/నాగులవంచ వసంతరావు]

మరియు
[http://te.wikipedia.org/wiki/చర్చ:నాగులవంచ వసంతరావు]

ఈ లింకులను ఒకమారు చూడగలరు. తెలుగు వికీపీడియాలో మీ గేయాన్ని మీరు గాని, మరెవరో గాని "నవ యువకులారా లేవండి" అన్న శీర్షికతో వ్రాశారు. స్వీయ కవితలు వికీలో విషిద్ధం. ప్రత్యామ్నాయ మార్గంగా మీ పేరు మీద వ్యాసం తయారు చేసి మీ గేయాన్ని ఉదాహరణగా అందులోకి మార్చాను. అందుకు అవుసరమైన సమాచారాన్ని మీ బ్లాగ్ సైటు నుండి తీసుకొన్నాను. ముందుగా మిమ్మలను సంప్రదించలేకపోయాను. మీకు అభ్యంతరమైతే తెలియజేయండి. తొలగిస్తాను. మీ అభ్యంతరాన్ని అదే వ్యాసం చర్చా పేజీలో వ్రాయవచ్చును.

సుధాకర బాబు

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home