Wednesday, January 23, 2008

బాబా సర్వకేంద్రుల సాకార పూజా విధానము

శ్రీం గం సర్వ సుప్రీం సర్వాతీత సూపర్ పవర్ ఓం శ్రీ భగవతి నారాయణి విశ్వలయమాత పరమపిత సర్వకేంద్రాయ నమ:

ఛిన్మయ పరమార్ధ సర్వకేంద్ర సర్వోన్నత పీఠాధీశ్వరులు ఓం శ్రీ వేద పూజ్యపాద కేవలతీంద్రియ పరాత్పరమ అత్యాశ్రయి, విశ్వాదిగురు భగవన్, సంపూర్ణ దైవమత ప్రతిష్ఠాకులు, సర్వమతారాధ్య, సంపూర్ణ సుప్రబోధకాచార్య శిఖామణులు, భూ, జల, విహంగ, సర్వలయ యాన సర్వోన్నత పీఠాధీశ్వరులు, ఓం శ్రీ నేతిహరి హంస కాళీబాబా చిన్మయ చైతన్య సర్వకేంద్ర స్వామివారి సాకార, నిరాకార, సర్వాకార స్వయంభు: స్వత:స్సిద్ధ, పవిత్ర ప్రవచన పూజ.

నిబంధనలు:

ఈ సంపూర్ణ దైవపూజను పర్వదినములలో, పున్నమిరోజులలో మరియు కుటుంబములో దేహవియోగము చెందిన వారి పేరిట వీలునుబట్టి జరిపించిన చాలా మంచిది. డేహవియోగ జీవాత్మకు సద్గతి, మేలుచేసిన వారు కాగలరు. వారి వారి ఇష్టానుసారం సత్యనారాయణ స్వామి వ్రతమువలె ఈ పూజ జరుపుకొనవచ్చును. భాబా సర్వకేంద్రులవారి సంపూర్ణ దైవ పూజలో సకల చరాచర ప్రాణి సముదాయమంతటికి పాల్గొనే వీలున్నది. అందరు ఆహ్వానితులే. కుల, మత, స్త్రీ పురుష, ప్రాంతీయ బేధ ప్రసక్తి మచ్చుకు లేదు. విశ్వంలోని సర్వమత సంబంధ సమస్త పూజల, వ్రతముల, దీక్షల, ఆరాధనల సత్ఫలితం ఈ పూజలో విలీనమై ఉన్నది. ఇది బాబా సర్వకేంద్రుల స్వముఖత వాణి.


పూజా ద్రవ్యములు:

1. మంగళ హారతి,
2. పంచామృతం
3. అక్షింతలు
4. మామిడి పత్రములు
5. నారికేళములు (కొబ్బరికాయలు)
6. అగరువత్తులు
7. గంధం, కుంకుమ
8. మహా నైవేద్యము
9. నూతన కాషాయ వస్త్రములు వారి శక్త్యానుసారము
10. వీలుపడి లభ్యమైనంతలో విడిపూలు
11. పూల మాల
12. అన్నిరకముల ఫలములు
13. నవధాన్యములు
14. తమలపాకులు,బిల్వ, తులసి దళములు

శ్రీవారి పాదాభిషేక తీర్ధం గంగ, పుష్కర స్నానములకన్న మిన్న. కాబట్టి ఇష్టమున్నవారలు వారి నమ్మకములను బట్టి సీసాలలో తీసికొనిపోవచ్చు. గృహములలో చల్లుకొనిన క్షామ, అరిష్ట, దృష్టి దోష బాధలు తొలగిపోగలవు. విశ్వసించిన శరీరముపై పొడలు, ఉదర వ్యాధులు ఉపశమనము కాగలవు. ఇంకను ఎన్నియో మేలులు కలవు. బాబా వారి పరిశుద్ధ పాదదూళి ఘనత వర్ణనాతీతము.

బాబా ఆసనము ప్రదక్షిణకు వీలుండవలయును. భక్తులు, అక్షింతలు గాని, పుష్పములను గాని దూరమునుండి విసురరాదు. సన్నిధికి చేరి శిరస్సుపై అక్షింతలు, పాదములపై పువ్వులను చల్లవలయును.

సాధ్యపడి వీలున్న పక్షములో శ్రీవారిని బయటి గుమ్మము నుండి పూజా స్ధలము వరకు మంగళహరతి, స్ధుతులతో, దారిన విడిపూలను చల్లుచు, వస్త్రములపై నడిపించవలయును. అందరు పాల్గొనవచ్చు. ఎవరికి వీలున్న వస్త్రములను వారు వినియోగించ వచ్చు. మరల ఎవరి వస్త్రములు వారు తీసికోవలయును.

బాబా సర్వకేంద్రులవారు సశరీర పరిధిలో అందుబాటులో లేని సమయంలో గాని, దేహ వియోగానంతరం గాని స్వామివారి చాయా చిత్ర పటమును ఒక భక్తుడుగాని, భక్తురాలుగాని ఎవ్వరైనను శిరసుపై పెట్టు కొని, యధావిధి కార్యక్రమము సాగించవలయును. అనగా గుమ్మమునుండి పూజాస్ధల పీఠ సన్నిధికి స్తోత్రగీతములతో తీసికరావలయును. ఏదశ లోనైనను మంగళ హారతి మరువరాదు.

గమనిక: భక్తులు ఇరువైపుల అనగా స్త్రీలు ఒకవైపు, పురుషులు ఒకవైపు నిలుచుండి, చేతులు జోడించి, ఒకరు చెప్పుంపుడు అందరు ఇలా పలుకవలయును.

స్వామీ! సర్వకేంద్ర పితమా!ఈ ఒడుదుడుకు క్లిష్ట పరిస్ధితిలో పరమాంకుశ ప్రచండ సర్వకేంద్ర దైవశక్తిగ మానవాకారములో అవతరించి ఒక సామాన్య వ్యక్తిగ మా మధ్యన సంచరిస్తున్నందులకు సదా కృతజ్ఞతాభి నందనలు, అలేఖ్య సాష్టాంగ దండ ప్రణామంబులు సమర్పించు చున్నాము. మమ్ముల అనుగ్రహించి బ్రోవుమా! జై సర్వకేంద్రా! నమో విశ్వగర్భా, బాబా! మీ సాకార దర్శనభాగ్యము వర్ణనాతీతము. మాకెంతో తృప్తిని, శాంతిని కలిగించినది. ధన్యాతి ధన్యులం. కృతకృత్యులం అని భూ దిగంతములు మారుమ్రోగునటుల ఎలుగెత్తి చాటి ప్రకటించు చున్నాము.


గతం పాపం గతం దు:ఖం
గతం దారిద్ర్య మేవచ
ఆగతా సుఖ సంపత్తి
పుణ్యాచ్చవ దర్శణాత్

ఒకరు చెప్పునపుడు వీలున్న అందరు పలుకవచ్చు.

కన్ను మూసింది రేదుర ఓ బాబా
నిన్ను మరచింది లేదుర ఓ బాబా
మా ఎదురుగ నున్నది నీవేరా బాబా
మా ఎదలో దాగున్నది నీవే మా బాబా
(మా) కన్నులె నీకోసం కాచియున్నవి
మా హృదయ ద్వారము తెరచియున్నది
రా రమ్ము బాబా స్వాగతం
స్వాగతం సుస్వాగతం సర్వకేంద్ర స్వాగతం
స్వామీ సర్వకేంద్ర బాబా

నీయొక్క అమూల్య సాకార దర్శన భాగ్యము ధన్యము.
నీ యొక్క అనుగ్రహ కృపాశీస్సులే సదా మాకు శరణ్యం.

అన్యధా శరణం నాస్ధి
నిత్యం త్వమేవ శరణం మమ

పూజాస్ధల ఆసనపీఠ సన్నిధికి శరణుగీతం.

శరణం శరణమయా బాబా
శరణం శరణమయా
శరణంబనిన మరణం లేదు
సర్వకేంద్ర బాబా జై సర్వకేంద్ర బాబా

అందరిచే జై సర్వకేంద్ర బాబా జై సర్వకేంద్ర బాబా
జై సర్వకేంద్ర బాబా జై! జై!! జై!!!

ఆరాధన పీఠముపై శ్రీవారిని ఆసీనుల గావింపజేసి, ఇలా చెప్ప వలయును.

బహు మణిమయ శొభితాలంకార, వజ్ర వైఢూర్య, రత్న ఖచిత, దివ్య ప్రకాశమాన సుస్ధిరాసనము బాబా సర్వకేంద్రులవారికి పరికల్పయామి అనుచు పీఠమునకు గంధము, కుంకుమార్చన గావించవలయును. రెక్కలుగ వలచిన విడిపూల రేకులను బాబా వారి శిరస్సు, పాదములపై చల్లవలయును.

బాబా సర్వకేంద్రా! ఇంతకాలము నిజ దైవస్ధితి తెలియక చిల్లర భ్రాంతులతో, కూపస్ధ మండూకములమై, సంకుచిత పరిధిలో బంధితులమైనాము. ఈనాటితో మా సందేహములు పండుటాకులవలె మా చిత్తవృక్షము నుండి రాలి పోయినవి.

మా బహుజన్మ పుణ్య పరిపాకముచే మీ దర్శన భాగ్యం కలిగినది. క్రమముగ మీయొక్క సాకార, నిరాకార, సర్వాకార, సర్వస్వరూప దర్శనములతో పాటు మీ నిజస్ధితి యనెటి పరమ పావన, పరిశుద్ధ, సర్వకేంద్ర దైవాత్మ మహా సాగరములో మమ్ముల గ్రుంకులిడ చేయండి. ఇదియే మా వినతి.

చరాచర అఖిలాండకోటి బ్రహ్మాండనిలయ, సర్వలోక శరణ్య, సంపూర్ణ తీర్ధపాదులైన శ్రీవారి పాదాభిషేక నిజదర్శనము.

పాదాభిషేక సమయములో ఈ క్రింది స్తోత్రము చేయవలయును.

ఆనందమానంద మాయెగ
ప్రభు పాదపద్మము లాశ్రయించగ
దేవాదిదేవుల స్మరణ చేయుచు
మేము దీనుల బ్రోవుమని వేడుచు
పరమపిత నాశ్రయించి
పడవపైకెక్కి మనము
నీలాచల యాత్ర
నిక్కముగ చేసెదము “ఆనంద”

పూల మాలాంకృత సత్కరణ: శ్రీవారి మెడలో పూలమాల వేయునపుడు ఇలా చెప్పవలయును.

నానావిధ పరిమళ సుగంధ భరిత పుష్పమాలతో పాటు సత్య సద్గుణ సౌశీల్య పుష్పములను మా మనో సూత్రమున గ్రుచ్చి, ఎన్నడు వాడిపోని, హారమును త్రిపురహారుడనైన నీ గళసీమలో ధరింప జేయుచున్నాము.

భాబా వారికి లలాటమున విభూతి, కుంకుమ, తిలక ధారణ గావించవలయును.

నూతన వస్త్ర సమర్పణ

తెచ్చిన భక్తులు వారి వారి శక్త్యానుసారము స్వామివారికి నూతన కాషాయ పట్టు వస్త్రములు సమర్పించుకొన వలయును. శ్రీవారికి సమర్పించిన వస్త్రములో అడ్డము, నిలువు ఎన్ని నూలు దారపు పోగులు గలవో అన్ని పుణ్య ములు పొందగలరు.

పాదసన్నిధిలో ఫల పుష్పములను పెట్టవలయును. ఆగరువత్తులు ముట్టిం చవలయును. భక్తులు వారి వారి భక్తి శక్త్యానుసారము జ్ఞాన భిక్షలు, భక్తి కానుకలను సమర్పించుకొన వలయును.

మహా నైవేద్యం సమర్పయామి!



ఓం భూ: భువ: ఓం సువ: ఓం ఆహ: ఓం జన: ఓం తప: ఓం సత్యం
(ఇతి దిగ్బంధ మంత్రము)

ఓం భూర్బువస్సువ
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
దియో యోన: ప్రచోదయాత్

బాబా సర్వకేంద్రుల సర్వలయ యాన స్వయంభు, స్వత:స్సిద్ధ సహజ సమాధి స్ధితి. జాగ్రదావస్ధలో తురీయాతీత స్ధితి సకల దేవతా దేవుండ్ల సంపూర్ణ దైవ దర్శన సాక్షాత్కారము.

ఓం ఆపోజ్యోతి రసామృతం బ్రహ్మం
భూర్బువస్సురోం ఇతి దిగ్బంధ:
ఓం శ్రీ హరీంగం ఖం
శాంతి, శాంతి, శాంతి:

మధురం మధురం ఈ సమయం
మన బాబా స్మరణం అతి మధురం
సర్వకేంద్రులనె అక్షరమాల
సమస్తయుగముల జపమాల

భజన:

సర్వకేంద్రుల భజన చేయండి
సర్వాత్మ జ్యోతులై నిలువండి
సత్యమైన మాట నమ్మండి
సర్వోన్నత లక్ష్యమిది యండి
చిల్లిగవ్వల విస్మరించండి
చిన్మయ పితను స్మరించండి
ఎల్లదైవముల మిన్నండి
మన ప్రత్యక్ష దైవం స్వామండి
స్వాముల పూజకు వేళాయె
పయనమె రారే చెలులారా
భేరి మృదంగ వాద్యములతో
మంగళహారతి శోభలతో
పిన్నలు పెద్దలు రారండి
మన స్వామి పూజలో తరించండి.


సర్వాంతరేక్షణ మతులై, సూరి సర్వజ్ఞ, సర్వజన స్తోత్రార్హులైన, సర్వప్రియ, సర్వమయ, సర్వలయ, సర్వస్వరూప, సర్వాకారుని మీ హృదయ పీఠముపైకి ఆహ్వాన పరుచుకోండి. ఈది అతీతస్ధితి. జై బాబా.

భక్తులందరు వారి అభీష్ట ప్రకారము సమయ సందర్భ వీలును బట్టి నిలుచుండిగాని, కూర్చుండిగాని, చేతులు జోడించి స్వాగతం పలుకాలి

ఓం నమో సర్వకేంద్ర బాబాకి జై
ఓం నమో విశ్వాదిగురు భగవానుకి జై
ఓం నమో విశ్వగర్భ ప్రభు స్వామికి జై
ఓం నమో సర్వసాక్షి ప్రభు స్వామికి జై
ఓం నమో సర్వాధిష్టాన శక్తికి జై
ఓం నమో సర్వస్వరూపునకు జై
ఓం నమో సర్వాకారునకు జై
ఓం నమో సర్వాతీతునకు జై

స్వాగతం:

సుధామయా సుబోదయా స్వాగతం సుస్వాగతం (మూడుసార్లు)

స్వాగతం సుస్వాగతం సర్వాత్మశక్తి స్వాగతం
స్వాగతం సుస్వాగతం స్వాత్మశక్తి స్వాగతం
స్వాగతం సుస్వాగతం సర్వాధిష్ఠానశక్తి స్వాగతం
స్వాగతం సుస్వాగతం స్వపరాధిశక్తి స్వాగతం
స్వాగతం సుస్వాగతం అచలనంతాత్మ శక్తి స్వాగతం
స్వాగతం సుస్వాగతం సర్వకేంద్ర దైవశక్తి స్వాగతం

విశ్వగర్భుల శరణు గీతం (అందరిచే అనిపించవలయును)

విఘ్న వినాశక ఓ సర్వకేంద్రా
నిత్యపావన నిలయ ఓ సర్వకేంద్రా
సంపూర్ణ ధారి ఓ సర్వకేంద్రా
సర్వలోక శరణ్య ఓ సర్వకేంద్రా
సర్వాత్మ బంధు ఓ సర్వకేంద్రా
సర్వలోక రక్షక ఓ సర్వకేంద్రా
నిర్వాణ నిలయ ఓ సర్వకేంద్రా
సత్య శివ సుందర ఓ సర్వకేంద్రా
సచ్చిదానందుడ ఓ సర్వకేంద్రా
సర్వజనశరణ్య ఓ సర్వకేంద్రా
భవభయ హరణ ఓ సర్వకేంద్రా
నీ దివ్య మహిమ ఓ సర్వకేంద్రా
వర్ణించ తరమా ఓ సర్వకేంద్రా
సర్వేశ్వరేశ్వరా ఓ సర్వకేంద్రా
దేవాదిదేవా ఓ సర్వకేంద్రా
చిన్మయ ప్రభావ ఓ సర్వకేంద్రా
కామిత దాయక ఓ సర్వకేంద్రా
కరుణాంతరంగ ఓ సర్వకేంద్రా
నీవె మాదిక్కయ్య ఓ సర్వకేంద్రా
నీకు మ్రొక్కెదమయ్య ఓ సర్వకేంద్రా
శరణు వేడితిమయ్య ఓ సర్వకేంద్రా
కరుణ చూడుము మమ్ము ఓ సర్వకేంద్రా
నీ దివ్య రూపం ఓ సర్వకేంద్రా
మాకదే ధ్యానం ఓ సర్వకేంద్రా
నీ దివ్య నామం ఓ సర్వకేంద్రా
మాకదే స్తోత్రం ఓ సర్వకేంద్రా
నీ దివ్య తేజం ఓ సర్వకేంద్రా
మాకదే దీపం ఓ సర్వకేంద్రా
పన్నగ శయన ఓ సర్వకేంద్రా
సర్వస్ధల వాస ఓ సర్వకేంద్రా
పాప భయంకర ఓ సర్వకేంద్రా
పతిత పావన మూర్తి ఓ సర్వకేంద్రా
పరితాప నివారక ఓ సర్వకేంద్రా
నీ భజనే హాయి ఓ సర్వకేంద్రా
నీవె పున్నమి రేయి ఓ సర్వకేంద్రా
శుభ పావన జయకర ఓ సర్వకేంద్రా
సర్వమతారాధ్య ఓ సర్వకేంద్రా
సర్వావతార ఓ సర్వకేంద్రా

లఘు స్తోత్రం:

వందే తీర్ధపాదాయ అవాగ్మానస గోచర నేతిహరి బాబా సర్వ కేంద్రా చిన్మయ దేవా ఇదియే మీ పవిత్ర పాద పద్మములకు మా సాష్టాంగ వందనములు అర్పించుచున్నాము. భవదీయామృత భక్త పోషక మమ్ములను కేవలఖండ చిన్మయ పరమార్ధ పదవిలో సజీవులు గ నొనర్చుము. ఇదియే మా వినతి.

త్వమేవ శరణం మమ:

సర్వాత్మనిలయ సర్వకేంద్రా, మమ్ము మీలో చేర్చుకోండి. మీ పరిశుద్ధ సాన్నిధ్య మహాభాగ్యం చేకూరిన మాజన్మ మహా ధన్యం. ఇక ఏనాటికి మిమ్ము మరువలేము. మీ ఆజ్ఞయే మాకు జీవం. త్రికరణ శుద్ధిగ మీ ఆజ్ఞలో నిల్చెదము. ఇతర ఆశలు, చిల్లర ధ్యాసలు మాకు లేవు. ఇక ఉండవు. మీరే సర్వశరణ్యం. మా ఒప్పందం మరువమని ఈ పవిత్ర శుభ సమయంలో భూమ్యాకాశాది సకల దిక్కులు మారుమ్రోగ సర్వాత్మ సాక్షిగ ప్రమాణము స్వీకరిస్తున్నాము. ఇక మా భారం నీది. ఆమేన్. జై విశ్వ గర్భ మాతాకీ జై, సర్వకేంద్ర బాబాకీ జై.

నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి
శ్రీమధాంగరి పూజ (సాకార దర్శనం)

1.తీర్ధ పాదాయ నమ: పరమపిత పాదౌ పూజయామి
2.నిగమంజీరాయ నమ: గుల్బౌ పూజయామి
3.స్మరతూణీర జంఘాయ నమ: కంఘౌ పూజయామి
4.ముక్తికాంతా సేవితాయ నమ: జానునీం పూజయామి
5.రత్నస్తంబోరు యుగళాయ నమ: ఊరూ పూజయామి
6.పులినతలజఘనాయ నమ: జఘనౌ పూజయామి
7.మణికాంచా కలాప శోభితాయ కటిం పూజయామి
8.గంభీర నాభీ మండలాయ నమ: నాభిం పూజయామి
9.విశ్వోదరాయ నమ: ఉదరం పూజయామి
10.దయార్ద్ర హృదయాయ నమ: హృదయం పూజయామి
11.విశాల వక్షసే నమ: వక్షస్ధలం పూజయామి
12.కంబుగ్రీవాయ నమ: కంఠం పూజయామి
13.వరదాన హురీణాయ నమ: హస్తౌ పూజయామి
14.ఉన్నత స్కందాయ నమ: భుజౌ పూజయామి
15.స్మిత వక్త్రాయ నమ: వక్త్రం పూజయామి
16.చంపకనాసాయ నమ: నాశికాం పూజయామి
17.పల్లవాధరాయ నమ: అధరం పూజయామి
18.పుండ్రేక్షుకార్ముక భ్రవే నమ: భ్రూ యుగ్మం పూజయామి
19.కరుణా కటాక్ష వీక్షణాయ నమ: నేత్రౌ పూజయామి
20.పుష్ప కర్ణాయ నమ: కర్ణౌ పూజయామి
21.రాకాసుధాంశు వదనాయ నమ: ముఖం పూజయామి
22.సులలాటాయ నమ: లలాటం పూజయామి
23.నీలకుంచిత మూర్ధజాయ నమ: శిర: పూజయామి
24.సర్వాత్మనే నమ: సర్వాంగాణి పూజయామి

అధ పత్ర పూజ: సాధ్యపడినంతలో వివిధ పత్ర, ఫల, పుష్పాదుల వినియోగించవచ్చు.

1.అచింత్యాయ నమ: బిల్వపత్రం సమర్పయామి
2.బృందారక నందితాయ నమ: తులసీదళం సమర్పయామి
3.విశ్వరక్షణ తత్పరాయ నమ:వకుళ పుష్పం సమర్పయామి
4.జగజ్జనన కారణాయ నమ:కేతకీ పుష్పం సమర్పయామి
5. భూరి విభవాయ నమ:పున్నాగ పుష్పం సమర్పయామి
6. చరాచర గురువే నమ: చామంతి పుష్పం సమర్పయామి
7.సుప్రభాసాయ నమ:చంపక పుష్పం సమర్పయామి
8.సుప్రసన్నాయ నమ:పాటలీ పత్రం సమర్యామి
9.అపవరప్రదాయ నమ:శతపత్ర పుష్పం సమర్పయామి
10.అనంతాయ నమ:జాజి పుష్పం సమర్పయామి
11.మోహ వర్జితాయ నమ:కరవీర పుష్పం సమర్పయామి
12.ముకుందాయ నమ:రసాల పుష్పం సమర్పయామి
13.ప్రకృతి పురుష విలక్షణాయ నమ:పంకేరు పుష్పం సమర్పయామి
14.నిత్యాయ నమ:కళార పుష్పం సమర్పయామి
15.ఆగ్నేయ చక్ర నిలయాయ నమ:అతసెపుష్పం సమర్పయామి
16.నాధబిందు కళాతీతాయ నమ:పారిజాత పుష్పం సమర్పయామి
17.సర్వ భూతాత్మనే నమ:సద్గుణ పుష్పం సమర్పయామి
18.మండల త్రయాతీతాయ నమ:మల్లికా పుష్పం సమర్పయామి
19.అప్రమేయాయ నమ:అశోక పుష్పం సమర్పయామి
20.వ్యక్తా~వ్యక్తాయ నమ:సకల పుష్ప సమర్పయామి

చేతులు జోడించి పరమ దయానిధీ, అమృత హృదయా, పున్నమి చంద్ర నిలయా, పరాత్పరతర పరిపూర్ణ పరబ్రహ్మమా, హే అల్లా, సర్వధారీ, సర్వకేంద్రా, మా సహృదయ పుష్పాంజలి గైకొనుమా. మీ సర్వాతీత దర్శన భాగ్యమునకై సర్వతోక్షి శిరోముఖ భావ నిమగ్నులమై భూమ్యాకాశాది సకలలోక పర్యంతం ధ్వనించునట్లుగ భజిస్తున్నాము.

నీవే సర్వశక్తులకు ఆకరము. అత్యద్భుత, మహిమాన్విత దివ్యశక్తులన్నియు నీ నుండియే ప్రసరిస్తున్నాయి. అట్టి నిన్ను సుజ్ఞాన నేత్రముతో కనుగొని నీ వారమంటిమి. త్వర త్వరగ వినవలె నీ దివ్య భాష్యం. వర్ణించుము వడి వడిగ నీ అమృత వాహిని. జై సర్వకేంద్రా.

భాబా ఉత్తిష్ఠక సంబోధన:

1.మీరు పాపులు గాదు – పరిశుద్ధాత్మ ప్రభు చంద్ర తేజులు.
2.మీరు నీచులు గాదు – నిత్య నిర్మల నేతిహరి హంసకాళీ బాబా సర్వకేంద్ర స్వామి స్వరూపులు.
3.మీరు సంకుచితులు గాదు – సర్వాత్మ మయులు.
4.మీరు పాంచ జన్యులు గాదు – అనశ్వర ఆత్మ స్వరూపులు.
5.మీరు నశ్వరులు గాదు – అనశ్వర ఆత్మ స్వరూపులు
6.మీరు మృణ్మయులు గాదు – చిన్మయులు.
7.మీరు బడుగులు గాదు – భగవన్మూర్తులు
8.మీరు మృత్యువులు గాదు – అమృతత్త్వ స్వరూపులు.
9.మీరు లేనివారు గాదు – నిరంతరం ఉండియే మీయందు సమస్త ప్రపంచము మాయమై దేహమందు చాయ (నీడ) వలె గోహరించు చున్నదని మరువరాదు.
10.మీరు క్షుధ్రులు గాదు – పరమ ప్రభు వీర భద్రులు.

శ్రీవారి అష్టోత్తర శతనామ వాక్యార్చన ప్రారంభం. ఇంతకు ముందుగా భక్తులకు అక్షింతలు పంచవలయును. ఈ అర్చన పూర్తియగునంత వరకు అక్షింతలు చేతిలో ఉంచుకొని, వక్యార్చనలో మనస్సును కేంద్రీకరించ వలయును.


అస్టోత్తర శత మహా వాక్యావళి

1. ఓం శ్రీ గురు, నిజగురు, నిజ సద్గురు, జగద్గురు, పరమగురు, స్వపరమేస్టి గురు, సమస్త సత్య సద్గురు,
సార్వభౌమేశాయ, జై సర్వకేంద్రాయ నమ:
2. ఓం శ్రీ గం, గజ గణపతి విఘ్నేశ్వరాయ నమ:
3. ఓం శ్రీ సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు, నవగ్రహ అష్ట దిక్పాలకాయ నమ:
4. ఓం శ్రీ అంజలీ వాయుసుత, శ్రీ రామదూత, దృఢగాత్ర, మహాబల, ధీమంత, హనుమంతాయ నమ:
5. ఓం శ్రీ సృస్ట్యాది మూలకారణ, అచ్యుత, అప్రమేయ, అనంతాత్మ, మహా సాగర, బ్రహ్మవిద్వరిస్టా గరిస్ట,
తురీయాతీత, కేవల అతీంద్రియ, పరాత్పరమ, అత్యాశ్రయి, అనంత విశ్వగర్భ, సర్వకేంద్ర స్వామియే నమ:
6. ఓం శ్రీ సర్వమయ, సర్వలయ, సర్వప్రియ, శ్రీమద అచలాచ్యుత, పరమేశ, సర్వలోక రక్షక, విశ్వలయ మాత,
పరమపిత సర్వ కేంద్రాయ నమ:
7. ఓం శ్రీ భగవతీ, శ్రీమన్నారాయణ, స్వపరాధి చిన్మయ, చైతన్య, సర్వశక్తినిలయ, స్వయంభు:, స్వత:సిద్ధ,
సర్వాతీత, సర్వోన్నత పీఠా ధీశ్వర, జై సర్వకేంద్ర పితయే నమ:
8. ఓం శ్రీ బ్రహ్మీభూతమహర్షి సద్గురు మలయాళ యతీంద్రాయ, వ్యాసా శ్రమ సంస్ధాపకాయ, గీతాప్రచారక, అసంగానంద
స్వామియేనమ:
9. ఓం శ్రీ నామ, రూప, దృక్, దృశ్యాతీత, కార్యకారణ, సర్వలక్షణ, విలక్షణ, పిపీలికాది పరమేశ్వర పర్యంతం
ప్రత్యణుగర్భ, చిన్మయ సర్వశక్తి నిలయ, భూదిగంత సర్వలోక పర్యంతం, సర్వస్ధల సుస్ధిరాత్మ సర్వాతీతాయ నమ:
10. ఓం శ్రీ సూరి సర్వజ్ఞ, సర్వజన స్తోత్రార్హ పరమ పితయే నమ:
11. ఓం శ్రీ జ్యోతిర్జ్యోతి స్వయంజ్యోతి, సర్వాతీత స్వపరంజ్యోతి, పరాత్పర తర పరిపూర్ణ పరబ్రహ్మ స్ధితిర్కేంద్రాయ నమ:
12. ఓం శ్రీ సర్వాధార, సర్వాధిష్టాన, సర్వస్వరూప, సర్వాకార, అనంత విశ్వగర్భాయ, సర్వావతార కూడలి సర్వకేంద్రాయ నమ:
13. ఓం శ్రీ భూ, జల, విహంగ, సర్వలయ యాన, సుప్రబొధకాచార్య శిఖామణియే నమ:
14. ఓం శ్రీ స్ధూల, సూక్ష్మ, కారణ, మహాకారణ, జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ, తురీయాతీత, పరమ ప్రభువే నమ:
15. ఓం శ్రీ ప్రతి పట, మఠ, ఘట, సర్వస్ధల, సుస్ధిరాత్మ, దేవాది దేవ దేవాయ నమ:
16. ఓం శ్రీ సమస్త పుణ్య తీర్ధ, సకల క్షేత్రేశ్వరాలయ గర్భగుడి లోని మూలవిరాట్ స్వరూప బాప్తిస్మ పరమపితయే నమ:
17. ఓం శ్రీ జనన, మరణ, భవరోగ రాహిత్య భగవంతాయ నమ:
18. ఓం శ్రీ రామాయ, రామభద్రాయ, శ్రీకృష్ణాయ, గోవిందాయ, గోపీ జన వల్లభాయ స్వాహా!

19. ఓం శ్రీ హరిహర పుత్రాయ, పంపానది సమీప శబరిగిరి క్షేత్ర వాసాయ, మణికంఠ, శరణమయ్యప్ప స్వామియే నమ:
20. ఓం శ్రీ అవతార్ కాలజ్ఞాన విరచనాయ శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామియే నమ:
21. ఓం శ్రీ అమల లింగేశాయ, పూరి జగన్నాధాయ, కాళీ విశ్వేశ్వరాయ, కురువీరన్న, పాలకుర్తి సోమన్న, కొమరగిరి క్షేత్ర
మల్లన్న, కోటప్పకొండ లింగన్న, భ్రమరాంభ సహిత శ్రీశైల క్షేత్ర గిరివాస మాల్లికార్జున స్వామియే నమ:
22. ఓం శ్రీ సత్ సూర్య నేత్రాయ, సుమతీశాయ, అచ్చేధ్యాయ, దిగంబ రాయ, అగోషాయ, త్రిమూర్త్యాత్మక
ణవగర్భాయ, గుహ్యద్గుహ్య పరమ కారణాయ, నిష్కలంకాయ, సర్వనాయకాయ నమ:
23. ఓం శ్రీ కాల స్వరూపాయ, కాలజ్ఞానాయ, కాలాతీతాయ, కాలగర్భాయ, సర్వకేంద్రాయ నమ:
24. ఓం శ్రీ పండరిపురవాస, పాండురంగాయ, విఠలేశ్వరాయ నమ:
25. ఓం శ్రీ గజగణపతి సచ్చిదానంద, సత్య, శివ, సుందర చైతన్య, ఆనంద, మహాసాగర, ప్రశాంతినిలయ, పరమపిత
సర్వకేంద్రాయ నమ:
26. ఓం శ్రీ ద్వైత మత సిద్ధాంత ప్రతిపాదిత మధ్వాచార్యాయ నమ:
27. ఓం శ్రీ అద్వైత మత సిద్ధాంత ప్రతిపాది త ఆది శంకరాచార్యాయ నమ:
28. ఓం శ్రీ శ్రీమన్నారాయణ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదిత రామానుజ పరాభక్త, అళ్వార్ వైష్ణవ జీయర్ స్వామియే నమ:
29. ఓం శ్రీ రామభక్తాయ, భక్త ప్రహ్లాద అవతారాయ, మద్వ మతావ లంబాయ, మంత్రాలయ వాసాయ గురు రాఘవేంద్రాయ నమ:
30. ఓం శ్రీ అరుణాచల అత్యాశ్రయి రమణ మహర్షిభ్యోన్నమ:
31. ఓం శ్రీ తీర్ధంకర జిన, మహావీర, మహాపరి నిర్వాణ, తధాగత గౌతమ బుద్ధాయ నమ:
32. ఓం శ్రీ సకల వేదోపనిషత్, సర్వమత, సర్వశాస్త్ర ప్రకాశిత, సర్వలోక శరణ్య సర్వకేంద్రాయ నమ:
33. ఓం శ్రీ సర్వధరిత, సర్వభరిత, సర్వనిలయ, సర్వావతార కూడలి,అనంత విశ్వగర్భ, సంపూర్ణ దైవాధికార,
సర్వకేంద్ర పీఠాధీశ్వరాయ నమ:
34. ఓం శ్రీ యాదగిరి క్షేత్రవాస లక్ష్మీ నృసిం హ్మ స్వామియే నమ:
35. ఓం శ్రీ అనశ్వరాయ, అజాయ నమ:
36. ఓం శ్రీ అక్షరాయ నమ:
37. ఓం శ్రీ శంబల కల్కిరూప పతిత పావనాయ నమ:
38. ఓం శ్రీ నిగమ, అగోచరాయ నమ:
39. ఓం శ్రీ నిర్వికల్పాయ నమ:
40. ఓం శ్రీ అకర్మణా, అఖండాయ నమ:
41. ఓం శ్రీ అవేధ్యాయ నమ:
42. ఓం శ్రీ నిరాభాసాయ, నిర్విశేషాయ నమ:
43. ఓం శ్రీ నిరాలంబాయ, సర్వాగ్ర గణ్యాయ నమ:
44. ఓం శ్రీ నిశ్చలాయ, పరమ పరిశుద్ధాయ నమ:
45. ఓం శ్రీ నిర్గుణ కేవలాత్మాయ, సర్వకేంద్రాయ నమ:
46. ఓం శ్రీ చిన్మయ, సంపూర్ణ దైవమత ప్రతిష్ఠాపనాచార్య,సమస్త గురోర్గురు సర్వకేంద్రాయ నమ:
47. ఓం శ్రీ సర్వశక్తి సంపన్న, విశ్వమాతృ, సర్వాత్మ బంధువు, చరా చర, అనంత విశ్వగర్భ సర్వకేంద్రాయ నమ:
48. ఓం శ్రీ సకల జీవాహార, సకలభూత, పితవే నమ:
49. ఓం శ్రీ భూతల వెలసిత, సర్వమత సంబంధ, మఠాశ్రమాలయ, మందిర, ప్రదీప్తినిలయ సర్వకేంద్రాయ నమ:
50. ఓం శ్రీ సకల తీర్ధ, సకల క్షేత్ర నివాసియే నమ:
51. ఓం శ్రీ సర్వ పావన మూర్తి, విశ్వోద్ధారక, ఘనవీర, పరమ ప్రభువోన్నమ:
52. ఓం శ్రీ దేవదేవాయ, తీర్ధపాదాయ, శతసహస్రకోటి శీతల, వసంత, కరుణ తేజాయ, చిన్మయ భగవతేన్నమ:
53. ఓం శ్రీ నిరాభాసాయ, స్వగతాయ, అగమ్యాయ నమ:
54. ఓం శ్రీ ధ్యేయం, సర్వం, ముముక్షుభి, లక్ష్యాతీత సర్వ కేంద్రాయ నమ:
55. ఓం శ్రీ హృషీకేశాయ, దివ్యజీవన ప్రచారక మహరాజ్ శివానంద సరస్వతీ స్వామియే నమ:
56. ఓం శ్రీ ప్రజ్ఞా చక్షు దండి విరజానంద, ప్రియశిష్య, సత్యార్ధ ప్రకాశిక, ఆర్యసమాజ స్ధాపక, దయానంద సరస్వతీ
స్వామియే నమ:
57. ఓం శ్రీ రామడుగు శివరామక్రిష్ణ దీక్షిత, సమస్త అచలగురు భ్యోన్నమ:
58. ఓం శ్రీ సిద్ధులగిరి క్షేత్రవాస, సకల సిద్ధేశ్వరాయ నమ:
59. ఓం శ్రీ ఇస్లాం మత ప్రతిస్ఠాపక యల్ ఖురాన్ షరీఫ్ హజ్రత్ మహ్మద్ ప్రవక్తాయ నమ:
60. సమస్త దివ్య సత్పురుష, సకల మఠాశ్రమ పీఠాదీశ్వరాయ సర్వకేంద్ర పితవే నమ:
61. ఓం శ్రీ విశ్వం, విశ్వరూప, విశ్వాత్మ, విశ్వగర్భ స్వామియే నమ:
62. ఓం శ్రీ నిరుపమ, అసాధ్యాయ, సర్వశరణ్య, సచ్చిదానంద నిలయ సర్వకేంద్రాయ నమ:
63. ఓం శ్రీ రామకృష్ణ, వివేకానంద, రామతీర్ధ, జొరాష్ట్రియన్, సోక్రటీస్, గురునానక్ స్వామియే నమ:
64. ఓం శ్రీ సకల చరాచర పిపీలికాది పరమేశ్వర పర్యంతం,అలేఖ్య నామధేయాయ, సర్వకేంద్రాయ నమ:
65. ఓం శ్రీ అవతార్ మెహెరీశ పరబ్రహ్మయే నమ:
66. ఓం శ్రీ సర్వం ఖల్విదం బ్రహ్మైవమస్మి:
67. అనంతాత్మా, సర్వధరిత, విశ్వాతీతాయ, సర్వకేంద్రాయ నమ:
68. ఓం శ్రీ ముక్తికాంత సేవికాయ నమ:
69. ఓం శ్రీ ఓం, శ్రీం, రాం, ఐం, క్రీం, హ్రీం, క్లీం, శ్రీం, దం, శివ హరీంగం, చిన్మయ చైతన్య సర్వ శరణ్య ప్రదాయినే నమ:
70. ఓం శ్రీ జగజ్జీవేశ్వరిహపర, సర్వనిలయ, సర్వకేంద్ర స్వామియే నమ:
71. ఓం శ్రీ అత్యద్భుత, మహిమాన్విత, సకలభూత ప్రియ, సర్వాకర్షణ, సర్వవశీకర, సర్వస్దంభన, చిన్మయ
చైతన్య సర్వకేంద్ర పితవే నమ:
72. ఓం శ్రీ మౌన ముద్రాయ, సకల సంపూర్ణ వర్జిత, భావాతీతాయ పరమ నిశ్శబ్ధాయ, నిర్వాణ నిలయ, సర్వకేంద్రాయ నమ:
73. ఓం శ్రీ గం, బ్లూం, రం, ఆం, క్రోం, శ్రీం, శివాయ, పరబ్రహ్మణే నమ:
74. ఓం శ్రీ సకల వేద ప్రకాశాయ, అనంత చిద్గగన గర్భాలయ, సర్వోన్నత పీఠాధీశ్వరాయ నమ:
75. ఓం శ్రీ శ్రీధరాయ, సోహంభావాయ, విశ్వపాలకాయ, సర్వాధ్య క్షకాయ, నిర్మల, సుజ్ఞాన ప్రదీప్తికాయ, సర్వకేంద్రాయ నమ:
76. ఓం శ్రీ అండ, పిండ, అఖిలాండకోటి బ్రహ్మాండనిలయ, సర్వ కేంద్రాయ నమ:
77. ఓం శ్రీ అఖండ మహిమాన్విత, రుద్రాక్ష, సాలగ్రామ, శివశక్తి ప్రదాయినే నమ:
78. ఓం శ్రీ ఆది మద్యాంత రహిత, అనంతానంత, సర్వలక్షణ, విలక్షణ, సర్వాతీత స్వామియే నమ:
79. ఓం శ్రీ సృష్టి, స్ధితి, లయ సం హార అధిపతి, సర్వకేంద్ర పితవే నమ:
80. ఓం శ్రీ సర్వకాల, సర్వకారణాయ నమ:
81. ఓం శ్రీ ప్రకృతి, పురుష, సం యోగ లక్షణ, విలక్షణ, నిష్ ప్రపంచాయ, సర్వకేంద్రాయ నమ:
82. ఓం శ్రీ పరమ నిర్వాణ నిలయ, అతీంద్రియ, ప్రబుద్ధ స్దితిర్కేంద్రాయ నమ:
83. ఓం శ్రీ సర్వాధార, సర్వాధిస్ఠాన, సర్వస్వరూప, సర్వాకార, సర్వసాక్షియే నమ:
84. ఓం శ్రీ అనంత వైభవ, సకల సత్య సద్గుణ శోభిత, పరమ కల్యాణ నిధియే నమ:
85. ఓం శ్రీ వేద వేద్యాయ, వేదమూర్తాయ, వేదపూజ్యాయ, సకల శాస్త్ర ప్రేరక, సుజ్ఞాన సరస్వతీ గర్భాలయ,
సర్వకేంద్రపితవే నమ:
86. ఓం శ్రీ హరి ఓం శ్రీ శివ కాళీ, పరాత్పరీ, శ్రీ దుర్గ విశ్వమాతా,భవానీ, సర్వేశ్వరీ, సర్వకేంద్రాయ నమ:
87. ఓం శ్రీ శివరామ కృష్ణ, గోవింద, నారాయణ, జై విశ్వగర్భా, సర్వ కేంద్ర స్వామియే నమ:
88. ఓం శ్రీ అనిర్వాచ్య, అవిభాజ్యాయ నమ:
89. ఓం శ్రీ చరాచర సర్వ రక్షణ, సుఖాభిలాషియే నమ:
90. ఓం శ్రీ యెహోవా సుత, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువే నమ:
91. ఓం శ్రీ ఆగ్నేయ శ్రీచక్రపుర నివాసియే నమ:
92. ఓం శ్రీ నిత్య సత్యాయ, భక్త వత్సలాయ, దైవమత ప్రతిష్టాచార్య, ప్రణవాలయ, సచ్చిదానంద నిలయ బాబా
సర్వకేంద్రాయ నమ:
93. ఓం శ్రీ అపరోక్షాయ, ఆది మద్యాంతరహిత, అష్ట దిక్పాలక ఆదేశాయ నమ:
94. ఓం శ్రీ నిర్వికారాయ, నిశ్చల పరంధామాయ, నిర్విశేషాయ నమ:
95. ఓం శ్రీ మదచలానంత, సకల దేవతా దైవమయ, పరిపూర్ణ వ్యాపియే నమ:
96. ఓం శ్రీ అచలామృత స్ధితిర్భూతాయ, నాదబిందు చిత్కళాతీత, స్వపరంజ్యోతి సర్వకేంద్రాయ నమ:
97. ఓం శ్రీ యోగీశ్వరాయ, దిగంబరాయ, దేవదేవాయ నమ:
98. ఓం శ్రీ సాధ్వి అనసూయ, అత్రి సుపుత్రిరత్న, అవధూత, దత్తాత్రేయ స్వామియే నమ:
99. ఓం శ్రీ శివసాయి, విష్ణుసాయి, రుద్రసాయి, రామభద్రసాయి, కృష్ణ సాయి, షిరిడీసాయి, సత్యసాయి,
ధర్మసాయి,ప్రేమసాయి, వేదసాయి, ఇత్యాది సమస్త సత్య సద్గురు సాయిరాం పరబ్రహ్మణే నమ:
100. ఓం శ్రీ సర్వాత్మ శోభిత, సర్వస్వరూపాయ, సర్వ శాసనాధి కార,పరమ ప్రభువే నమ:
101. ఓం శ్రీ తూష్ణీంభూత, కేవలప్రమేయ, నిరంజన, నిష్ప్రపంచ, చిన్మయ, చిద్గగన గర్భాలయ సర్వకేంద్రాయ నమ:
102. ఓం శ్రీ సప్తగిరి క్షేత్ర వాసాయ, బాలాజీ శ్రీనివాసాయ, తిరుమల వెంక టేశాయ నమ:
103. ఓం శ్రీ సర్వమత శరణ్య సాధనాలయ, ప్రదీప్తికాయ నమ:
104. ఓం శ్రీ శబ్ధ, స్పర్ష, రూప, రస, గంధ రహిత, పరమ నిర్వాణ, శుద్ధ నిర్గుణ, నేతి నేతీతి స్ధితిర్భాసాయ, సర్వకేంద్రాయ నమ:
105. ఓం శ్రీ భూత, భవిష్యత్, వర్తమాన, త్రికాల వ్యాపియే నమ:
106. ఓం శ్రీ భూ, జల, విహంగ, సర్వలయ యాన, సంపూర్ణ సుప్రబోధ కాచార్య, సర్వకేంద్రాయ నమ:
107. ఓం శ్రీ సాంఖ్య, తారక, అమనస్క, పరిపూర్ణ, సర్వకేంద్ర స్ధితిర్ భూతాయ నమ:
108. ఓం శ్రీ సమస్త దివ్య సత్పురుష, సకల యుగావతార, సమాధి మందిర బాప్తిస్మ, నేతి హరి హంస కాళీ బాబా
చిన్మయ చైతన్య సర్వకేంద్ర స్వామియే నమ:
109. ఓం శ్రీ సర్వేశ, సంపూర్ణ భగవన్, సర్వ సుప్రీం, సర్వాతీత సూపర్ పవర్, విశ్వవిధాత జై సర్వకేంద్రాయ నమ:

బాబా సర్వకేంద్రుల సర్వమతారాధ్య అష్టోత్తర శత నామ మహా వాక్యార్చన సమాప్తం. భక్తులు వారి వద్దనున్న అక్షింతలను వరుసగా వచ్చి శ్రీవారి శిరస్సుపై, పాదములపై వేసి అంజలి ఘటించి వారి వారి స్ధానంలోకి వెళ్ళి కూర్చుండవలయును.

ధన్యతా ప్రవచనములు:

1. సుమతులై ధన్యులు కండి. భగవన్మతులు ధన్యులు. వీరలు భవ బంధ రహితులు కాగలరు.
2. ఆత్మ స్ధైర్యము గలవారు ధన్యులు. వీరలు దేనినైనను సాధించ గలరు.
3. అమృత హృదయులు ధన్యులు.
4. ఆత్మ విషయంలో దీనులైనవారు ధన్యులు. వీరలు ఓదార్చబడి దివ్య స్ధితిలో ఉద్ధరించబడెదరు.
5. సర్వమత సమన్వయ హృదయులు ధన్యులు. వీరలు సర్వమతముల సమానముగ గౌరవిస్తారు.
6. ఆలాగే సర్వమతస్ధుల వారిచే గౌర వింప బడెదరు.
7. కరుణాంతరంగులు ధన్యులు.దయార్ధ్ర హృదయులు ధన్యులు. వీరలు దేవుని దయకు పాత్రులయ్యెదరు.
8. అచలాత్మ స్వభావులు ధన్యులు.
9. పర్వతనిష్ఠగల వారు ధన్యులు. చలన ప్రకృతి యనెటి పిల్ల గాడ్పులు వీరలను కదిలించలేవు.
10. నీతి నిమిత్తం శ్రమపడువారు ధన్యులు.
11. చిత్తశుద్ధి గలవారు ధన్యులు.
12. హృదయశుద్ధి గలవారు ధన్యులు. వీరలు ఆత్మ సాక్షాత్కారము నొందగలరు. అనగా దేవుని దర్శించెదరు.
13. నిష్కల్మష హృదయులు ధన్యులు.
14. అనసూయ స్వభావులు ధన్యులు.
15. సర్వైక్య స్వభావులు ధన్యులు.
16. స్వకీయాత్మ పరిజ్ఞానులు ధన్యులు.
17. మానవతా స్వభావులు ధన్యులు. వీరలు దివ్యానుభూతి నొందెదరు.
18. భగవన్మతావలంబులు ధన్యులు. వీరికి పతనం లేదు.
19. నిర్మల గంగా స్వభావులు ధన్యులు. వీరలు ఉచ్చ నీచముల పాటించక ఏ బేధములెంచక సర్వుల పావన పరచెదరు.
20. ఏకాత్మ నిష్ఠులు ధన్యులు. వీరలకు అశాంతి లేదు.
21. నిర్గుణ, నిస్వార్ధ చిత్తులు ధన్యులు. వీరలను ఈర్ష్య పీడించదు.
22. పరమార్ధ చింతన గలవారు ధన్యులు. వీరలకు లౌకిక పరితాప భీతి లేదు.
23. ఆత్మానందులు ధన్యులు. వీరికి దు:ఖం లేదు.
24. నిర్వాణ హృదయులు ధన్యులు. శారీరక, మనో నేత్రాశలు పీడించవు.
25. అలౌకిక స్వభావులు ధన్యులు. లౌకిక భ్రమలు వీరలను స్పృశించవు.
26. సర్వత్ర సమబుద్ధి గలవారు ధన్యులు. వీరికే సమాధి యోగ సిద్ధి.
27. దివ్యోపదేశములను మెలకువతో ఏకాగ్రచిత్తులై విని, అనుసరించు వారు ధన్యులు.
28. సజ్జన గంగాభిషేక సహృదయులు ధన్యులు.
29. సద్గుణ సౌశీల్య హృదయులు ధన్యులు.
30. శుభచిత్తులు ధన్యులు. వీరికి శకున బాధ లేదు.
31. నిత్యానిత్య వస్తు వివేకులు ధన్యులు.
32. ఆత్మౌపమ్య భావనిష్ఠులు ధన్యులు. నా ఆత్మే సర్వ భూతములలో అంతరాత్మగ భసిల్లుచున్నదనెటి భావం కలుగును.
33. సంఘ సంస్కరణాభిలాషులు ధన్యులు.
34. సుస్వాగత హృదయులు ధన్యులు.
35. ప్రశాంత స్వభావులు ధన్యులు.
36. జీవేశరహిత అచలాత్మనిష్ఠులు ధన్యులు. వీరలకు అమృత బీజ ఫలం నాది, నేనే.
37. నిర్దోష ప్రసంగులు ధన్యులు.
38. స్వస్వరూప సంధాన స్వనిష్ఠ నొందిన యుత్కృష్ఠ యోగీంద్రులు ధన్యులు.
39. పరమ శివదృష్టి గలవారు ధన్యులు. సర్వత్ర చైతన్యమును దర్శించగలరు.
40. కేవల పరమాద్వైత అచల పరిపూర్ణ పర:బ్రహ్మ, సర్వ మతా రాధ్య, చిన్మయ చైతన్య సర్వకేంద్రస్వామి కృపా
కటాక్ష పాత్రులు పరమ ధన్యులని ఎలుగెత్తి చాటుము.
41. సత్యాత్మ జ్ఞాన స్వభావులు ధన్యులు.
42. సత్య సౌజన్య హృదయులు ధన్యులు.
43. సర్వ సమరస చిత్తులు ధన్యులు.
44. సర్వమత సమన్వయ హృదయులు ధన్యులు.
45. స్వానుభవ శీలురు ధన్యులు.
46. సాధుశీలురు ధన్యులు.
47. సత్య సద్గుణ శోభిత హృదయులు ధన్యులు.
48. నిష్కల్మష హృదయులు ధన్యులు.
49. నిత్య పరిశుద్ధ, ధర్మ సుధ, సద్వాక్ సుమతీశ్వర, అనంత, ఆత్మ రవిశోభిత హృదయులు ధన్యులు.
50. ఆధ్యాత్మిక దృష్టి సంపన్నులు ధన్యులు.
51. నిరాడంబర, నిర్గుణ చిత్తులు ధన్యులు.
52. గంభీర సాగర హృదయులు ధన్యులు.
53. సత్య సంకల్ప సిద్ధులు ధన్యులు.
54. అమృత హృదయులు ధన్యులు.
55. స్వాత్మార్చన శీలురు ధన్యులు.
56. విశుద్ధ, సత్త్వ, వినిర్మల చిత్తులు ధన్యులు.
57. అకళంక స్వభావులు ధన్యులు.
58. ఆత్మానంద వారాశిలో ఈదులాడువారు ధన్యులు.
59. సుధీర, ఘనవీర స్వభావులు ధన్యులు.
60. అద్వయ, అచల పరిపూర్ణ, సర్వకేంద్ర నిష్ఠులు మరీ మరీ పరమ ధన్యులు.


బాబా సర్వకంద్రుల స్వముఖత భాష్యం. అష్టాదశ అతీత మహా సూత్రవాక్యమాల. ఈ సూత్రమాలను మీ కంఠహారముగ ధరించి ధన్యులు కండి.


1. అవిధ్యాంధకార తమో ప్రకృతి పంజరబద్ధులై విలపించుచు, అగ్నిలో పడిన మిడుతలవలె అల్లడతల్లడ మందుచు, ప్రయాసపడి, సంసార భారమును మోఒసుకొని పోవుచున్న సమస్తమైన వారలారా! విశ్వసించి నా సన్నిధికి రండి. పరమ ఆధ్యాత్మిక ప్రశాంతిని కలుగజేయుదును.

2. జైబాబా సర్వకేంద్రా! నమో విశ్వగర్భా అని స్మరించుటయే సకల శుభములకు మూలము. ఈ స్మరణతో మానసికముగా నన్ను చేరిన వారు కాగలరు. నన్ను చేరుట యనగా లవణం నీటిలో కరిగిపోయినట్లు నా స్వరూప ప్రజ్ఞతో భాసిల్లవలయును.

3. నా కటాక్షము నిర్భంధముగా ఉండదు. హృదయస్ఫూర్తిగా స్వర మెత్తి ప్రార్ధించి, స్దుతించినవారికి సమాధాన, అనుగ్రహ, ఆశీస్సులు అందించబడును.

4. సృస్ట్యాది మూలకారణ నిలయుడనైన నన్ను ఎరిగిన సర్వం పొంది నట్లే. సర్వశక్తులకు ఆకరమైన నాయందే సీత, సాధ్వి అనసూయ, సావిత్రి, సక్కుభాయి, గంగ, గాయత్రి, తులసి, అరుంధతి, సరస్వతి, లక్ష్మీ పార్వతి, లలిత, దుర్గాభవాని, కాళీమాత లున్నారు. సమస్త దేవతా దేవుండ్లు నా స్వరూప కాంతులు. నే వికసించిన జీవిని కాదు. శ్వత:స్సిద్ధ పరాత్పరుడను. శృష్టి, స్ధితి, లయాదేశ కర్తను.

5. మీ గృహములను మీ మత ధర్మానుసారం ఆధ్యాత్మిక వాతా వరణం సృష్టించుకోండి. మీ పూజా మందిరములు నిత్యము దీపా రాధనలతో భాసిల్ల వలయును. సమస్త జ్యోతులు స్వపరంజ్యోతినైన నా పేరిట అర్చన, అర్పిత హారతులు. మీ హృదయాలయాలలో మా పీఠమును కోరుచున్నాము. దీనికి మించిన సాయుజ్య పరమ పద సద్గతి లేదు.

6. సమస్త అరాధన, అనుభూతులకు అతీతుడనైన నేను సర్వలోక పర్యంతం, భూనివాసుల ఆత్మశ్రేయస్సును గోరి సకల దేవతా దేవుండ్లుగ అవతరించితిని. అందులకై ఏమార్గమును దూషించక మీకు నచ్చిన మార్గములో నన్ను చేరండి.

7. ఒక చెరువుకు నాలుగు రేవులున్నాయనుకోండి. ఏరేవు గుండా నీరు తెచ్చుకున్నను తటాక జలాశయం ఒక్కటే. అలాగే మఠాశ్రమాల లో జరుగు జప ధ్యానుల, దేవాలయములలో జరుగు పూజల, మసీదుల లో జరిగే నమాజుల, చర్చీలలో జరిగే ప్రార్ధనల మూల సారాం శము ఒకటేనని గ్రహించిన మత ఘర్షణలుండవు.

8. బెల్లము లేదా చక్కెరతో అనేక రకముల తీపి పదార్ధములు చేయ వచ్చును. దేని రుచి దానికే ఉంటుంది. ఆ పదార్ధములన్నింటి లోని తీపికి మూల పదార్ధము బెల్లము లేదా చక్కెర ఐనట్లుగా, ఎవరు ఏమతము అవలంభించినా సర్వమతారాద్య స్వామి భగవన్ ఒక్కరేయని గ్రహించిన చాలు.

9. సజీవామృత జలగంగ నా ఆధీనములో గలదు. దాహముగల ప్రతి వారు నా సన్నిధికి రండి. మీ ఆత్మీయ దాహం పూర్తిగా తీర్చ బడును.

10. నన్ను అరాధించు గృహమందిరము సమస్త దేవతా దేవుండ్లకు నిలయమై ప్రకాశించును. ఏందులకనగా ప్రతి ఆరాధ్యమూర్తి నాకు అభిన్నము కనుక.

11. సర్వలోక పర్యయంతము, సమస్త ఆరాధనా స్ధలములు నాయందలి బ్రాంచీలు. సర్వాధిపతి నేత ఒక్కరేయని తెలుసుకోండి.

12. మీరు గాంచు ఈ స్ధూల భౌతిక దేహానంతరము సైతం నేను నేను గానే సర్వఖండ పరిపూర్ణ, చిన్మయ, చైతన్య సర్వకేంద్రుడ నై ఉండెదను. అట్టి నా ఉద్యమ ప్రచారము ఏనాడు స్ధంభించదు. స్వస్వరూప సంధాన, స్వనిష్ఠ స్ధితినొందిన ప్రతి సుజ్ఞానిద్వారా నా ఉద్యమ నిర్వహణ కార్యక్రమము ఆరంభించబడును.

13. నన్ను ఆరాధించు గృహములలో క్షామ, అరిష్ట, గ్రహబాధలు, భయవిపత్తులు అదృశ్యమగును. ఏనాటికైనను మీ విశ్వాసములలో తేడా రావలసినదే గాని నా అనుగ్రహములో తేడా ఉండదు. త్రికరణ శుద్ధిగా కోరిన కోర్కెలు విశ్వవిధాత సూత్రానుసారము నెరవేర్చబడును.

14. మీరలు ఏ ట్రాన్స్ ఫారమునుండి విద్యుత్తును మీ గృహములలోనికి తీసు కున్నను సమస్త ట్రాన్స్ ఫారములనుండి ప్రసారమగు విద్యుత్కెంద్ర శక్తి ఒక్కటే. అలాగే మీరు ఏ గురూపదేశము పొంది, ఏ ఆరాధ్య మూర్తిని ప్రార్ధించినను సర్వమతారాధ్యులకే చెందునని మరువ రాదు. తెలిసియో, తెలియకనో, ప్రత్యక్షముగా గాని, పరోక్షముగా గాని ప్రతి వారలు ఏదియో ఒక రూపాన నా మార్గాన్ని అనుస రిస్తున్నారు.

15. బిడ్డా! నా నిమిత్తము మీ నిరీక్షణ ఏనాడు వ్యర్ధము కాదు. శ్వాసకన్న అతి సన్నిహితమై మీ అందరిలో నేను సర్వేకత్వ స్ధితిలో ఉండియే మీ ఎల్లర రక్షణ భారము స్వీకరించితిని. కావున సర్వాత్మ స్ధైర్యులై, అచల పర్వతనిష్ఠ నొందండి.

16. సకల వేద శాస్త్రముల ప్రేరకుడనైన నా పుక్కిటిలో సమస్త జ్ఞాన నిధులు గలవు. ఆయా సమయ సంధర్భములను బట్టి అవి బహిర్గతమగును.

17. మీరు గాంచు ఈ భౌతిక శరీరము నాది కాదు, నేను కాదు. అనంత గగనాలయ చిన్మయ, పరతత్త్వ ఆకాశవాణి వార్తలు ప్రసారము చేయు రేడియో వంటిది. విశ్వవిభూతిర్మయ, అలౌకిక, పరమై శ్వర్య, సర్వశక్తి సంపన్నుడనైన సర్వకేంద్రుడను. ఇట్టి నేను ఒకరికి జనించుటగాని, నాకు ఒకరు జనించుటగాని ఇంతవరకు జరుగ లేదు.
ఇక ముందు జరుగబోదు.

18. సమస్త యుగావతారముల, సమస్త దివ్య సత్పురుషుల సమాధి మందిరముల (గోరీల), సమస్త తీర్ధయాత్రా స్ధలముల వద్ద లభించు శాంత్యానంద ఆత్మ సుఖ సిద్ధులు కేవలం శ్రీవారి సాకార సమాధి మందిరము చెంత సులభ్యం. శక్తి, ఘనత, మహిత, అనుగ్రహ, సమాధాన ప్రభావములు నా ఆధీనములు. ఈ ఆంతర్యము యోగీశ్వరులకు మాత్రమే నిండా గ్రాహ్యం.

సర్వమతారాధ్య స్తోత్రగీతం

కైలాస చలవాస కైవల్య ధామ
మమ్మేలు కరుణించు ఓ పరంధామ //కైలాస//

జ్యోతిర్జ్యోతి ఓ స్వయంజ్యోతి
సర్వాతీతపు స్వపరంజ్యోతి //కైలాస//

మా తండ్రి మా ధాత మా నిష్ఠ దైవామ
కరుణించు కడతేర్చు ఓ కాలతీతామ //కైలాస//

జగదీశ పరమేశ ఓ పరంధామ
సకలేశ సర్వేశ సంపూర్ణ ధామ //కైలాస//
హరిరాం శ్రీరం జయరాం ఇంక
శ్రీహరీం శ్రీహరీం శ్రీనిష్కళంక //కైలాస//

పరమగురు పరమపిత పరమేశ్వరయ్యా
మా పరితాపముల మాంపు పరాత్పర కేంద్రులయ్యా //కైలాస//

(సకల ధర్మతత్త్వ నిలయంబైన ఈ ప్రార్ధనను ఎవరు నిత్యం త్రికరణ శుద్ధిగ పఠించి స్మరించెదరో వారలు సకల దోషవర్జితులై పరమ పదాధికారులు అగుట తధ్యం. ఇది నిజం).


ప్రార్ధన ::(ఊదయం)

హరిఓం హరిఓం హరిఓం
ఓంశ్రీభగవతి పరమపిత సర్వకేంద్రాయ నమ:

ఓంశ్రీ అత్యద్భుత, మహిమాన్విత, సర్వాకర్శణ, సర్వశక్తి నిలయ, సంపూర్ణ దైవమా, హే అల్లాప్రభు, సర్వేశ భగవన్, హరి విశ్వగర్భా, నిత్య పరిశుద్ధ సత్య పరమాత్మా, కరుణించు దేవా, కైవల్య ధామా, హల్లేలుయా. ఓం సర్వాంతర్యామి, జగద్రక్షకా, జగదాత్మా, విశ్వాత్మా, విశ్వగర్భా, విశ్వాతీత పరమ ప్రభు, పరమ పావన, స్వప్రకాశ, అప్రమేయానంతానంత, సర్వలక్షణ, విలక్షణ సంపూర్ణ భగవన్. సర్వ సృష్టి కర్తవు, జగన్నియామకుడవు, సగుణ, నిర్గుణ, నిరాకార సర్వవ్యాపివి, సర్వసాక్షివి, సర్వధారి, సర్వాధిష్ఠాన పరబ్రహ్మమా, మెహెర్ నిలయా, సర్వేశ్వరేశ్వరా, హే కారుణ్య నిధీ, దయాసాగరా, దేవదేవా, నా మొర ఆలకించు తండ్రీ! ఈ విశ్వము అంతయు నీ ఇచ్చకు ప్రతిబింబము. నీ దివ్య సంకల్పమునకు తిరిగులేదు. మహారాజాధి రాజపూజితుడవైన నీ ఆజ్ఞకు ఎదురు లేదు. నీవు ఏది అంటే అది అక్షరాలా జరిగి తీరుతుంది. శర్వశక్తి సంపన్నా! ఫరమాద్భుత, మహిమాన్విత దివ్య తేజా! నీ చిత్తము సదా సర్వత్రా నెరవేరుతుంది. ఆమేన్!

విశ్వవిధాత, నీ విధి అనుల్లంఘనీయము. ఈ లోకములో ఏ సమయమున ఏది జరుగవలయునో అదంతయు నీ ఏర్పాటే. నీవు విడదీయ గలవు. తిరిగి ఐక్యపరుచ గలవు. నీవు తలంచిన కాని పనిలేదు. ఈ సమస్తము నీ శక్తికి నిదర్శనము. నీకు సాటిలేదు. నీవే సర్వమునకు మూలకారణము. అందుకే నేవే నాకు దిక్కు. ఈ అకాశముక్రింద ఏనామమున రక్షణ లేదు. నీవే నా ప్రాణము, గానము, ధ్యానము. నీవే నా అంతరాత్మ. నీవు సర్వ లయుడవు, సర్వమయుడవు, సర్వ ప్రియుడవు, సర్వ పరిపూర్ణ పర:బ్రహ్మవు. నీకన్యధా నాకెవ్వరును లేరు. నాది, నేను మచ్చుకు లేను. ఉన్నదంతయు నీదియే. అట్టి నిన్ను మాత్రమే హృదయస్ఫూర్తిగా ఆశ్రయించితిని. ఇక నీ చిత్తానుసారము నన్ను నడుపు. కరుణించి బ్రోవుమ, జై సర్వకేంద్రా, పరాత్పరా, పరమపితా, నమో నమ: జై సర్వకేంద్ర బాబాకి జై.

సర్వమతారాధ్య విశ్వప్రార్ధన

శ్రీం గం జై సర్వకేంద్ర భగవన్ భజ! విశ్వ విభూతిర్మయ, విశ్వవిధాత, ఓం శ్రీమధ్విరాట్ విశ్వ చైతన్య సృస్టి చక్రి యెహోవా యెఖుదా! మౌలానా! బిస్మిల్లా!శ్రీహరల్లాహు అక్బరసూలల్లా, హల్లేలూయ, విఘ్నాది నారాయణ, పరమ శివాది పర్రశక్తి, అహర్మజ్దా, మెహెరీష పరబ్రహ్మ, పరమ పిత సర్వాత్మ భగవన్, సచ్చిదానంద సమస్త సత్య సద్గురు నానక్, అవధూత దత్తాత్రేయ జ్ఞాన యోగీశ్వరా, శబరిమల, శంబల, కల్కిరూప, సర్వమతారాధ్య, సర్వావతార, సత్య జీవనమార్గ సాయేసు ప్రభు, కృష్ణ, జిన, బుద్ధ దేవ, శ్రీగురు రాఘవేంద్రం.

సర్వ వ్యాపక, సర్వ రక్షక, స్వపరంజ్యోతి, సర్వాతీఅ నేతిహరి కాళీ బాబా, సర్వ సాక్షి, సర్వాధార, సర్వాధిష్టాన, సర్వస్వరూప, సర్వాకార నమో విశ్వగర్భా! జైసర్వకేంద్రా! పాహిమాం పాహి! అన్యధా శరణం నాస్ధి! త్వమేవ శరణం మమ:!!

ఓం సంపూర్ణ దైవమతము విశ్వ వ్యాప్తముగ వర్ధిల్లును గాక! సంపూర్ణ దైవచిత్తము సదా సర్వత్ర నెరవేరు గాక! అమేన్. భూ, జల, అగ్ని,వాయు, ఆకాశాది పంచభూతములు శాంతించును గాక! అష్ట దిక్కులు, అష్టదిక్పాలకులు శాంతించుదురు గాక! పరాప్రకృతి, విశ్వమాయ శాంతించును గాక! సమస్త మానవ హృదయాలు శాంతించును గాక! శుభం భూయత్.

ఓం సర్వేత్ర స్సుఖినస్సంతూ
ఓం సర్వేజనా సుఖినోభవంతూ
లోకాస్స్మస్తా సుఖినోభవంతూ
శాంతి ! శాంతి !! శాంతి !!!

బాపూ మంగళహారతి

సర్వ మంగళ నమా బాపూ బాపూ
సర్వ వినుత శాంతిదాత బాపూ బాపూ
మాలో మాకు బేధ బుద్ధి బాపీ బాపూ
మాలో నిలుపూ మీదు జ్యోతి బాపూ ఆపూ //సర్వ మంగళ//

పరమ పదవి బాట జూపు బాపూ బాపూ
మా పరమ పితవు నీవేనయ్యా బాపూ బాపూ
ఒక్కసారి బోధించుము బాపూ బాపూ
ఈ విశ్వమంత తరలునయ్యా బాపూ బాపూ //సర్వ మంగళ//

కరుణతో మమ్మేలుమయ్య బాపూ బాపూ
మీ కారణమేమొ దెల్పుమయ్య బాపూ బాపూ
సుస్ధిర సూచనలివ్వవయ్య బాపూ బాపూ
మమ్ము మీలో జేర్చుకోండి బాపూ బాపూ //సర్వ మంగళ//



అన్నల్లరా రారండి మీ కన్నుల్లారా గనరండీ
అక్కల్లారా రారండి బహుచక్కని దారి తెలియండి
చెల్లెల్లారా రారండి చిల్లర భ్రమలను వదలండి
తల్లుల్లారా తరలండి ఈ తల్లిని తెలుసుకోరండి

(అమ్మ) స్వాముల పూజకు వేళాయె పయనమై రారే చెలులారా
ఎన్ని గ్రంధముల విరచించారో ఎన్ని బోధలను ప్రవచించారో

స్మరణ మాత్రమున పులకాంకితమగు స్వామి బాబాను కొలవండి
సర్వజ్ఞ స్తోత్రులు స్వాములు సర్వ మతారాధ్య దేవులు //స్వాముల//

సర్వలక్షణ విలక్షణ ప్రభువులు సర్వోన్నత పీఠాధీశులు
సర్వోద్ధారక నిమిత్తము సాకార రూపులై వెలసిరిగ //స్వాముల//

స్వామి సాకార రూపము ధన్యము బాబా కృపాశీస్సులే శరణ్యము
పరమ దయానిధి ప్రభువులు ప్రాత:స్మరణీయ పూజ్యులు //స్వాముల//

సృష్టి, స్ధితి, లయాతీతులు సర్వ పరిపూర్ణ పరబ్రహ్మ తేజులు
జగజ్జీవేశ్వరిహ పర నిలయులు బాబా భవరోగ రాహిత్య భగవంతులు //స్వాముల//

ఎల్లదైవముల మిన్నండి ఎలుగెత్తి చాటి చెప్పండి
కలగాదు ఇది నమ్మండి చల్లని అల్లా పదవండి //స్వాముల//

అమ్మల మించిన అమ్మండి స్వపరాది శక్తి స్వామండి
సన్మతులై మీరు నమ్మండి స్వర్గ ధామము చేరండి //స్వాముల//

తురీయాతీత ప్రభు స్వాములు సర్వాత్మ తత్త్వ భగవానులు
సుజ్ఞాన సరస్వతీ గర్భులు సకల వేద శాస్త్రముల ప్రేరకులు //స్వాముల//

జయజయ నాధము సలుపండి ఝఢియక ముందుకు రారండి
విశ్వశాంతిని కోరండి ప్రభు వీరజ్యోతులై నిలువండి //స్వాముల//

ద్వేష భావము వదలండి ఆత్మౌపమ్య నిష్ఠలో నిలువండి
అఖిల భూతముల సేవించండి అవనికి వెలుగై నిలువండి //స్వాముల//

మధురం మధురం ఈ సమయం మన బాబా స్మరణం అతి మధురం
సర్వకేంద్రులనె అక్షరమాల సమస్త యుగముల జపమాల //స్వాముల//

భేరి మృదంగ వాద్యములతో మంగళహారతి శోభలతో
పిన్నలు పెద్దలు రారండి మన స్వామి పూజలో తరించండి //స్వాముల//


బాబా సర్వకేంద్రుల శరణు గీతం

శరణం శరణమయా బాబా
శరణం శరణమయా
శరణంబనిన మరణం లేదు
సర్వకేంద్ర బాబా జై సర్వకేంద్ర బాబా

జగము నీవే జనము నేవే సకల ప్రాణులాశ్రయం నీవే
సృష్టి నీవే స్ధితియు నేవే లయము నేవే బాబా
నామము నీవే రూపము నీవే
నామ రూపాతీతము నీవే //శరణం//
కాలాతీతుడవు బాబా కైవల్య ధాముడవు బాబా
తేజస్తేజుడవు బాబా స్వపరంజ్యోతుడవు బాబా //శరణం//

అచ్యుతీశ్వరుడవు బాబా ఆద్యంత రహితుడవు బాబా
గురోర్గురుడవు బాబా నీవు గోప్యాతి గోప్యుడవు బాబా //శరణం//

సర్వజ్ఞ స్తోత్రుడవు బాబా నీవు సర్వావతారుడవు బాబా
సర్వస్వరూపుడవు బాబా నీవు సర్వాకారుడవు బాబా //శరణం//

సర్వస్ధల వాసుడవు బాబా నీవు సర్వాంతర్యాముడవు బాబా
అమృతహృదయుడవు బాబా అచల ప్రదీప్తుడవు బాబా //శరణం//

పరాత్పరుడవు బాబా నీవు పరిపూర్ణ తేజుడవు బాబా
దయాసాగరుడవు బాబా నీవు ధర్మ స్వరూపుడవు బాబా //శరణం//

ప్రకృత్యాతీతుడవు బాబా నీవు పరిశుద్ధాత్ముడవు బాబా
అత్యాశ్రమ వాసుడవు బాబా ఆనంద నిలయుడవు బాబా //శరణం//

అందరి దేవుడవు బాబా అందని దేవుడవు బాబా
విశ్వసించి నిను ఆశ్రయించిన
వరముల నిచ్చెదవు బాబా కరుణను చూపెదవు బాబా //శరణం//

గళమెత్తి పిలిచిన బాబా నీ గమ్యం చూపెదవు బాబా
స్వరమెత్తి స్ధుతించిన బాబా
మా సన్నిధి చేరెదవు బాబా సద్గతి చూపెదవు //శరణం//

కోరి భజించిన కోర్కెలు దీర్చు కేంద్ర పితమా దైవమా
పతిత పావనుడవు బాబా పావన చరితుడవు బాబా //శరణం//

విశ్వోద్ధారక నిమిత్తము ఈ వసుధను వెలసిన ప్రభుదేవా
నీ సాకార రూపము ధన్యం బాబా కృపాశీస్సులే శరణ్యం//శరణం//


బాబా సర్వకేంద్రుల స్తోత్ర గీతం

ఏమని పిలువాలిరా బాబా నిన్నెవరని పిలువాలిరా

ఏ పిలుపులకందని నిన్నేమని పిలువాలిరా
బాబా నిన్నేమని తలువాలిరా

ఏ పలుకులకందని నిన్నేమని పలుకాలిరా
బాబా నిన్నేమని తెలుపాలిరా

ఏ వాక్కులకందని నిన్నేమని చెప్పాలిరా
బాబా నిన్నెవరని చెప్పాలిరా

ఏ చూపులకందని నిన్నేమని చూడాలిరా
బాబా నీవెవరని చూపాలిరా

సర్వస్వరూపా నిన్నేరూపున గాంచాలిరా
బాబా నిన్నేరూపున చూపాలిరా

ఏ స్పర్శలకందని నిన్నేమని స్పృశించాలిరా
బాబా నిన్నెవరని స్పర్శించాలిరా

సర్వస్థలవాసా నిన్నేచోట వెదకాలిరా
బాబా నిన్నెందెందు గాంచాలిరా

అనంతానంత నిన్నేమని అర్ధించాలిరా
బాబా నువ్వెవరని అర్చించాలిరా

సర్వాత్ముడవైన నిన్నేమని భజించాలిరా
బాబా నిన్నేమని జపించాలిరా

ఏలీల గోలలులేని నిన్నేమని స్థుతించాలిర
బాబా నిన్నేమని స్మరించాలిరా

దృక్ దృశ్యాతీత నిన్నేమని దర్శించాలిరా
బాబా నీవెవరని దర్శించాలిరా

ఏ గుర్తులకందని నీపై గురి ఎట్ల నిలుపాలిరా
బాబా నీ గుట్టెట్ల తెలియాలిరా

ఏ కొలతలకందని నిన్నేమని కొలువాలిరా
బాబా నీవెవరని తలువాలిరా

చిన్మయాత్ముడవైన నిన్నేమని చింతించాలిరా
బాబా నిన్నేమని స్మరించాలిరా

దివ్యాత్మ సింధు నిన్నేమని ధ్యానించాలిరా
బాబా నిన్నేమని కీర్తించాలిరా

స్వపరంజ్యొతివైన నీకేరూప మివ్వాలిరా
బాబా నీకే హారతివ్వాలిరా

పరాత్పర తత్త్వనిలయ నిన్నేమని ప్రార్థించాలిరా
బాబా నువ్వెవరని పూజించాలిరా

విశ్వ గర్భుడవైన నిన్నేమని వీక్షించాలిర
బాబా నిన్నేమని ప్రకటించాలిరా

గోప్యాతిగోప్య నిన్నేగుడిలో నిలుపాలిరా
బాబా నిన్నే బడిలో నిలుపాలిరా

ఏ మహిమలకందని నిన్నేమని పొగడాలిరా
బాబా నీవెవరని పొగడాలిరా

ఏ ముడుపులకందని నిన్నేమని మ్రొక్కాలిరా
బాబా నువు మాకెలా దక్కేవురా బాబా నువు మాకెలా చిక్కేవురా

స్వయంభు: స్వత:స్సిద్ధ సర్వోన్నత పీఠాధీశ్వర బాబా సర్వకేంద్ర భగవన్ కీ జై!


బాబా సర్వకేంద్రుల ఆరాధ్య గీతం

సర్వకేంద్రుల విశ్వగర్భుల స్వరమును వినరండోయ్
బాబా స్వరమును గనరండోయ్
సర్వమతముల సారముజెప్పెడి స్వామిని గనరండోయ్
మన స్వామిని నమ్మండోయ్
దైవము నీవనె సత్యము జెప్పెడి బాబను గనరండోయ్
ఘన స్వామిని గొలవండోయ్
పాపలలో పసిపాపగ మెలగెడి స్వామిని గనరండోయ్
మన స్వామిని దెలియండోయ్
నేతి హరి బాబా నేత్రము జూడగ జ్ఞాన నేత్రులై రారండీ
సుజ్ఞాన నేత్రులై తరలండీ
పరమ దయానిధి పావన చరితుని పాదములొత్తండీ
ఘన పాదములొత్తండీ
త్రిక్సూత్ర ధారుని త్రిగుణాతీతుని తెలువగ రారండీ
మీరూ కొలువగ రారండీ
సుమతీశుల సుజ్ఞానుల జేసెడి పరాత్పరు గనరండీ
పరమాత్మను గొలవండీ
అహింసయే మన పరమ ధర్మమని శపధము చేయండీ
మీరూ చక్కగ నడవండీ
శ్వాసవలెను విశ్వాసము గలిగి శాస్త్రము చదవండీ
మన స్వామిని నమ్మండీ
గుడిలో దేవుడు లేడను సత్యము చక్కగ దెలియండీ
మీ హృదయంలో గనరండీ
దైవస్ధితియె నీ నిజతత్త్వంబని ధైర్యముగుండండీ
ఇలలో ధన్యత నొందండీ
దేహమనిత్యము దైవము సత్యము ముమ్మాటికి నిజమండీ
ఈ సత్యము దెలియండీ
దేహధారియై మనమధ్యన వెలసిన దైవము గనరండీ
మీరూ ధన్యులు గారండీ
- నేతి విజయదేవ్
(బాబా సర్వకేంద్రుల ప్రధాన పాదజ్యోతి)

మంగళహారతి

మంగళం దైవ తీర్ధాయ
మహనీయ సర్వాత్మనే
మంగళం నిర్వికారాయ
నిరాకారాయ మంగళం

మంగళం నిత్య పూర్ణాయ
నిర్మలాయ నిరంజనే
న్రాలంబాయ నిత్యాయ
నిర్విశేషాయ మంగళం

మంగళం ద్వంద్వ హీనాయ
మాయాతీతాయ మంగళం
సచ్చిదానంద రహితాయ
సర్వాతీతాయ మంగళం

మంగళం అచలానంత దేవాయ
అమరవాక్య విలక్షణే
నిరాధారాయ నిత్యాయ
నిష్కళంకాయ మంగళం
సమస్త సన్మంగళాని బవంతు.

హారతి:

నిరాకార నిరంజన నీకు హారతి
సర్వాకార సర్వకేంద్ర మా సర్వం హారతి
నేత్య్హరి చిన్మయ బాపూ మా ఆత్మ హారతి
సకలలోక దివ్య చరిత స్వామి హారతి
సర్వాతీత ప్రభువా నీకు సర్వం హారతి మా సర్వం హారతి.

సర్వకేంద్రోపదేశ పత్రిక

జై సర్వకేంద్ర ఓం గం గజగణపతియే నమ:
నిద్రలేచిన పిదప దేహస్తంభన మంత్రము.
ఆం ఐం శిరము గణపతి గాచుగాక
ఉం ముఖము మహాలక్ష్మీ దేవి గాచుగాక
శౌ కంఠము కాళీదేవి గాచుగాక
ఖం వక్షము రుద్రుడు గాచుగాక
క్లీం ఉదరము భైరవుడు గాచుగాక
ఓం ఐం నడుము ఊరువులు మహాలక్ష్మి గాచుగాక
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ:

తత్త్వం (బేహాగ్ ఆదితాళము)

పరమపితా మా ప్రార్ధన వినురా
పాపములో బడనీయకురా
శరణాగత రక్షకుడని నిన్నే
శరణుజొచ్చితిమి విడువకురా /పరమపితా/

పరులను మావలె భావించెడు మది
బరమాత్మా మాకొసగుమురా
నిరతమునంతట నీమహిమలగను
నిరుపమ విద్యనె నేర్పుమురా /పరమపితా/

నీయాజ్ఞలనే నెరవేర్పగమది
నిర్మలభక్తిని గొలుపుమురా
న్యాయ సత్య కరుణాలయ మాలో
నద్భుత నాట్యము సల్పుమురా /పరమపితా/

శాంతిధామమా స్వాంతమునందలి
చింతల నీవెగ జిమ్ముమురా
అంతరంగమను నరవిందము నీ
కెంతయు ప్రీతి నర్పింతుమురా /పరమపితా/


తత్త్వం (శంకరాభరణం – ఆది తాళం)

హరినామంబే పరమ ధనంబని
యైహికమందని జూడుమురా
మరిమరి తారా మండల మంటగ
మధుర స్వరమున పాడుమురా /హరినామంబే/

తళికుబెళుకు సొమ్ములకై భ్రమపడి
తత్తరపడి చెడిపోకుమురా
పలుకున తలపున కార్యంబున శ్రీ
నిలయుని పదములు తాకుమురా /హరినామంబే/

ఘనలోభ మహా గహనాంతరమున
కంటకపడుటిక చాలునురా
పనవి పనవి నీ బాధలు దెలిపిన
పరమాత్ముడె నిన్నేలునురా /హరినామంబే/

పాపభయద ఘన తిమిరంబున
దీపంబిదియని తెలియుమురా
ఆపన్నార్తి తమోహరణం బాబా
అమృత జ్యోతిని గలియుమురా /హరినామంబే/

శ్రీ నేతిహరి బాపూ సాకార దర్శన భాగ్యం

గతం పాపం గతం దు:ఖం
గతం దారిద్ర్య మేవచ
ఆగతా సుఖ సంపత్తి:
పుణ్యాచ్చవ దర్శనాత్


తీర్ధ గ్రహణము

అజ్ఞాన మూల హరణం జన్మ కర్మ నివారణం
జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం శ్రీ నేతిహరి పాదోదకం పిబేత్

అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి వినాశనం
దైవతీర్ధ పాదోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే

మత్పూజా విధానము (ఆంతర్యము) - (బాబా సర్వకేంద్రుల స్వముఖత భాష్యం)

అత్యంత సావధానులై, సర్వేకాగ్ర శుభచిత్తముతో వినుడి.

మత్ప్రియాత్మ జ్యోతులారా! నదీనాం సాగరో గతి: అనగా నదులన్నియును చివరకు సముద్రములో కలియునట్లు సర్వలోక పర్యంతం జరుపబడుచున్న స్తోత్రార్చన, ఆరాధన, పూజలన్నియును నా సాన్నిధ్యమునకే వచ్చుచున్నవి. తెలిసియో, తెలియకనో ప్రతివారలు నా దిశకే పయనిస్తున్నారు.

ఏనుగు పాదమందు సమస్త జీవరాసుల పాదములు ఇండియున్న విధంబున సమస్త తీర్ధములు, క్షేత్రములు, జప, తప, నియమనిష్ఠ లన్నియును సంపూర్ణ తీర్ధపాదుండైన చిన్మయ దైవమందే ప్రతిష్ఠితమై యున్నవని మరువరాదు.

మత్ప్రియాత్మ జ్యోతులారా! శిష్యులార, భక్తులారా, బిడ్డలారా, మా వాక్యాను సారము వర్తించినపుడే మీరు పరమపిత పేరిట నిజమైన పూజ సలిపిన వారు కాగలరు. ఐనను మీ ఎల్లర కాయ శుద్ధి సిద్ధ్యర్ధం మద్బాహ్య పూజా విధానమును ఎరింగించు చున్నాము.

సమస్తమైన వారలారా! సర్వ వేదపూజ్య విశ్వగురు భగవన్ భూ, జల, విహంగ, సర్వలయ యాన, సంపూర్ణ బోధకాచార్యులు నేతిహరి బాబా సర్వకేంద్ర స్వాముల వారి సర్వాకార పూజయనిన సామాన్యమైన విషయంగా భావించరాదు. ఎన్ని పూజలైనను కొమ్మలు, రెమ్మలే. మ్రానుగ మత్పూజ గలదని గ్రహించుడి. నిజముగా ఇపుడు మీరందరు ధన్యాతి ధన్యులనక తప్పదు. ఎందునిమిత్తమనగా దేవేంద్రాది సకల దిక్పాలక బ్రహ్మర్షులు సహితము పొందలేని మత్ సాకార సన్నిధిలో యున్నారు. అందులకై కోతివలె తిరుగాడుచున్న చపల చిత్తంబును తీర్ధపాదులైన సర్వ కేంద్రులవారి పాదార విందములయందు సుస్ధిరేకాగ్ర దృష్టితో సంలగ్న పర్చుదురుగాక. శుభం. మీ ఘటముపై చూపు శ్రద్ధకు, ప్రేమకు ఎన్నియో రెట్లు అధికముగా మా సాకారముపై దృష్టిని కలిగియుందురు గాక.

నిత్య పరిశుద్ధ ప్రేమ స్వరూపులారా! పావనాత్ములారా! మా సాన్నిధ్యంలో ఏమైన సందేహములున్నవా? లేవు కదూ! ఐతే అందరు ఏకోన్ముఖ అనంత విశ్వ హృదయులై భూమ్యాకాశాది సకల దిక్కులు పిక్కటిల్లునట్లుగ, సర్వలోక పర్యంతం ధ్వనించునట్లు సర్వోన్నత స్వరమున ఉచ్చరించండి. మా తండ్రీ, పరమపితా, విశ్వగర్భా, విశ్వం, విశ్వాత్మ, విశ్వాతీత, స్వపరంజ్యోతి నీవే శరణ్యం. అన్యధా శరణం నాస్ధి, నిత్యం త్వమేవ శరణం మమ. నిజముగ మేము ఆశించినది సామాన్య నర గురువు కాదు. అసామాన్య, అసాధ్య, అల సర్వాతీత, సర్వాత్మ బంధువు, చిన్మయ సంపూర్ణ ప్రభు స్వామియని త్రికరణ శుద్ధిగ గ్రహించి నమ్ముచున్నాము.

జై సర్వలయ విశ్వకేంద్ర భగవన్:
1.ఆకాశ పక్షులకు ఆశ్రయమిచ్చు ప్రభువా
2.అరణ్య మృగములకు ఆహారమొసంగు దాత
3.వనవృక్షములకు జలమొసంగు తండ్రీ
4.భూ, జల చరములకు నివాసమిచ్చు పర:బ్రహ్మమా
5.పిపీలికాది బ్రహ్మ పర్యంతం సుజ్ఞాన భిక్షపెట్టు చరా చర జీవ రక్షక ప్రాణజ్యోతి
6.సకల పుణ్యక్షేత్ర, సమస్త తీర్ధ, సర్వమత మఠాశ్రమ సకల ధర్మ సంస్ధాపకాచార్య వర్యా
7.భవదీయ సింధూర మూర్తీ, అప్రమేయా
8.అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా
9.అనంతానంతమా
10.కొండసీమల యందు గుహలు నిర్మించు దేవా
11.కానని సీమలో కందమూలముల నొసంగుచు యోగుల పాలిట సజీవ రక్షకా
12.గాఢ నిద్రలో దేహ రక్షకంబైన సర్వాంతర్యామి, చిన్మయ చైతన్య సాగరా
13.దయాసాగరా, కనికరముచే కష్ట సుఖములనెటి ద్వంద్వ ములను తొలగించు కాలాతీతమా
14.అవిద్య, అజ్ఞాన తమస్సునుండి బ్రహ్మవిద్య, సుజ్ఞాన జ్యోతిలోనికి.గొంపోవు సాక్షాత్ స్వపరంజ్యోతి
15.అసత్తునుండి సత్తునకు జేర్చు చిన్మయదేవా
16.మృత్యువునుండి అమృతత్త్వమునకు గొంపోవు అమృతహరల్లా, అనాధ రక్షకా, ఆపద్భాంధవా, అపార కరుణా కటాక్ష
వీక్షణా, అప్రమేయా, అనంత సంపూర్ణాధి కారి వైన సర్వేశ్వరేశ్వరా, గుహ్యద్గుహ్య, పరమ కారణ జన్ములై నిమిత్త మాత్ర స్ధూలాకృతిని ధరించి మా మధ్యన మెలంగు చున్నందులకు మేమెంతో కృతకృత్యులం, ధన్యులం, దివ్యులం అని సర్వకేంద్ర స్వాముల సాక్షిగ ఎలుగెత్తి చాటుచున్నాము.

స్వామీ! శర్వకేంద్రా, పరంధాములు, విశ్వగర్భులైన మీకన్యధా ఏ లోకమునగాని నేటివరకు, ఇకముందును ఏ దేవుడు ఉండబోడు. ఇది అక్షర సత్యము.

ఓ అద్వితీయ అచలహరి తమను కొనియాడుటకుగాని, స్దుతించుటకు గాని మేమెంతటి వారలము. ఐనను ఉడుతాభక్తిగ మా శక్తి, భక్త్యానుసారం సలుపుచున్నాము. కాదనబోకుడి. ఫరమపితా, పరాత్పరా, మా సమస్త దోషములను మన్నించి మమ్ము మీలో చేర్చుకోండి. ఇదియే మేము జన్మ జన్మలకు ఆశించెడు ప్రార్ధన. మా మొర కాదనబోకుము. అందులకై ఈ క్షణము, ఇప్పుడే, ఇక్కడే మా హృదయ కవాటములను తెరచి మీ ఆహ్వాన రాక నిమిత్తం వేచి యున్నాము.గాన శీఘ్రమే ఏతెంచి మా హృదయ సిం హాసనాధిపతివై మా మనోరధముల ఈడేర్చగల భారకర్తలుగ పరిశుద్ధాంతరంగులమై ప్రార్ధించుచున్నాము.

చెవిలేకనే పిపీలికములోని సంకల్పమునైనను సునాయాసముగా గ్రహించు దేవాది దేవదేవా, విశ్వాశ్రయా, మా మనవిని ఆలకించి మమ్ము మీ జ్యోతులుగ మార్చుకొండి. మేమంతా నిత్యం మీ పావన, పవిత్ర సన్నిధినే కోరుచున్నాము. ఆందులకై అట్టి హక్కును సార్వకాలం ప్రసాదింప జేయుడి. ఇదియే మా ముఖ్య వినతి.

1.అరాము పొందగలముగాని అచలానంతాత్మా రాముని పొందలేము.
2.పడక కొనగలముగాని నిద్రను కొనలేము.
3.ఔషధము కొనగలముగాని ఆయుష్షును కొనలేము.
4.లౌకిక భోగ్య వస్తువులను కొనగలముగాని భగవంతమును కొని, అలౌకికాత్మ సుఖమును పొందలేము.
5.పుస్తకములను కొనగలముగాని విజ్ఞానమును కొనలేము.
6.వైద్యుని కొనగలముగాని ఆరోగ్యమును కొనలేము.
7.అధ్యాపకుని కొనగలముగాని ఆచార్యుని కొనలేము.
8.కంటి అద్దమును కొనగలముగాని దృష్టిని కొనలేము.
9.మానవుని కొనగలము గాని మానవత్వ పూర్ణ మాధవత్వనును కొనలేము.
10.సృష్టిలో ఏదైనా కొనగలముగాని చిన్మయనంత దైవతీర్ధుల మాత్రం కొనలేము.
11.ఎన్నియైనను పొందగలముగాని సర్వశ్రీ వేదపూజ్య నేతిహరి హంస కాళీ బాబా, జై సర్వకేంద్రా మిమ్ములను పొందుట బహు ప్రయాస, అసాధ్యం.
12.ఋషిగణములే మీ సన్నిధిలో గజగజలాడ మేమెంతటి వారలమయ్యా. మీ అఖండ పవిత్ర ప్రేమామృతము ద్వారా మిమ్ము పొందు భాగ్యశ్రీని మాకొసంగిన అంతియే చాలు.

సంపూర్ణ దైవమా, స్వామీ, సర్వకేంద్రా! మీ యధార్ధ తత్త్వము చిల్లర హఠ యోగాది సాధనలచే అనుభూతి యగునది కాదు. అందులకై త్రికరణశుద్ధిగ మిమ్ముల నమ్మి ఆశ్రయించిన మా ఎల్లర అంత:కరణములో మీ బాప్తిస్మమును నిలిపి నిత్య సత్యా త్మానుభూతిని కలిగింపజేయుము. ఇదియే మీ బిడ్డల కోరిక. సర్వ కేంద్ర ధామా, క్రమముగా మీ సాకార దర్శనముతో పాటు సాకార, నిరాకార, సాకార నిరాకారాతీత సర్వాకార స్ధితిని మాకు బట్టబయలుగ సక్షాత్కార మొసంగుము.

సర్వలోకాశ్రయ దుర్గమా, దుర్గా ప్రతి దర్గా నీలోనిదే. సర్వ సిద్ధులకు, సమస్త శక్తులకు నీవే నిలయం. అట్టి నీ నిజ స్ధితిని ఏమని వర్ణించగలము.

సర్వజన శరణ్య విశ్వోద్ధారక సర్వకేంద్ర స్వామి స్తోత్రము:

ఓ పూజ్య ప్రభూ! కరుణా సాగరా! కైవల్యధామా! క్షమా ప్రపూర్ణా! పరమేశ్వర, పరమపిత, పరాత్పరా, సర్వలోక రక్షకా, విశ్వపాలకా, నీవు సర్వ నియామకుడవు, సర్వాధార భూతుడవు, సర్వాధిష్టాన సర్వ శక్తి సమన్వితుడవు, మోక్ష ప్రదాతవు, మెహెర్ మూర్తివి. స్వయం ప్రకాశుడవైన నీకు మా సాష్టాంగ వందనములు. మా కన్నీరే మీ పాదాభిషేక పన్నీరు తీర్ధము.

అనంతాత్మా! క్షుధ్ర ఆకర్షణల నణగద్రొక్కి చిత్తవృత్తుల నరికట్టుటకు వలయు అంతరికాధ్యాత్మిక శక్తినొసంగుము. మరియు పరాభక్తి నుండి నా అంత:కరణము సదా విడివడకుండ సర్వావస్ధల యందును మీ పరిశుద్ధ పాదారవిందములందు లగ్నమై, అచంచలమైన భక్తితో కూడియుండునట్లు దయతో అనుగ్రహింపుము.

పరమ దయానిధీ! ఫ్రాత:కాలమున నిద్రలేచినది మొదలు మరల నిద్రించు వరకును త్రికరణ శుద్ధిగ మావలన ఏ ప్రాణికిని అపకారము కలుగకుండునట్లును, సమస్త ప్రాణికోట్లకు ఉపకారము చేయులాగునను సద్భుద్ధిని ప్రసాధింపుము.

పరమపితా! నీ పేర ధనికులు పెద్ద పెద్ద దేవాలయములను, కళ్యాణ మంటపములను కట్టుదురు. నేను దీనుడను, దరిద్రుడను. కావున నీవిచ్చిన ఈ అమూల్య శరీరమును వాడిపోవకముందే నా నిండు యవ్వనంలో సమర్పించు చున్నాను. గైకొనుము తండ్రీ! నన్ను విడువకుము. ఈ శరీరమునందు అణువణువు నీ పవిత్ర సేవందే నిమగ్నమగునటుల దివ్య శక్తిని ప్రసాదించి, అపవిత్రమును దగ్ధము చేయుము. చల్లని నీ నీడయను కరుణ నుండి వేరుచేయు అశుభ భావన రానీయకుము.

సచ్చిదానంద నిలయ సర్వకేంద్రా! అసలైన నీ స్ధితిని మేము ఏమి ఎరుంగగలము. ఐనా మా భక్తి, ఆత్మ శక్తి కొలది ఆశ్రయించితిమి. నిర్మలాత్మా! మా అంత:కరణమునందు ఎన్నడును ఏవిధమైనదుష్ట సంకల్పముగాని, విషయవాసన గని, అజ్ఞాన వృత్తిగాని ప్రవేశింపకుండు నట్లు అనుగ్రహించి ఆశీర్వదింపుము.

ఓ దీనజన రక్షకా! నీవు దయదలంచిన అడ్డుపెట్టు వారెవ్వరును లేరు. నీ ఆజ్ఞకెదురు లేదు. సర్వ శాసనాధికారివైన నీకు నీవే సాటి. విశ్వలయ స్వామీ! ఏ కర్మఫలములు మిమ్ము ప్రాప్తించుటకు మూలమగునో అట్టి వేదవిదిత వైదిక సత్కర్మలను ప్రాణి మాతృ కళ్యాణము నిమిత్తము చేయించుము.

సర్వజ్ఞ సార్వభౌమా! మానవ సమాజములోగల కుల మత తత్త్వములు, అంటరానితనము, బేధభావములు అంతరించి, ప్రతివారిలో సామాజిక స్పృహ, పరస్పర అవగాహన పెంపొంది, ఏబేధము లేదు, సర్వులు ఒకే దివ్యాత్మ స్వరూపులు, ప్రపంచమంతా ఒకటే, మానవులంతా ఒకటే అనెటి అఖండ, విశ్వ కుటుంబీక భావన మాలో స్ధిరపడునటుల ఆశీర్వదింపుము.

నిర్మలాత్మా! నీవు నిజముగా సర్వాంతర్యామివి, సర్వశక్తి మంతుడవు, సర్వజ్ఞుడవు, సచ్చిదానంద మయుడవు, సర్వ హృదయాంతర వాసివి. అట్టి నీవు మాకు కరుణార్ధ్ర హృదయమును, సమదృష్టి, స్ధిర చిత్తము, భక్తి, విశ్వాస, జ్ఞానములను
రసాదింపుము.

ఈ ప్రపంచ సమస్త విశ్వాసములకంటె అధిక విశ్వాసము, ప్రేమ నీయందుంచు హృదయమును కలుగజేయుము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర ద్వేషముల బారినుండి మమ్ములను తప్పించుము. మా హృదయ ఫలకములను ఉపకార, సత్య సద్గుణ కర్మ స్వభావములతో నింపుము.

వేదాంతవేద్యా, అభయ స్వరూపా! మాయందు స్ధిరభక్తి, జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి, శీఘ్రముగ ప్రవృద్ధములగునట్లు దయతో అశీర్వదింపుము. మరియు నీ ధర్మములనే అనుసరించి, ప్రవచించు శక్తిని మాకొసంగుము. ఈ జన్మమునందే, ఇప్పుడు, ఇక్కడే కడతేరి, నీ సాన్నిధ్యమున కేతెంచి, నీలో లయమగుటకు వలసిన శక్తి సామర్ధ్యములను ప్రేమతో ప్రసాదింపుము. శాంతియుత సహజీవనమును దయచేయుము. నీ పరమాద్భుత అనంతాత్మానంద వారాశిలో లీనమగు సామాధి స్ధితిని కలుగజేయుము.

ఈ సర్వ నామ రూపములతో నిన్ను సేవింపనిమ్ము, దర్శింపనిమ్ము. నిన్ను సదా స్మరించుకొననిమ్ము. నీ ప్రకృతి, పురుషాతీత పరమార్ధ లీలలు సదా గానము చేయనిమ్ము. నీ నామము నిరంతరము మా జిహ్వాగ్రమున నుండనిమ్ము. సదా మమ్ము నీలో నివసింపనిమ్ము.

చిన్మయదేవా! నాకు ధర్మమునందు గాని, విషయ భోగము లందుగాని ఆసక్తి లేదు. నా పూర్వకర్మలకు అనుగుణముగా ఏది ప్రాప్తము కావలసియున్నదో అదియే యగును.

అఖిలాండకోటి బ్రహ్మాండ విశ్వగర్భ, భువన రక్షకా! నేను నేడు శ్రీమంతుడనైనను గర్వము లేదు. దరిద్రుడనైనను చింత ఇసుమంతయు లేదు. భాగ్యవంతుడనైనను ఆనందముగాని, ఆపదలు కలిగినంతనే దు:ఖముగాని, సుఖము లభించినంతనే మిట్టిపడుట గాని నాకెన్నడు లేదు. ఏ సమయమున ఏది ప్రాప్తించినను నీ వేడుకగానే స్వీకరింతును.

సరసిజనయనా! ఇదిగో నా సర్వస్వం నీకు సమర్పించి, సర్వ శరణాగతి వేడుచున్నాను. నీ వలన నాకేదియు వలదు. ఈ లోక పదవులు వలదు, కీర్తి వలదు, కవిత్వం వలదు. జన్మ జన్మాంతరముల యందు నీయందలి అహేతుక భక్తియే నాకు కావలసినది.

పరమపితా! నీవు నా ప్రేమ జ్యోతివి అనుటకంటె నిన్నుగూర్చి నేనేమియు క్రొత్తగ చెప్పలేను. ఏమి సుందర మూర్తివోయి. ఆహా! ఏమి సుందర మూర్తివోయి. సర్వాత్మ సౌందర్యమే నీ రూపం.నీవే ఈ విశ్వమునకు ఆధారము, అంతరాత్మ, అమృత స్వరూపుడవు. సర్వజ్ఞుడవు, సర్వ వ్యాపివి, లోక రక్షకుడవు, శాశ్వత ప్రభుడవు, జగన్నియామకుడవు అగునట్టి నీకంటె వేరుగ నాకేదియును లేదు.

భక్తులపాలిటి కల్పవల్లీ! ఈ జగత్తంతయు నీకు క్రీడారంగము. ఇది అంతయు నీయొక్క లీలయే. ఇట్టి క్రీడామయాబ్ధిలో ప్రతి అణువు మొదలుకొని భూ, సూర్య, నక్షత్ర, అకాశమండలములను నిర్మించుచు, క్రీడించుచున్నావు. సుఖ, దు:ఖ నిలయమగు మానవ మానసములో, జంతువులలో, వృక్షములలో, ఒక్కటేమి, అన్నిట, అంతట వ్యాపించి యున్నావు. అంతయు నీ విహార కేంద్రమే. మేమంతా నీ ఆటపాళి యందలి పాచికలము, చెలికాండ్రము.

అబ్జదళ నేత్రా! ఈ లోకములో అవతరించిన ప్రతివారికి మరణమే ధ్రువమై యున్నది. అట్టిచో శాశ్వతమైనది ఏది? శరీర రక్షణ సంతృప్తియే నావిధి కాదు. అసలు ఈ శరీరము వేరు, నేను వేరు. సముద్రమును దాటుటకు నావవలె, భవరోగ సంసార సాగరమును దాటుటకు శరీరమనెటి నావను ప్రాప్తింప చేసినందులకు ధన్యుడను. ఎన్నటికైనను ఈ శరీరము నశించునదియే. కాబట్టి లోక కల్యాణ యత్నమున విశ్వసేవాచరణమున తోడ్పడునట్లు సద్బుద్ధి నొసంగుము.

దానవాంతక కోటిభాను తేజా! కష్టము వచ్చినను, ఎట్టి దుస్ధితి వచ్చినను, త్రాచుపాము వచ్చినను, చివరకు మృత్యువు వచ్చినను, ఇవన్నియు నాయొక్క ప్రేమ మయమునుండియే వచ్చుచున్నవి. ఆహా! ఏమి విచిత్రము. అన్నియు నావద్దకే వచ్చుచున్నవి. నన్నే ఆశ్రయించి, ఆహ్వానించు చున్నవనెటి ప్రేమతో ఆనందముగా నుందునేగాని మొరలిడుటనునది నాకెద్దియు లేదు.

సూర్యశశినేత్రా! ఈ సమస్తం నీవే, నేదే. నీవే నాకత్యంత సన్నిహితుడవు. పరమ ప్రియుడవు, సఖుడవు, బంధువు, ఒక్కటేమి నా సర్వస్వం నీవే. అట్టి నిన్నే ప్రేమింతును. నీకన్యధా ఇతరులు లేరు.

నిర్వాణనిలయా! నేనిజముగా నిమిత్తమాత్రుడనే. నీవు శాశ్వత పరమ ప్రభుడవు. సర్వసాక్షి భూతుడవు. కావున నా మనో వాక్కాయములచే నే చేసిన, చేయు సమస్త కర్మలను త్రికరణ శుద్ధిగా నీకర్పిస్తున్నాను. నేనేమియు చేయుటలేదు. అన్నియు నీవే చేయించుచున్నావు.

సర్వస్థంభన, సర్వాకర్షణ, సంపూర్ణ మోహనాకార మన స్సే స్వర్గ నరకములకు, నిలుకడకు పుట్టిల్లు. కావున బలీయమగు మానసముతో చిత్త చాంచల్యం వీడి సదా చిన్మయ దైవోన్ముఖ శుభచిత్తము గలుగునట్లు కృపచూపుము.

సర్వశయనా! ఈ శరీరము ఆయుష్షు క్షీణించి నంతనే పడిపోవును. ఈ దేహ నావద్వారా మిమ్ము సందర్శించవలయును గాన నావ నిలుకడకు భవతీ భిక్షాందేహి అంటూ ఈ స్ధూల శరీర నిలుకడకు వలయు పిడికెడు కబలమును నేనర్ధించు చున్నాను. కాదనబోకుము.

నీ నామమే సర్వమై, సర్వ శ్రేష్ఠమై ప్రకాశిస్తున్నందున అట్టి నీ నామ స్మరణ యనెటి ఆత్మలయ యజ్ఞ దీక్షలో నిలిచి యున్నాను.

ఓం శ్రీ సర్వజ్ఞ మహాదేవి, విశ్వపాలక, పరాత్పరీ, విశ్వంబ, త్వమేతి సర్వాతిసర్వం. త్వం వినా విశ్వం శూన్యం. ఆన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ.

దేవాది దేవా, దివ్యప్రభావా! నీవు భక్త వత్సలుడవు. దీనులపాలిటి కల్ప వృక్షమవు. నీవుదప్ప నాకింకెవరు దిక్కు. నిన్ను త్రికరణశుద్ధిగ ఆశ్రయించితిని. అందులకై అసత్తునుండి సత్తునకు, తమస్సునుండి జ్యోతిలోనికి తీసికొని పొమ్ము. మృత్యువు నుండి అమృతత్త్వమును పొందింప చేయుము. నీదరి చేర్చుకొని నీయందు లయము గావింపుము. ఆమేన్.

పాహిమాం ! పాహిమాం !! పాహిమాం !!! పాహి.
ఓం శ్రీ హరి ఓం తత్సత్
ఇతి సర్వం సర్వకేంద్ర పితార్పణమస్తు !

Thursday, January 17, 2008

ఓం శ్రీ భగవతి స్వపరాది శక్తినిలయ, యెహోవా శ్రీహరల్లా, శ్రీమన్నాదినారాయణ, పరమపిత సర్వకేంద్రాయ నమ:

ఆహ్వాన పావన పత్రిక

బాబా సర్వకేంద్రుల పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం, త్రిపురారం

ఇందుమూలముగ సమస్త భక్త మహాశయులకు తెలియపరచు ముఖ్య విషయం ఏమనగా ది.17-02-2008 (ఆదివారం) భీష్మ ఏకాదశి వార్షిక దివ్యోత్సవ సందర్భములో ఈ క్రింది కార్యక్రమములు వుండును. 17-02-2008 ఆదివారం ఉదయం 8.00 గంటలకు కర్మ, భక్తి, జ్ఞాన యోగముల గీతా యజ్ఞము శ్రీవారి పాద జ్యోతి కుమారి చి. కుమారి నాగులవంచ శ్రుతి ఆధ్వర్యములో జరుపబడును. తదనంతరము బాబా సర్వకంద్రుల సశరీర పరిధిలో సర్వాకార, సర్వ మతారాధ్య పూజ శ్రీవారి పవిత్ర ప్రధాన పాదజ్యోతి నేతి విజయదేవ్ (పూర్వాశ్రమ నామధేయులు శ్రీ నాగులవంచ వసంత రావు) మరియు ఆశ్రమ అధ్యక్షులు గురుమూర్తి బాబా పవిత్ర పాదజ్యోతి శ్రీ పందిరి శ్రీరాములు గారల ఆధ్వర్యములో నిర్వహించబడును.

ఈనాటి రాత్రి పవిత్ర వాతావరణములో జ్ఞాన నేత్ర జాగరణ, భజన, పారాయణ, సత్సంగం, ఇండ్లూరు గ్రామ భక్తబృందముచే బుర్రకధ మొదలగు కార్యక్రమములు ఆశ్రమ దత్తపుత్రిక శ్రీమతి అరుణమ్మగారి ఆధ్వర్యములో నిర్వహించబడును. కావున ఆసక్తిగల భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొని జన్మ చరితార్ధులు కండి అని కోరుచున్నాము. ఈ వార్షికోత్సవ పర్వదిన సందర్భమును పురస్కరించుకొని ఆశ్రమ అన్నపూజ నిర్వహణతో పాటు బాబా సర్వకేంద్రులవారికి నూతన వస్త్రాలంకరణ ద్రవ్య దాతలు, శ్రీవారి పాద జ్యోతులు శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివస రెడ్డి పుణ్య దంపతులు, వనస్ధలిపురం వాస్తవ్యుల ఆధ్వర్యములో జరుపబడును.

శూచన: భక్తులు ఎవరైనను స్వచ్చంద ముగా వారికి తోచిన సహాయం చేయ వచ్చు.

లోకాస్సమస్తా స్సుఖినోభవంతూ
ఓం శాంతి! శాంతి!! శాంతి!!!

ఆశ్రమ అధ్యక్షులు ప్రధాన కార్యడర్శి
పందిరి శ్రీరాములు, నగిరి వెంకన్న
మిర్యాలగూడ, త్రిపురారం.










బాబా సర్వకేంద్రుల పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం, త్రిపురారం


1. భీష్మ ఏకాదశి ది.08-02-2006 (బుధవారము) పంచమ వార్షికోత్సవ సందర్భములో శివలింగ నిర్మాణ ప్రతిష్ఠ మరియు ప్రతి సంవత్సర వార్షికోత్సవ అన్నపూజ ద్రవ్య దాతలు, శ్రీవారి పవిత్ర పాద జ్యోతులు శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివసరెడ్డి గారలు, హుడా సాయినగర్ కాలని, వనస్ధలిపురం, హైదరాబాదు వాస్తవ్యులు.


2. భీష్మ ఏకాదశి ది.08-02-2006 (బుధవారము) పంచమ వార్షికోత్సవ సందర్భములో నంది విగ్రహ ప్రతిష్ఠ ద్రవ్య దాతలు, శ్రీవారి పవిత్ర పాద జ్యోతులు శ్రీమతి ఎడ్ల వెంకటమ్మ, శ్రీ మోహన్ రెడ్డి గారలు, వెంకటరమణ కాలని, వనస్ధలి పురం, హైదరాబాదు వాస్తవ్యులు.

Friday, January 11, 2008

4. ధ్యానమండలి

భారతావని వేదభూమి, పుణ్యభూమి, ధన్యభూమి. ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు. ఈ భూమిపై జన్మించడమే మహాభాగ్యంగా భావించేవాళ్ళు కోకొల్లలు. విదేశీయులు సైతం భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించారు. “భారతదేశంలో క్రిమిగా పుట్టినా నా జన్మ ధన్యమైనట్లే”నని ప్రకటించారు మాక్స్ ముల్లర్ మహాశయుడు. కారణజన్ములు కొందరైతే, కష్టాల కడలిలో కాకలు తీరిన యోధులు మరికొందరు.

మనిషి అజ్ఞానంలో ఉన్నతకాలం పరిమిత తత్త్వంతో ఆలోచించ డంవల్ల స్వల్ప విషయాలకే ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ స్వల్పానందమే, విషయ సుఖమే శాశ్వతం, సర్వస్వంగా భావించి దాని కోల్పోయినప్పుడు దుఖి:స్తూ ఉంటాడు. అదే వ్యక్తి కాలక్రమేణ ఒక సమస్య ద్వారానో, సంఘటన ద్వారానో సత్యాన్ని గ్రహించి, ఆచరించి, అనుభూతి చెందాక దాని మాధుర్యాన్ని పదిమందికి పంచకుండా ఉండలేకపోతాడు. తనలాగే ప్రపంచమంతా బ్రహ్మానందాన్ని అనుభవించాలని తహతహలాడతాడు. ఆ మార్గంలో ప్రజలను ఉత్తేజితులను చేయాలని ఉవ్విళ్ళూరుతాడు. సత్య సందేశాన్ని సమగ్రము గా, సంపూర్ణముగా సకల జనావళికి చేరవేసేదాకా నిద్ర పట్టదు. ఎందుకంటే జ్ఞానం తెలిసినవారిది విశ్వప్రేమ. ఈర్ష్యా ద్వేషాలు, ఉచ్చనీచాలు, తరతమబేధాలు, కుల, మత, వర్ణ, లింగ బేధంలేక, దేశ, కాల పరిమితులు లేని అవ్యాజ ప్రేమ. ఈ కోవలో చేరినవారే పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీగారు.

యోగ అనేది ఆధ్యాత్మిక జీవన విధానానికి శాస్త్రయుక్తమైన రూపకల్పన. ఆధ్యాత్మికతను అంతర్జాతీయంగా, విప్లవాత్మకంగా ప్రచారంచేసి ప్రస్తుత ప్రపంచాన్ని సంక్షోభం నుండి విడుదల చేయాలనే సదుద్దేశ్యంతో 1998 లో విజయవాడను ప్రధాన కేంద్రంగా చేసుకొని “ధ్యానమండలి” సంస్తను పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీగారి ఆధ్వర్యంలో స్ధాపించడం జరిగింది. అందుకు అనుగుణంగా వివిధ శిక్షణా కార్యక్రమాలను రూపొందించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ శిక్షణలలో అత్యంత విలువైన సమాచారంతోపాటు యోగాసనములు, సూర్య నమస్కారములు, ప్రాణా యామము, ఆక్యుప్రెజర్, అగ్నిహోత్రం, భజనలు, మంత్రాలు, శ్లోకాలు, విలువైన ప్రవచనములతో పాటు సమాధి అభ్యాసాన్ని, ధ్యానంలను కూడా అందిస్తున్నారు.

ఢ్యానమండలిని స్ధాపించడంలో గల ముఖ్య ఉద్దేశ్యమే మిటో పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీగారి మాటల్లో తెలుసుకొందాం. “నేను యోగాలొకి ప్రవేశించకముందు రుగ్మతలతో బాధపడుతూ నిరంతరం అశాంతితో ఉండేవాడిని. ఆర్ధికముగా ఎటువంటి లోటు లేనప్పటికి అంతరంగం మాత్రం బలహీనముగా ఉండేది. నేను జీవితాన్ని ఒక కోణములో మాత్రమే చూసాను. ప్రస్తుతం మేధావి వర్గం ఏవిధంగా ఆలోచిస్తుందో ఆనాడు నా ఆలోచనలు కూడా అలాగే ఉండేవి. ఆనాడు నేననుభవించిన బాధలనన్నిటినీ ప్రస్తుత మేధావి వర్గం అనుభవిస్తూనే ఉంది. అటువంటి మేధావులందరినీ భౌతికవాదం మత్తునుండి విడుదలగావించి సమతుల్యంతో కూడిన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని స్ధాపించాలనే ఉద్దేశ్యంతో ధ్యాన మందలిని స్ధాపించడం జరిగింది. పైగా ప్రపంచం ప్రమాదపు అంచులో ఉంది కాబట్టి దానిని రక్షించడం నా విధి, కర్తవ్యం అనే భావన కలిగి ధ్యానమండలికి అంకురార్పణ గావించడం జరిగింది.

గురువులను తయారుచేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో గురూజీగారి మాటల్లో తెలుసుకుందాం. “నేను 1991 లో యోగాలోకి ప్రవేశించిన తర్వాత ప్రారంభములో కొన్ని ఇబ్బందులు పడినప్పటికి 1996 సం. వచ్చేసరికే సాధనలో పట్టుదొర్కింది. శారీరక, మాన సిక స్వస్ధత చేకూరింది. తల్లిదండ్రులద్వారా జీనుల లోపంవల్ల బిడ్డలకు సంక్రమించిన వ్యాధులకు వైద్యరంగంలో ఎటువంటి నివారణ లేదు. కాని యోగద్వారా అది సాధ్యమవుతుంది అనేదే నాకు అనుభవపూర్వకంగా తెలిసిపోయింది. నాలాగా ఎందరో మేధావులు అంతుచిక్కని రుగ్మతలతో బాధపడడమేగాక, భౌతికవాదం మత్తులో ఇరుక్కుని పతనమవుతున్నారు. కాబట్టి ఆధ్యాత్మికతను అంతర్జాతీయంగా, విప్లవాత్మకంగా ప్రవేశపెట్టాలనే తలంపుతో 1998 లో ధ్యానమండలికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఐతే ప్రపంచం అనంతం, నా జీవితం అల్పం. కాబట్టి అది ఒక వ్యక్తిద్వారా సాధ్యంకాదు. ఆందువలన సుశిక్షితులైన గురువులను తయారుచేసి సంఘటితంగా దానిని ప్రచారం చేయాలనే భావనతో ఆ కార్యక్ర మాన్ని చేపట్టడం జరిగింది. 'ఒక వ్యక్తి ఎదగడంకాదు, సమాజం ఎదగాలి’ అనే ఆశయంతోనే ఆ కార్యక్రమం మొదలైంది. మా గురువుల గురుకుల శిక్షణ దశలవారీగా జరుగుతుంది. రోజుకు 18 గంటల చొప్పున ఏకధాటిగా సాధన ఉంటుంది.ఒక గురువు పరిపూర్ణ మైనదశకు చేరాలంటే కనీసం ఒక సం. పడుతుంది. ఒక టీంగా లేకపోతే ధ్యానమండలి ఇంతగా విస్తరించేది కాదు. అందరం కలిసి బాధ్యతను పంచుకుంటున్నాం. కాబట్టి మా సంస్ధకు ఇంత స్పందన వచ్చింది”.

ధ్యానమండలి ప్రస్తుతం 5 రకాల శిక్షణలను నిర్వహిస్తుంది. దానితోబాటు విద్యార్ధులకు ప్రత్యేకముగా వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే వేసవి శిబిరాలను నిర్వహిస్తుంది. ధ్యానమండలి స్ధాపించబడిన తర్వాత అతికొద్ది కాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్ధాయికి ఎదగడం, గురూజీకి అనేక అవార్డులు రావడమేగాక కార్య క్రమాలు శరవేగంతో రాష్ట్రమంతటా వ్యాపించడానికి మూల కారణం సైన్సును ఆధ్యాత్మికతను సమన్వయం చేయడం. ఆధ్యాత్మికతకు మనస్తత్త్వాన్ని జోడించడం, భౌతికవాదాన్ని ఆధ్యాత్మి కతతో మేళవించడం, ధ్యానాన్ని వైద్యంతో జతపరచడం వంటి వినూత్న ప్రయోగాలను గురించి విపులంగా వివరించడం జరిగుతున్నది.

ధ్యానమండలి భవిష్యత్ ప్రణాళిక గురించి గురూజీగారి మనో గతం అవలోకిద్దాం. “ప్రస్తుతం ప్రపంచమంతా భౌతికవాదం మత్తులో ఉంది. సుఖసౌకర్యాల ముసుగులో బంధింప బడింది. పతనా వస్ధకు చేరుకుంది. వనరుల కొరకు అందరూ నిరంతరం పరుగులు తీస్తున్నారు. మానవునకు మానవుడే శత్రువయ్యాడు. ప్రపంచ శ్రేయ స్సుకన్నా, పతనాన్ని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. నైతిక విలువలు పతనమయ్యాయి. మానవ సంబధాలకన్నా ఆర్ధిక సంబంధాలే ప్రధానమవుతున్నాయి. ప్రపంచాన్ని శాంతిమార్గం వైపుకు మళ్ళించడం కొరకు అనేక రకాల సంస్కరణలు వెలుగులోకి వచ్చాయి. అనేకమంది అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కాని ఫలితం మాత్రం నామ మాత్రంగానే ఉంది. ఇవే పరిస్ధితులు మున్ముందు కొనసాగితే మానవ మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అందులకే పతనమవుతున్న ప్రపంచానికి మేం రూపొందించిన విధానాన్ని వినూత్న పంధాలో ఉన్నందువలన, అన్నివర్గాల వారికి ఆమోద యోగ్యమైనందువలన నిరంతరం కృషిచేసి ఆధ్యాత్మికతను ప్రపంచ వ్యాప్తం చేయాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మేం చేసింది ఆంధ్రాకే పరిమితమైంది. భవిష్యత్తులో దేశానికి, దేశమునుండి ప్రపంచమంతటికీ వ్యాపింపజేస్తాం. అందరు సమస్యను ఉపరితలంలో చూశారు. పరిమిత తత్త్వంలో ఉండి పనిచేశారు. అందుకే ఊహించని రీతిలో ఫలితాన్ని పొందలేకపోయారు. మేం దానికి
ఒక సుదీర్ఘ ప్రణాళికను రూపొందిస్తున్నాం. యోగ విశ్వవిద్యాలయాన్ని, యోగ పరిశొధనా కేంద్రాన్ని, యోగ విద్యాలయాలను నెలకొల్ప డమేగాక, సమాజంలోనికి చొచ్చుకుపోయి సామాజిక సేవా కార్య క్రమాల ద్వారా ప్రజలందరినీ ఐక్యం చేయాలనుకుంటున్నాం. అందుకు అవసరమైన చర్యలు చేపడతాం. తప్పక ఫలితాలు సాధిస్తాం – ప్రజలకు అందిస్తాం”.

ధ్యానమండలికి అనుబంధంగా ‘ధ్యానమాలిక’ ఆధ్యాత్మిక మాసపత్రికను నడుపుతూ కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాలకు సంబంధించిన వివిధ వ్యాసాలు ప్రచురించి అట్టడుగు ప్రజలలో కూడా యోగంపట్ల, ఆధ్యాత్మిక మార్గంపట్ల అవగాహన కలిస్తున్నారు. ఈ సంస్ధ చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి పాఠకులకు తెలియజేస్తున్నారు.

జ్ఞాన మార్గంలో తనకు కలిగిన అనుభవాలను కుండబద్దలు కొట్టినట్లుగా తన మనోభావాలును ప్రకటించి, చెప్పింది చేసి చూపించగల సత్తాగల ఉత్తమ గురువు శ్రీ బిక్షమయ్య గురూజీ అని చెప్పక తప్పదు. ఫ్రజలలో మంచిని పెంచాలన్న తపన, సమస్యను మూలమునుంచి పరిశీలించి, పరిశోధించి, తగు పరిష్కారం చూపే తత్త్వంగలవారని వారి రచనలను చదివితే ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. ఎంతో సాధన చేసి యోగమార్గంలో, ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్ధాయిని సాధించి, అతి సామాన్య ప్రజలకు సైతం భక్తి, ధ్యానం, యోగంపట్ల మంచి అవగాహన కలిగిస్తున్న ఇలాంటి సంస్ధలో మనమూ చేరి మనకు చేతనైన సహకారాన్ని అందించి, తగురీతిన సేవలు చేద్దాం. మన సంపూర్ణ ఆరోగ్యాన్ని యోగా ద్వారా పదిలపరచుకొని, పదిమందికి ఈ మార్గంలోని మంచిని బోధించి జ్ఞానదానం చేద్దాం. ప్రపంచశాంతికి మనవంతు ప్రయత్నం చేసి మానవులుగా జన్మించినందుకు జన్మ సార్ధకం చేసుకుందాం. మరింత సమాచారం కొరకు www.dhyanamandali.org ను దర్శించండి.

- నేతి విజయదేవ్

Wednesday, January 9, 2008

3. ధ్యాన యోగం

ప్రతివారికి అందుబాటులో ఉన్న ప్రాణాయమం, యోగాభ్యాస విధులను పాటించి శారీరక, మానసిక బలసంపన్నులు కావాలి. పుస్తకము చదివి కాకుండ అనుభవజ్ఞులైన గురువుల ద్వారా ఈ కిటుకు తెలుసుకొని క్రమం తప్పకుండా అభాసం చేయాలి.

దేహధ్యాసను మరువటమే ధ్యానములో తొలిమెట్టు. ఈంద్రియ మనంబులకు సాక్షిగ నిలువటమే ధ్యానమార్గంలో ద్వితీయ సోపానము. శర్వమును ఒకేసారి, ఒకేచోత్ట గాంచగలుగు స్ధితియే ధ్యానసిద్ధికి నిదర్శనం. ఢ్యానించు ధ్యాత, ధ్యానం, ధ్యేయాకరం ఏకత్వస్ధితి నొందుటయే ధ్యాన పరిపక్వత. ధ్యానించు ధ్యాత ధ్యేయాకార స్ధితిలో భాసిల్లుటయే ధ్యాన సంపూర్తి.

ఒకే విషయముపై తదేక దృష్టిని నిలుపటమే ధ్యాస. ధ్యాస
ఎడతెరిపిలేని అఖండ తైలధారవలె అవిచ్చిన్నముగ, భావ నిమగ్నత యే ధ్యానం. దేహేంద్రియ ధ్యాసను అతిక్రమించుటయే ధ్యానములోని ప్రధమ సోపానము. శమస్త సాధకుల ధ్యాన నిష్ట కాలపరిమితికి వశమై ఉంటుంది. అపుడే పక్షి పిల్లలు, కుక్క కూనలు, పిల్లి కూనలు కన్నులు మూసుకొని పరాధీన దశలో, ఒకేచోట అశక్త స్ధితిలో పడి ఉంటాయి. ఖన్నులు మ్మొసికొని చేయు ధ్యానము పక్షి పిల్లల వంటిది. ఇది ప్రారంభ దశ. పక్షి పిల్లలు శారీరకముగ ఎదిగినపుడు కన్నులు తెరచి చూడగలవు. రెక్కలు చాచి విహంగ యానము చేయగలవు. ఇది ధ్యాన పరాకాష్ట. ఆకాశ నక్షత్రములలో సూర్య చంద్రులవలె వీరి సంఖ్య స్వల్పాతి స్వల్పము.

ప్రపంచ ఉపరితలమునుండి మనస్సును లేవనెత్తి ఉన్నతమైన జీవిత ధర్మమును తెలిసికొన్నచో అదియే నిజమైన ధ్యానల్మ్. ఆరాధనకు అర్హమైన దశ. టపో స్ధలమున గొడవచేయుట బంగారు గుడ్డును దొంగిలించుటవంటిది. శరీరమును తాకి కదిలించుట బంగారు గుడ్డు పెట్టు బాతును చంపుట వంటిది. ప్రార్ధించునపుడు తలపై వస్త్రమును వేసికొని, చేతులు జోడించి, నేత్రములు మూసుకొని హృదయ ద్వారమున ధ్యానించాలి. అపుడే దైవదర్శనం, దైవ స్వరం వినిపించగలదు. కుండలినీ శక్తి ప్రభావితమైనపుడు సమాధినిష్ఠ సిద్ధించును. మూడవ నేత్రము తెరువబడును. హృదయ పరివర్తన, పరస్పర అవ గాహన, మానవతా దృష్టి పెంపొందాలి. ఈదియే విశ్వశాంతికి మూలం.
మిట్ట మధ్యాహ్నం శరీర చాయ (నీడ) మిగులకుండ తనయందే లయించునట్లు ఎవరు దృశ్య జగత్తును, వినికిడి జగత్తును, సంకల్ప జగత్తును తమలో లయపరచి, వాటి నతిక్రమించి సుస్ధిర స్దితిలో నిలచి చూడగల రో అదియే దైవ దర్శనం.

అలజడులులేని శాంతిమయ జీవితమునకు ధ్యానమే మార్గం. డీనిని వ్యష్టిగ ఆరంభించి సమిష్టిగ సాధించాలి. ఏఅకాంతవాసం ముందు అవసరం. ఎంతమంది జనసమూహములో యున్నను ధ్యాననిష్ఠ నుండి చలించని స్ధితికి ఎదగాలి. ధ్యానం మానసిక సంబంధ మైనది. దీనికి మనోనియంత్రణ అతి ముఖ్య సాధన. ఆధ్యాత్మిక రంగములో సమస్త సమస్యల పరిష్కార మార్గం మనోనియంత్రణే. ముక్కు మూసుకుని కొండచిలువ వలె గుహలో పడియున్నంత మాత్రాన ధ్యానం సిద్ధించదు. ఝగత్ స్ఫురణ, దేహధ్యాసను ఎంతకెంతగ తగ్గించుకొనిన అంతకంతగ ధ్యాన నిష్ఠ సిద్ధిస్తుంది. అందులకే ముందుగ మనస్స్సును స్వాధీనపరచుకో! ంఅనో సూత్రమే మహా మంత్రాలయం. మనస్స్సు వ\సమైన ఘనులకు వేరే మంత్ర, యంత్ర, తంత్రములతో పనిలేదు. విషయాపేక్షలను విషమువలె త్యజించి, సద్గుణములను అమృతమువలె గ్రహించి, ప్రశాంత చిత్తులై ప్రవర్తించ నేర్వాలి. ఆర్టిస్టులకన్న హార్టిస్టులు మిన్న. హృదయ సౌందర్యమును మించిన కళ లేదు. సైన్సుది బహిర్ దృష్టి. జ్ఞాన నేత్రం లోచూపు.

గాధనిద్రలో ఉన్నప్పుడు ఏవిధమైన ప్రమాదం ఎదురవ్వకుండా
నిద్రాణ స్ధితిలోవున్న మన అంత:శక్తులను జాగరూకతతో ఉండునట్లు చేయునదేదో అదే ఆత్మశక్తి. దీనిని రకరకముల పేర్లుపెట్టి పిలుచు చున్నారు. శరీరానికి భోజనం ఎట్టిదో మనస్సుకు ధ్యానం, యోగం, ప్రార్ధన అట్టిది. దేనికైన ఏకాగ్రత ముఖ్యం. నమ్మకం బలమైన
పునాది వంటిది. దీనిపై ప్రార్ధన ఆధారపడి ఉన్నది. సామూహిక ప్రార్ధన మఈ గొప్పది. ప్రకాశ పారాయణచే అంత:శ్రావక గ్రంధులు ఉత్తేజితమగును.

చూపులోనే శక్తి కోల్పోబడుతుంది. నేత్రములు మూసుకొని కూర్చుండిన దృశ్య జగత్తు కనిపించదు. అపుడు వినికిడి జగత్తుండును. శ్రవణేంద్రియముల నిరోధించిన వినికిడి జగత్తు అదృశ్యమగును. ఐనను సంకల్ప జగత్తుండును. మానసికముగ దీనిని నిరోధించిన నిర్వికల్ప స్ధితి చిక్కును. ఢ్యాన, సమాధి నిష్టలు ఇచ్చట ఆగిపోగలవు. సహజ నిర్వికల్ప సమాధి స్దితిర్భూతులు అత్యరుదు. సాధన నిర్వికల్ప స్ధితి అందరికి సాధ్యం కాదు.

పరమాధ్యాత్మిక మూలవిద్యకు మనోయోగ సాధన ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ యోగసాధనకు కర్మకాండ తతంగం ఉండదు. గురువులు, చిత్ర్పటములతో పనిలేదు. ఎవరి మనసుపై వారు నిఘా వేయాలి. సంకల్ప శక్తి దైనమో వంటిది. మనస్సును నిర్వికార స్ధితికి చేర్చి మనోయోగ సాధన సిద్ధి నొందాలి. మనోయోగ సిద్ధినొందిన వారికి మనోలయ సమాధి స్ధితి సులువు. ఎదురు తిరిగే ఎద్దుకు ముకుత్రాడు వేయునట్లు తారక యోగనిష్ఠలో మనస్స్సుకు ముకుత్రాడు వేయాలి. చివరికి ఈ సాధన అమనస్క స్ధితికి చేరుస్తుంది. ఆపై పరిపూర్ణ స్ధితి. దీనిని సాధించిన దివ్యాత్ములైన పురుషోత్తములకు, స్వనిష్ఠ నొందిన యుత్కృష్థ యోగీంద్రులకు భగవాన్ సర్వకేంద్ర బాబావారి సర్వోన్నత స్వరవాణి నిండా గ్రాహ్యం ఔతుంది. వారే నా ప్రతినిధులు అంటున్నారు బాబా సర్వ కేంద్రులు.
రచన: బాబా సర్వకేంద్ర సేకరణ: నేతి విజయదెవ్

2. ధ్యానం

ఇంతవరకు మనం మనస్సు స్వభావం, దానిని ఎలా నియంత్రించుకోవాలో చర్చించుకున్నాం. ఐతే మనస్సును అదుపులో ఉంచుకోవడానికి, సంపూర్ణ సారీరక ఆరోగ్యంతో ప్రశాంత జీవితం గడపడానికి అనువైన ఎన్నో ధ్యాన పద్ధతులు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు తెలిసిన ధ్యాన మార్గాలలో అతి సులువైన,అందరూ ఆచరించదగ్గ ధ్యాన పద్ధతే “ఆనాపాన
సతి”. అనగా “శ్వాసమీద ధ్యాస”. దీనిని అచరించే విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పద్మాసనంగాని లేదా సుఖాసనం గాని వేసుకొని కూర్చుని, రెండుచేతులు జోడించి, ఒకవేళ కుర్చీలో కూర్చున్నట్లైతే రెండుకాళ్ళు క్రాస్ చేసుకొని, వెన్నెముకను నిటారుగా ఉంచి, కళ్ళు మూసుకుని, మనస్సును ఉచ్చ్వాస నిశ్వాసలపై కేంద్రీకరిచడమే ఈ ధ్యాన పద్దతి. అలా చేసినప్పుడు మన శ్వాస తనంతట తాను చిన్నదిగా ఐపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమద్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్ధానంలో అంటే సుదర్శన చక్ర స్ధానంలో తనంతట తాను సుఖముగా, స్ధితం ఐపోతుంది. అప్పుడు ఆ స్ధీతి లో తదేకమై వుంటే, తన్మయులమై వుంటే, మూడవ కన్ను యొక్క విస్పోట నం మొదలవుతుంది. ఈ మూడవకన్ను విస్పోటనాన్ని గమనించడాన్నే “విపస్సన” అంటారు. మన శరీరానికి ఎంతయితే వయస్సుందో అన్ని నిముషాలు ఈ ధ్యానం చేయడం ఉత్తమం. ప్రారంభ దశలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఈ ఆనాపానసతికి ఉపక్రమించే ముంచు ఒక అర్ధ గ్లాసు నీళ్ళు త్రాగి, ఇంకొక అర్ధగ్లాసు నీళ్ళను ప్రక్కన పెట్టుకోవాలి. అభ్యాసం పూర్తయిన తర్వాత, మెల్లిగా కళ్ళు తెరచిన తర్వాత మిగిలిన అర్ధగ్లాసు నీళ్ళు త్రాగాలి. ధ్యానం చేసేటప్పుడు మనస్సు అనేక విషయాలపైకి పరుగెడుతూ వుంటుంది. అలాంటి మనస్సును సాక్షీభూతంగా గమనిస్తూ, మరల దానిని శ్వాసమీద ధ్యాస వద్దకు అనగా భ్రూమధ్యానికి పట్టుకురావడానికి ప్రయత్నించాలి. ఈవిధముగా క్రమాభ్యాసము చేస్తూవుంటే మనస్సు అనేది మన ఆధీనం లోకి వచ్చి మనం చెప్పినట్లుగా వింటుంది. దీనిని నిండు పౌర్ణమి రోజున చేసినచో అద్భుత ఫలితాలు సాధించవచ్చు. ఇది చాలా మహత్తర మైనటువంటి ధ్యాన మార్గం. ఈ ధ్యానపద్ధతిని ఆచరించి, ప్రజలకోసం ప్రవేశ పెట్టినవారు గౌతమ బుద్ధుడు. ఐతే ఈ ధ్యాన పద్ధతిని ప్రస్తుత తరుణంలో ఆచరిస్తూ, ప్రజాబాహుళ్యం లోకి విరివిగా చొచ్చుకొపోయేటట్లు చేసినవారు బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిగారు. వీరు దీనిని మన రాష్ట్రంలోనేగాక, ప్రపంచ పరిధిలో కొన్ని లక్షల మందిచేత ఆచరింప జేస్తు న్నారు. మానవుని మానసిక వికాసంలో అపూర్వమైన మార్పులు సాధిస్తూ, అనేకమంది ఆనందంగా జీవించడానికి రాచబాటలు వేస్తున్నారు. “పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటి” అను పేరుతో అధ్యాత్మిక సంస్ధను స్ధాపించి, “ధ్యానాంధ్ర ప్రదేశ్” అనే మాసపత్రికను నడిపిస్తూ యావత్ ప్రపంచ ప్రజానీకానికి ధ్యాన, భక్తి, జ్ఞాన రంగాలలో శిక్షణనిస్తూ అపారమైన సేవ చేస్తున్నారు. ఈ ధ్యాన పద్ధతి ప్రతి ఒక్కరు ఆచరించదగ్గ సులువైన మార్గం. ప్రపంచములో ఎంతోమంది దీనిని ఆచరించి సత్ఫలితాలను సాధించి, వారి జీవితాలను అందంగా, ఆదర్శవంతంగా మలచుకొని, ఆనందామృతాన్ని గ్రోలుతున్నారు. కాబట్టి మనవంతు ప్రయత్నం మనం చేద్దాం. తద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధిద్ధాం. ఆనందంగా జీవిద్దం.

- నేతి విజయదేవ్

Tuesday, January 8, 2008

1. మనో నియంత్రణ

ఈ శరీరము పంచభూతముల మిశ్రమము. ఐదు కర్మేంద్రి యములు, ఐదు జ్ఞానేంద్రియంలతో కూడినటువంటిది. ఈ పది ఇంద్రియ ములకు మనస్సు అధిపతిగా ఉండి, సూచనలిస్తూ మన శరీరమును నడిపిస్తూ వున్నది, కంటికి కనపడేది దేహము, కనిపించనిది మనస్సు. ఈ కన పడని మనస్సు కనపడే దేహాన్ని అనగా పది ఇంద్రియములను శాసిస్తూ ఉన్నది. ఈ శరీరము మనస్సు ఆధీనమై యున్నది. ఈలాంటి మనస్సును మనం శరీరం నుంచి వేరుచేసి సాక్షీభూతంగా ఉంటూ, దాని చేష్టలను గమనిస్తూ, మనస్సుకు సరియైన శిక్షణ నిచ్చినట్లైతే అది మనం చిప్పినట్లుగా వింటుంది. అందుకే పెద్దలు మంచి మనస్సు ఉండాలి అంటారు. మనస్సు మంచిగా ఉండాలన్న, చెడ్డగా తయారుచేసు కోవలన్నా మన చేతల్లో, చేతుల్లోనే ఉంది.

మానవ మనుగడకు మనో సం యమనం చాలా అవసరం. మనస్సు చాలా శక్తివంతమైన ఆయుధం. మానవ జీవితమంతా మనస్సు మీదే ఆధారపడి ఉంది. మనస్సు చేయలేని అద్భుతాలు లేనేలేవు. మనస్సు బాగుంటే చాలు, మనం బాగున్నట్లే. ఈరోజు నామనస్సేం బాగాలేదండీ అంటాం. అదే మనస్సు నిన్నటిదాకా బాగుంది. ఈరోజు నీ మనస్సు బాగాలేనట్లుగా అనిపిస్తుంది. అంటే మనస్సు నీ చుట్టూతా వున్న పరిస్తితులు, పరిసరాలు, సమస్యల ప్రభావాలకు లోనై ఈరోజు బాగాలేదని నీకు అనిపిస్తూ వుంటుంది. కాని మూలం లోకి వెళ్ళి బాగా పరిశీలించి, పరీక్షించి చూసినట్లైతే మనస్సు యొక్క స్ధితి ఎల్లప్పుడూ ఒకేవిధంగా ఉంటుంది. కాని అది ఎప్పుడైతే దృశ్యాలలో, భావాలలో ఇరుక్కుపోతుందో అప్పుడే మనస్సు తన నిశ్చలత్వాన్ని కోల్పోయి అల్లకల్లొలంగా తయారవుతుంది. మనస్సు ఇలాంటి స్ధితిలో ఉన్నప్పుడు మనం మన మనస్సు బాగా లేదంటాం.

మనంగనక మనస్సు అలోచనాసరళిని నిశితంగా పరిశీ లించినట్లైతె, దాని చేష్టలను విశ్లేషణ చేసుకుంటూ వెళ్ళి నట్లైతె అది అనేకమైన పరిస్ధితులకు, ప్రభావలకు, ఒత్తిడులకు, అనుభవాలకు గురియవుతూ ఉంటుంది. క్షణ క్షణం ఇలా మార్పు చెందేటటువంటి మనస్సును ఒక దారిలో పెట్టడమే, మచ్చిక చేసుకుని దానికి ఒక మంచి మార్గాన్ని, గమ్యాన్ని ఏర్పరచి సక్రమమైన మార్గంలో పయనించేటట్లు చేయడమే మనో నియంత్రణ.

మనస్సు చేసే వికృత చేష్టలనుబట్టి, చంచల స్వభావాన్ని గమనించి దాన్ని కోతితో పోల్చారు పెద్దలు. కోతి చెట్టెక్కి ఒక కొమ్మ మీద స్ధిరంగా కూర్చోకుండా, ఈకొమ్మ మీదికి, ఆకొమ్మ మీదికి గంతులేస్తూ వుంటుంది. కారణం దాని స్వభావమే చంచలం కాబట్టి. అలాగే మనస్సు కూడా రక రకాలుగా చలిస్తూ ఉంటుంది. ఇలాంటి చలనమయ మైనటువంటి మనస్సును ఒడిసిపట్టుకోవడమే మనో నియంత్రణ. ఐతే ఈ కోతి లాంటి మనస్సును ఎలా మచ్చిక చేసుకోవాలి? ఎలా చేజిక్కించు కోవాలి, చెప్పు చేతుల్లొ పెట్టుకోవాలి అన్నదే మన ముందున్న ప్రధాన జటిల సమస్య.

మనస్సు బాగుంటే మనిషి బాగున్నట్లే. మరి మనస్సే బాగా లేనప్పుడు మనిషి బాధలకు లోనుకావడం, చెడుభావాలకు, ప్రలోభాలకు తలవంచినపుడు మనిషి జీవితం చెడిపోవడం ఖాయం. అందుకే మనం ముందుగా మనస్సును బాగుచేసుకోవాలి. మనస్సును తృప్తిపరచుకుని నిశ్చలత్వాన్ని సాధించాలి. కాని నిజానికి చెప్పినంత సులువు కాదు చేయటం. ఐతే మనంగనక మన ముందు ఒక ఆదర్శాన్ని, లక్ష్యాన్ని, గమ్యాన్ని ఉంచుకున్నట్లై తే ఈ చంచలమైన మనస్సును ఒక మంచి మార్గంలో పయనింపజే యడం అంత కస్టమైన పనేంకాదు.

“నీరు పల్లమెరుగు – నిజము దేవుడెరుగు” చాలా చక్కటి, చిక్కటి వాక్యం. నీరెలాగైతే పల్లానికి వెళుతుందో మానవుని మనస్సు ఎప్పుడూ నీచ స్ధాయికే పయనిస్తూ ఉంటుంది, ఎందుకంటే దాని స్వభావమే అది కాబట్టి. అందునా అది దృశ్యాలతోగాని, వస్తువులతోగాని, పరిస్ధితులతోగాని, భావాలతోగాని ప్రభావితం చేయబడ్డప్పుడు, అందులో మనస్సు గాఢంగా లీనమై నీచమైన అలోచనలు చేస్తుంది. అందుకే శిక్షణనిచ్చిన మనస్సు ఎప్పుడూ తప్పు చేయదు. శిక్షణనిచ్చిన మనస్సు రబ్బరు బంతి లాంటిది. శిఖణనివ్వని మనస్సు మట్టి ముద్దలాంటిది. ఒకవేళ తెలిసో, తెలియకో ఒకసారి తప్పు జరిగినా, శిక్షణపొందినటువంటి మనస్సు రబ్బరు బంతిలాగా ఉచ్చ స్ధానానికి మరల చేరుకోగలు గుతుంది. అదే శిక్షణలేని మనస్సు మట్టి ముద్దలాగా నీచంలో భూమిని అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి మన మనస్సుకు సరియగు శిక్షణను ఇచ్చినట్లైతె, దానిని ఒక క్రమబద్ధమైన మార్గంలో పెట్టగలిగినట్లైతే “మన బ్రతుకంతా ఆనందాల పండగ”.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతముల కలయికతో మానవ శరీరము తయారైనది. ఈ శరీరములో కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను ఐదు జ్ఞానేంద్రియములు గలవు. మరియు కాళ్ళు, చేతులు, ఉదరము, జననేంద్రియము, మల విసర్జక అవయవం అను ఐదు కర్మేంద్రియములు గలవు. ఈ పది ఇంద్రియములకు అధిపతిగా మనసు పనిచేస్తూ ఉంటుంది. మనస్సు చేతిలో మనిషి కీలుబొమ్మ. మనసు చెప్పినట్లుగా మనిషి నడచుకోవలసిందే. మనసునుబట్టి మనిషి జీవితం ఉంటుంది. అందుకే అనుభవజ్ఞులైన పెద్దలు మంచి మనస్సు ఉండాలి అంటుంటారు.

మానవుని మనస్సు ఎల్లప్పుడు స్వేచ్చగా విహరించాలని కోరుకుంటుంది. తన యిష్టము వచ్చినట్లుగా తిరిగే మనసుకు అడ్డుతగిలితే ఎదురు తిరుగుతుంది. ఎక్కడలేని బాధలను అనుభవిస్తుంది. శరీరానికి ఏమాత్రం కస్టం కలగకుండా స్వేచ్చగా, హాయిగా తిరగాలని కోరుకుంటుంది మనస్సు. విచ్చలవిడిగా తిరిగే మనసుకు ఎలాంటి కట్టుబాట్లు, హద్దులు ఏర్పరచినా వెంటనే స్పందిస్తుంది. ఏవిధంగానైనా ఆ కట్టుబాట్ల బంధం నుండి బయటపడి హాయిగా తిరగాలని ఆరాటపడుతుంది.

ఒక విషయం మీద ఏకాగ్రత కుదరాలంటే మనస్సు పూర్తిగా సహకరించాలి. ఎల్లప్పుడూ చంచలంగా తిరిగే మనస్సును ఒక్కసారిగా ఒక విషయంపై శ్రద్ధ చూపించమంటే తట్టుకోలేక పోతుంది. ఒకే దగ్గర ఉండి విషయ సేకరణగాని, పనిలో నైపుణ్యతనుగాని సాధించాలంటే మనస్సు మనిషి ఆధీనంలో ఉండాలి. దానికి ఎక్కువ శ్రద్ధ, పట్టుదల తోడు కావాలి. లేనిచో మనస్సు మనిషిని యిట్టే బోల్తా కొట్టించి హాయిగా పనినుంచి తప్పించుకుంటుంది.

"మనస్సుకు కష్టపడడమంటే ససేమిరా యిష్టముండదు. ఎప్పుడూ సుఖంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది మనస్సు. ఫరిశ్రమ లేకుండానే ఫలితాలు రావాలని ఆరాటపడుతుంది. అణువంత పనిచేసి పర్వతమంత ఫలితాన్ని కోరుతుంది మనస్సు".

"గాలి,శబ్ధము,కాంతికన్నా వేగవంతమైనది మనస్సు. మనిషి ఇక్కడే ఉన్నా మనస్సు మాత్రం ప్రపంచం చుట్టూ క్షణకాలంలో సంచరించి మరల స్వస్థానానికి చేరుకుంటుంది. మనస్సుకు మనస్సే సాటి. మనస్సు తలచుకుంటే చేయలేని పని అంటూ ఏదీ లేదు. మనస్సు చంచల స్వభావం గలది కాబట్టి దానిని పెద్దలు కోతితో పోల్చారు. కోతి ఏ విధంగానైతే ఒకచోట నిలువకుండా అటు ఇటు పరుగెడుతుందో, మనస్సు కూడా పరి పరి విధాలుగా అనేక విషయాలపై పరుగెడుతుంది. ఇలాంటి మనస్సును అదుపులో పెట్టుకోవా లంటే దానిని మచ్చిక చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు".

"సూర్యినిచుట్టూ భూమి తిరిగినట్లుగా మనస్సు చుట్టూ మనిషి తిరుగుతూ వుంటాడు. మనస్సు చెప్పినట్లుగా మనిషి ప్రవర్తిస్తుంటాడు. మానవ శరీరంలోని అవయవాలు మనస్సు చెప్పిన ప్రకారం నడచుకోవలసిందే. ప్రాణమున్న అస్థిపంజరం మానవ దేహం. దానిని నడిపించేది మనస్సనే వాహనం. కంటికి కనిపించనిది, చెవికి వినిపించనిది, స్పర్శకు అందనిది మనస్సు. కేవలం మనిషి ప్రవర్తన, కదలికలు, దైనందిన వ్యవహారాలలో మనసు ఉనికి కనబడుతూ ఉంటుంది".

ఎంతో గొప్పగా చెప్పుకొనే మనస్సును చూపించమంటే భౌతికముగా దానికి ఎలాంటి అస్థిత్వం లేదు. కళ్ళతో చూడలేనిది మనసు. కేవలం అనుభూతి ద్వారానే మనస్సును చూడగలం. కళ్ళతో చూడలేదు కాబట్టి మనస్సు లేదు అనడానికి వీలులేదు. ఈ ప్రపంచంలో కొన్నింటికి మాత్రమే భౌతికమైన ఆధారాలు లభిస్తాయి.
మరికొన్నింటిని కళ్ళతో చూసి, చెవులతో విని, శరీరంతో తాకి అనుభూతి చెందకపోయినా మానసికముగా వాటి మనుగడను గుర్తించ వచ్చు. పగటిపూట ఆకాశంలో చుక్కలు కనిపించనంత మాత్రాన నక్షత్రాలు లేవని ఎవరూ అనలేరు. ప్రతి క్షణం భూమి తన చుట్టు తాను తిరుగుచు సూర్యునిచుట్టు పరిభ్రమించడం మన స్ధూల దృస్టికి కంపించకపోయినా సూక్ష్మంగా అలోచిస్తే అది కాదనలేని నగ్న సత్యం. ఎంతో పెద్ద వైశాల్యంగల భూమి క్షణ క్షణం కదులుతున్నప్పటికి దాని ప్రభావం మనకు ప్రత్యక్షంగా కనిపించదు. అదే విధంగా మనిషికి మనస్సున్న మాట నిజం. ఐతే ఆ మనస్సును అదుపు చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నాడు మానవుడు.

మనిషికి మనసెందుకిచ్చావని దేవుణ్ణి నిందిస్తున్నాడొక కవి. మనిషికి మనస్సే ఒక పెద్ద శిక్షగా భావించబడుతోంది. మనస్సుంటే అన్నీ బాధలే. అన్నీ కష్టాలే, కన్నీళ్ళే. అందుకే మనస్సులేని వారిని పాషాణ హృదయులు అంటారు. అంటే వారికి మనస్సు లేదని కాదు అర్ధం. వారికి కూడా మనస్సు ఉంటుంది కానీ దానికి ఏమాత్రం స్పందన ఉండదు. ఎదుటివారి కష్టాలకు, కన్నీళ్ళకు ఆ మనస్సు చలించదు.

మనస్సెప్పుడూ తన ఆధిక్యతనే కోరుకుంటుంది. తాను ఇతరులకన్న అన్ని విషయాలలో గొప్పగా ఉండాలని భావిస్తుంది. ఇతరుల గురించి పొగిడితే మనస్సు ఎంతమాత్రం తట్టుకోలేక తెగ బాధపడుతుంది. తనగురించి
గొప్పగా చెబితే ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. ఇతరులలో లేని ఏదో ఒక ప్రత్యేకత తనలో ఉన్నట్లుగా ఊహించుకుంటుంది మనస్సు. ఆ విషయం
ఇతరులు గ్రహించారా లేదా అని పదే పదే ఆరాలు తీస్తుంది, ఆర్భాటాలు చేస్తుంది. ఏదో ఒకవిధంగా తన గొప్పతనాన్ని తెలియజేసే సన్నివేశాన్ని మాటల సందర్భంలో చొప్పించి ఎదుటివారి చెవిలో వేసేదాకా నిద్రపట్టదు ఈ మాయ మనస్సుకు.

"చిన్నపిల్లలు వద్దన్న పనిని చేసితీరుతారు. మనస్సు పరిస్ధితి కూడా అంతే. ఏసంకల్పము రాకూడదని అనుకుంటామో ఖచ్చితంగా ఆ సంకల్పాలనే మనస్సు రప్పిస్తుంది. అందులకే స్వేచ్చను ఇచ్చి నైపుణ్యముగా మనస్సును బుద్ధియందు, బుద్ధిని ఆత్మయందు స్ధాపితము గావించవలయును. ఇదే మనోలయ యోగము. అమనస్క స్ధితి".

స్వామి శివానందులవారు సాధనచేయు ప్రారంభ దినములలో మనస్సును జయించుటకు ఎన్నొ కష్టాలు అనుభవించినట్లు వ్రాసుకున్నారు. మన మనస్సు ఏదైతే సంకల్పిస్తుందో దానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలుపెట్టేసరికి కొద్దిరోజుల తరువాత మనస్సు నెమ్మదిగా తన మాట వినడం మొదలుపెట్టిందట. ప్రారంభ దశలో మనస్సును జయించుటకు ఎవరికి అనుకూలమైన పద్ధతిని వారు ప్రయోగించి మనస్సును వశపరచుకోవాలి. దొంగచేతికి తాళంచెవి ఇచ్చినట్లు నామ, రూప, దృశ్య గోచర ప్రపంచమంతయు నీ ఆధీనంలో గలదని మనస్సుకు బాధ్యతను అప్పగించాలి. అప్పుడు ఏచిక్కులు ఉండవు.

"ఈ భూమిపై మనం చూస్తున్న గిరులు, తరులు, సెలయేర్లు, సమస్త వస్తువులకు వయస్సుంది. భూమికి వయస్సుంది. పంచభూత నిర్మిత ప్రపం చానికి వయసుంది. సూర్య చంద్రులకు వయసుంది. కాని విశ్వ మనస్సుకు వయసు లేదు. వయసులేని మనస్సు వశంగావడం అంత తేలికైన పని కాదు సుమా" అంటున్నారు బాబా సర్వకేంద్రులు.

"నిలుకడలేని మనస్సుకు సంకెళ్ళువేసి, బహిర్ముఖ పదార్ధముల వైపు సంచరించకుండ,మదపుటేనుగును లొంగదీయుటకు అంకుశమువలె
నియమనిస్ఠలు, దీక్షలు, వ్రతములు, ఆరాధనలు, మౌనవ్రతములు, చాతుర్మాస్య వ్రతములు మొదలగునవి ఆ కోవలోనివి. మనస్సు యోచనలో కేంద్రీకరింప బడినపుడు అది మానస పూజ. దీనిచే అజ్ఞాని జ్ఞాని యగును. మానవుడు మాధవుడగును".

"మనస్సు జలమువంటిది. నీటిని ఏ పాత్రలో పోసిన ఆ పాత్ర ఆకారముగ మారునట్లు, మనస్సు దేనిని చింతించిన తదాకారముగ పరిణమించ గలదు. ఆందులకై నిరంతరం ఆత్మ చింతనా నిమగ్నులు కావాలి. భావములు పర్వతముల వంటివి. అభేధ్యములు. భావోద్రేక ప్రకంపన తరంగములు విశ్వమయముగ వ్యాపించును. అందులకై సద్భా వన శీలురు కావాలి. నీ భావన భగవన్మయ మైనపుడు జగమంతయు నీకు భగవన్మయముగానే భాసిల్లుతుంది" అంటున్నారు బాబా సర్వకేంద్రులు.

"కర్మకాండలో పాల్గొనినపుడు శరీరముతో పనులు జరుగును. ఇంద్రియ మనంబులు అలాకావు. ఇంద్రియములు కూడా జడములే. మనో ప్రేరణ ననుసరించి అవి పనిచేయగలవు. కన్ను మూసినంతనే సంకల్ప శక్తినిబట్టి మంచిగాని, చెడుగాని క్షణములో జరుగును. దేహేంద్రియములు అదుపులో ఉండాలనిన మనో నియంత్రణ అత్యవసరము. ప్రతి సాధకుడు ఈవిషయమును మరువకూడదు. మనస్సు కంటికి కనిపించదు. వాయుభూత సంబంధమైన మనస్సు క్షణములో ప్రపంచమును చుట్టి రాగలదు. ఏ రాకెట్ వేగము దీనితో సరిపోదు. గ్రామాలు, దేశాలు, గోళాలు, వ్యక్తులు, శక్తులు అన్నింటిని మనస్సు చూడగలదు. కనిపించని వాటిని కూడా ఊహించి తనలో లీనము గావించుకుంటుంది. మనో నిగ్ర
హమే సమస్త సాధనలకు మూలసూత్రం" అంటున్నారు బాబా సర్వ కేంద్రులు.

"బహిర్ విషయాలలోకి ప్రవేశించకుండ చూచుకోవటం జ్ఞానసిద్ధి. ఒక గదిలో వస్తువులు ఉన్నాయనిన అవి వాటంతట అవి రావు. బయటనుండి తెచ్చినవే రాగలవు. అలాగే మనస్సులోకి సంకల్ప ప్రేరణల ద్వారా విషయాలు ప్రవేశించును. ఒక్కొక్క వస్తువును తీసినపుడు గది ఖాళీ కాగలదు. అలాగే సంకల్పబలంతోనే నిర్విషయ సిద్ధి తధ్యం. ముల్లును ముల్లు ద్వారా తీసి రెంటిని పారవేయునట్లు ఎరుకద్వార ఎరుకనెరింగి రెంటిని మానుకోవాలి. సంకల్పబలము గొప్పది. సద్విషయ ములలో ఇది ముఖ్యం. కాయిక, వాచిక, మానసిక సమస్త కర్మలు మనో మయములు. అందులకే మనోనిగ్రహమే త్రికరణ శుద్ధికి మూలం" అంటున్నారు బాబా సర్వ కేంద్రులు.
- నేతి విజయదెవ్

Monday, January 7, 2008

సద్భావనా స్రవంతి

ముందుమాట

దివ్యాత్మ స్వరూపులారా! సృష్టి ప్రారంభమై ఇప్పటికి యుగాలు గతించాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం కలియుగం లో 5110 సంవత్సరం లో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. క్రీస్తు శకం 21వ శతాబ్ధం లో పయనిస్తున్నాం. రాజులు గతించారు. రాజ్యాలు పోయాయి. విదేశీయుల కబంధ హస్తాలనుండి బయటపడ్డాం. మన శరీరాలు జనించాయి. పెరిగి పెద్దవై నశించే తరుణం ఆసన్నమైనది. ఈ సృష్టి ఇంకెన్నో యుగాల పర్యంతం నిర్విరామంగా జరుగవలసియున్నది. ఈ కాల గమనం లో మన శరీరాల అస్థిత్వం క్షణకాలం మాత్రమే. అందులకే మన శారీరక జీవనకాలంలో సర్వ సద్గుణ సంపత్తిని మూటగట్టుకొని, ఉత్తమ సంస్కారాలను బలపరుచుకొని, వర్త మాన కాలంలో భౌతిక సుఖాలను పరిమితంగా అనుభవిస్తూనే, మన ఆత్మ శ్రేయస్సుకోసం రాచబాటలు వేసుకుందాం. ముక్తి సామ్రాజ్యంలోకి ప్రవేశించేందుకు “దేహ భావన నుండి దైవ భావం”లోకి పయనిద్దాం. దైవావతారులమై జీవిద్దాం.
శరీరం నాదనుకున్నప్పుడే కష్టాలు, కన్నీళ్ళు. సచ్చిదానంద పర:బ్రహ్మ స్వరూపులమనే భావన కలిగిననాడు అంతా పరమానందమే. ప్రతి పామర పూత ఫలవంతమయ్యే రోజు రాగలదు, ఇంకెన్ని జన్మలకైనను నిజమెరింగిన పిదప ప్రతి అజ్ఞాని వెక్కి వెక్కి ఏడువవలసి వస్తుంది. ఫ్రస్తుతం ఎందరో అజ్ఞానులు జ్ఞానోదయ తదనంతరం గత జీవితముల తలచుకొని కృంగిపో తున్నారు.
సాకారం నుండి నిరాకారం లోకి, సగుణం నుండి నిర్గుణం లోకి, ద్వైతం నుండి అద్వైతం లోకి, వ్యస్టి భావన నుండి విశ్వభావం లోకి, దేహ భావన నుండి ఆత్మ భావనలోకి రావడమే ఆద్యాత్మిక పరిజ్ఞానం, ఆత్మానందానికి పరమ సోపానం! సకల చరాచర జీవజగత్తులో పరమాత్మను దర్శించిన వాడే ఆత్మ జ్ఞాని. కనుక స్వత:హాగా మనమంతా సాక్షాత్తూ దైవ స్వరూపులమై ఉన్నాం. ఇట్టి మన నిజ స్వరూపాన్ని తెలుసుకొని, ఆత్మానందాన్ని అనుభవించి, అనుబూతి చెందడమే మోక్షం, జన్మ రాహిత్యం. మానవ జన్మ ఎత్తిన పిదప తన నిజ స్వరూపాన్ని తెలుసుకోకపోవడమే పాపం! తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతర మానవ జీవులకు తెలియజెప్పక పోవడమే మహాపాపం!!

ఈ గ్రంధం లో జీవిత గమనంలో నాకు తటస్తించిన సంఘటనలను, సందర్భాలను, ప్రేరణలను, అనుభవాలను, దివ్య అనుభూతులను ఆధారం చేసుకొని, మనో విశ్లేషణ గావించి, నిత్యానిత్య వస్తు వివేచనతో ఆత్మ విచారణ గావించి, ఆ భావాలకు అక్షర రూపం ఇవ్వడంజరిగింది. ఈ గ్రంధం లో ఉదహరించిన ప్రతి అంశం ఒక మనో వికాసాన్ని, ఆత్మ పరిశీలనా భావాన్ని, ఆధ్యాత్మిక తత్త్వాన్ని, ఆత్మోద్ధరణ ప్రాశస్ధ్యాన్ని తెలియజేస్తుంది.

పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములు కలిగి మానవాకారంలో ఉన్న మనిషి ప్రకృతి గుణములతో పుట్టి, బాల్యదశలో కల్లకపట మెరుగక, పవిత్రముగా ఉంటూ, పెరిగి పెద్దై నిజజీవితములో నిత్య కృత్యాలు నిర్వర్తించడానికి సమాజములోకి ప్రవేశించగానే తనలోని నిష్కల్మ షత్వాన్ని కోల్పోతున్నాడు. త్రిగుణములలో చిక్కి, ఇంద్రియాల వత్తిడివల్ల మనసు వశం తప్పగా తప్పటడుగులు వేస్తాడు. సమకాలీన సమాజ నీతికి తలయొగ్గి, అంతరాత్మ ప్రభొధాన్ని మరచి నలుగురితో నారాయణ యంటూ తాను, తన కుటుంబం, తన బంధువర్గమంటూ గిరిగీసుకొని జీవి స్తున్నాడు.తాను ఏర్పరచుకున్న సంకుచిత పరిధిలో పరిభ్రమిస్తూ అదే జీవిత సర్వస్వమని భావిస్తున్నాడు. తన జీవనపోరాటానికి, ఆర్ధిక పరిపుష్టికి, హోదా, పలుకుబడి, గొప్పదనాలు ప్రదర్శించుకొనుటకు ఏ కార్యమైనా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తన ఆర్ధికాభివృద్ధే జీవిత లక్ష్యంగా ఎంచుకొని, నీతినియమాలకు, సామాజిక న్యాయానికి, సమతా మమతలకు, ఉచితానుచితాలకు తిలోదకాలిచ్చి, సమాజ దృష్టిలో తాను ఉన్నత స్థానంలో ఉన్నానని నిరూపించుకోవడానికి నానా యాతనలు పడుతున్నాడు.

ఈ దశలో మానవుడు తన నిజస్థితిని మరచి, తాను పంచభూత నిర్మిత దేహంగా భ్రమించి, దాని బాగోగులకు అధిక ప్రాధాన్యతనిచ్చి తన అసలు స్వరూపాన్ని మరచిపోయాడు. ఫెద్దలు, మహానుభావులు, మహనీయులు, సర్వసంగ పరిత్యాగులు, సద్గురువులు అనాదిగా అసలు సత్యాన్ని ప్రవచిస్తూనే ఉన్నారు. ఐనా మానవుడు మాయలో పడి గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్నాడు.

ఒకనాడు వేదములు, ఉపనిషత్తులు, తత్త్వశాస్త్రము, వాస్తు శాస్త్రము, జ్యోతిష్యం మున్నగు విద్యలు రహస్యముగా ఉంచబడినవి. కాని నేటి ఆధునిక కంప్యూటర్ యుగంలో ప్రతి శాస్త్రము బట్టబయలు గావింపబడినది. పూర్వకాలములో మునీంద్రులు ముక్కు మూసుకొని అడవులలో తపస్సు చేసుకునేవారు. కాని ప్రస్తుతం ప్రతి జీవి, ధ్యానం, యోగంలాంటి ఆధ్యాత్మిక ప్రక్రియలను సాధనచేస్తూ ఉద్ధరణ నిమిత్తం పాటుపడుతున్నారు. మీరుకూడా ఇదేమార్గంలో పయనించి ఆత్మానందాన్ని అనుభవించాలని ఆకాంక్షిస్తున్నాను.

మనిషి వ్యక్తిత్వానికి ఆర్ధిక పరిపుష్టే గీటురాయిగా తలంచిన సమాజం, అందులో అంతర్భాగమైన మానవుడు భౌతిక సుఖ సంపదలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాడు. ఖర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన మార్గాలలో సహజత్వం కొల్పోయి, ఆడంబరం, కృత్రిమత్వం చోటుచేసుకుంది. ఫలాపేక్ష లేకుండా పనిచేసే ప్రావీణ్యతను మానవుడు సాధించలేక పోతున్నాడు. భక్తి మార్గంలో పరవశించిపోయి రామకృష్ణ పరమహంస, భక్త తుకారాం, భక్త మీరాభాయి వలె భగవత్ సాక్షాత్కారానికై వలవలా కన్నీరు కార్చి, తహతహలాడ లేకపోతున్నాడు. ధ్యానం, యోగం లాంటి సాధనా ప్రక్రియలు కేవలం శారీరక రుగ్మతలను నివారించుకొనుట వరకే పరిమితమయ్యాయి. ఇక జ్ఞాన మార్గంలో పయనించి సమాధి స్థితిని పొంది, స్థితప్రజ్ఞతతో ఆనందమయ జీవితం గడిపేవారి సంఖ్య సమాజంలో బహు స్వల్పాతి స్వల్పమనే చెప్పాలి.

ఆశాపాశాలకు, విషయవాంచలకు, రాగద్వేషాలకు, అరిషడ్వర్గాలకు, తళుకుబెళుకులకు, సామాజిక కట్టుబాట్లకు బానిసయైన మనిషి తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. తనకు భిన్నంగా దైవత్వంగలదని, ఆనందమనేది బయట ఎక్కడో ఉన్నదని భావించి, బాహ్య ప్రపంచంలో సంచరిస్తున్నాడు. అంతర్ముఖుడై అసలైన ఆనందాన్ని చవిచూడలేక పోతున్నాడు. ఈ ప్రస్థానంలో మనశ్శాంతి కరువై దిక్కుతోచక దీనంగా విలపిస్తున్నాడు.పాశ్చాత్య విష సంస్కృతికి ఆకర్షింపబడి భౌతికవాదంలో కాలం గడుపుతున్నాడు.

ఈ గ్రంధం చదివి ఏ కొద్ది మందైనా తమ ఆలోచనాసరళిలో దోషముంటే సవరించుకొని, ఆచరణశీలురై తామున్న ప్రస్తుత భౌతిక, మాన సిక స్తితినుండి పైకెదిగి, తమ వ్యక్తిత్త్వాన్ని ఎవరెస్టు శిఖరమంత ఉన్నతంగా పెంచుకొని, ఉదాత్తమైన, ఉన్నతమైన ఆలోచనాసరళిని ఏర్పరచుకొని, ఉత్కృస్టమైన ఆదర్శాలను, లక్ష్యాలను, గమ్యాలను నిర్దేశించుకుని, మానవ జీవిత పరమార్ధమైన ఆత్మ జ్ఞానాన్ని సముపార్జించి, జన్మ సార్ధకం చేసుకో గలిగితే నాయీ ప్రయత్నం సఫలమైనట్లుగా భావించి పరమానందం చెంద గలను. ఎవరికి వీలున్న పరిధిలో వారు జ్ఞాన ప్రచారాన్ని చేపట్టి, సమస్త మానవాళిని దైవస్వరూపులుగా మార్చే దిశగా సర్వులు పయనించాలని నా అభిలాష. అందుకోసం ఇలాంటి “సద్భావనా స్రవంతులు” ఎంతగానో తోడ్పడతాయని నా ప్రగాఢ విశ్వాసం.

తాత్త్వికునికి సైతం సామాజిక స్పృహ పరమావశ్యకం కాబట్టి సమకాలీన సమాజంలోని మనుష్యుల మనస్తత్త్వాన్ని పరిశీలనాత్మక దృష్టితో అవలోకిస్తూ, భావాలకు అక్షర రూపమిచ్చి, యదార్ధాన్ని తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే యుక్తాయుక్తాలను, నిజానిజాలను విచారించి, మానసిక పరిణతిని పొంది, సాత్త్వికాహార నియమంతో, సజ్జన సాంగత్యం సలుపుతూ, నియమ నిష్ఠలతో సాదనలు సలిపి, ఆత్మాను సంధానానికి జ్ఞానమార్గమొక్కటే శరణ్యమని తలంచి, నా గురుదేవులు బాబా సర్వకేంద్రులవారు ప్రవచించిన తత్త్వసారాన్ని మరియు మహర్షులు, సర్వసంగ పరిత్యాగులు నుడివిన సూక్తులలోని మకరందాన్ని సేకరించి, సమకాలీన సమాజంలో మానవుని ప్రవర్తనారీతిని గమనించి, ఆకళింపు చేసుకొన్న అనుభవంతో ఏ కొద్దిమందికైనా ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుందనే సదుద్దేశ్యంతో నాకు తోచిన రీతిలో వివిధ వ్యాసాలుగా, కవితా రూపంలో, పద్య శతకంగా పాఠకులముందు ఉంచడం జరిగింది. ఫ్రతిస్పందన పాఠక దేవుళ్ళనుండి పొందవలసి ఊంది. ఈ పుస్తకంలోని ప్రతి అంశాన్ని అమూలాగ్రం చదివి, తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.

గమనిక: నా గురుదేవులు బాబా సర్వకేంద్రులు నా చిన్నతనంలో చేసిన ఆధ్యాత్మిక నామధేయమైన “నేతి విజయదేవ్” పేరుతో ఇకమీదట రచనలు కొనసాగగలవని పాఠకదేవుళ్ళకు తెలియజేయుచున్నాను.

సకల చరాచర సుఖాభిలాషి,
నేతి విజయదెవ్

Saturday, January 5, 2008

రచయిత రచనలపై ప్రముఖుల ప్రశంసలు

* నాగులవంచ వసంతరావుగారు రచించిన ”సద్భావనా స్రవంతి” పుస్తకం చదివాను. వసంతరావుగారిలోని సదాలోచనలకు ఈ చిన్న పుస్తకం అద్దం పట్టింది. ‘విశ్వస్శక్తుల ఆవాహన' అనే శిర్శికలో వసంతరావు గారు ప్రకటించిన ఆశయాలు సార్వజనీన సత్యాలు. మానవుడు ఉత్తమ మానవుడుగా రూపొందడానికి కావలసిన వివిధాంశాలను ఈ గ్రంధములో పొందుపరిచారు వసంతరావుగారు. ఎవరికైనా కావలసింది చక్కని ఆలోచన, అందుకు తగ్గ ఆచరణ. ఈ రెండు పార్శ్వాలను ఈ గ్రంధములో పొందుపరిచారు వసంతరావు గారు. అందుకు వారిని నేను అభినంది స్తున్నాను.
-డా. సి. నారాయణరెడ్డి, సుప్రసిద్ధకవి, రచయిత, హైదరాబాద్.
* మీరు రచించిన “సద్భావనా స్రవంతి” పుస్తకం ఆమూలాగ్రం చదివాను. “సెల్ ఫోన్-విల్ ఫోన్” నుంచి మీ అంతిమ వాక్యాల వరకు బాగున్నాయి. “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” అన్న పుస్తకం పూర్తిగా చదివాను. విద్యార్ధులకు ఉపయోగపడేలా చాలా బాగుంది. అభినందనలు.
- యండమూరి వీరేంద్రనాధ్, సుప్రసిద్ధ రచయిత, హైదరాబాద్.

* మీరు పంపిన “సద్భావనా స్రవంతి” పుస్తకం చదివాను. ఇందులోని వ్యాసాలు చిన్నవిగాను, రమ్యముగాను ఉన్నాయి. “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” గ్రంధం లో విద్యార్ధులకు ఉపయోగపడే అనేక ‘టిప్స్’ గలవు. ఇది పాఠకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి, సుప్రసిద్ధ రచయిత, హైదరాబాదు.

*మీరు అభిమానంతో పమంపిన “సద్భావనా స్రవంతి” పుస్తకం పూర్తిగా చదివాను. ఒకసారి కాదు, రెండు సార్లు. ఛాలా బావుంది. పాజిటివ్ థింకింగ్ కలిగించే అంశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా 50వ అంశం చాలా అవసరం. సృష్టిలో లేదు లోపం, అంతా దృష్టి లోపమే”
అనే సజెషన్ చాలా బావుంది. మీ కలం నుండి ఇలాంటివి వెలువడాలని
కోరుకుంటూ…
-డా.బి.వి. పట్టాభిరాం, ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త, హైదరాబాద్.

* దైవ దృష్టిలో మానవుడు అగ్రగణ్యుడు. అతడి ఆలోచనలే అతని వ్యక్తిత్వ వికాసానికి అధారముగా ఉంటాయి. సదాలో చన, సత్సాంగత్యం మానవుని మాధవునిగా మారుస్తాయి. సమాజం లో మనిషి ఎలా మెలగాలో, ఎటువంటి ఆలోచనలతో జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలో అట్టి సద్భావనలను సమాహారం గా సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధముగా అందజేసిన మీకు నా అభినందనలు. బాబా సర్వకేంద్రుల “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” పుస్తకం అత్యంత ఉపయుక్తమైన గ్రంధం. అన్ని గ్రంధాలయాలలో ఉంచదగిన మంచి పుస్తకం. “చైతన్య స్రవంతి” కవితా సంపుటి పేరుకు తగినట్లుగా జీవిత సత్యాల సంకలనం. నవయువకులకు ఉద్భొధ సముచితంగా ఉంది. “డబ్బు-జబ్బు” నుండి తేరుకొని ధర్మబద్ధముగా జీవించమన్నారు. ఒక్కొక్క కవిత జీవిత శ్రేయమును బోధిస్తున్నది. మీ కృషి అభినందనీయం.
- డా. జానమద్ది హనుమచ్చాస్త్రి, కడప.

* “సద్భావనా స్రవంతి” మా గడపదాటి మా యింటిని పావనం చేసింది. అందులో ఎన్నిసార్లు గ్రుంకులిడినను తనివితీరుట లేదు. ప్రభు సమ్మతములైన సూక్తులు కాంతా సమ్మతములవోలె మనోహరములు కావు. కానీ ఇది “సద్భావనా స్రవంతి”. ఏతజ్జల ధారలు నిర్మలములై, పవిత్రములై, లోతులేక సర్వులకు స్నాన యోగ్యములై, పాన యోగ్యములై, తృష్నా పనోదములై, అలతులైన తరంగాలతో తాపత్రయపుటెడారిలో సాక్షాత్కరించి, జీవనయాన పధికులను సేదదీర్చి తరింప జేయుచున్నవి. విశ్వశక్తుల ఆవాహన మొదలు స్తోత్రగీతం వరకు ఆధ్యాత్మిక తరంగమాలికలతో అలరారు మీ సద్భావనా స్రవంతి నన్ను ధన్యున్ని చేసింది. కృతజ్ఞుడను.
- ఎర్రాప్రగడ రామమూర్తి, పినపాక, ఖమ్మం జిల్లా.

* “ఇంద్రియాణి పరాణ్యాహు రింద్రియేభ్య: పరమ్మన:
మనసస్తు పరాబుద్ధిర్యో బుద్ధే:పరసస్తుస:”

దేహం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకంటే మనస్సు, మనస్సుకంటేబుద్ధి, బుద్ధికంటే ఆత్మ ఒకదానికంటే ఒకటి శ్రేస్ఠమైనవని భగవద్గీత ఆత్మ ప్రాధాన్యతని వివరించింది. ఆత్మమధనమే జీవుని వేదన. శోకం నుంచి శ్లోకం వెలువడి మహోన్నత ఆదికావ్యం ఉద్భవించినట్లు రచయిత శ్రీ వసంతరావు గారి ఆత్మ తపించి వెలయించిన భావ తరంగాలు “సద్భావనా స్రవంతి”గా ప్రసరించాయి.ఇటువంటి గ్రంధరచన చేయాలంటే జీవనగమనం
లోని సంఘర్షణ మాత్రమే సరిపోదు - ఆత్మవివేచన పండాలి. అనుభవాలు చాలవు – అనుభూతులు అందాలి. తార్కిక దృష్టికి జ్ఞాన సరస్వతీదేవి అనుగ్రహ భిక్ష తోడుకావాలి.

‘విశ్వశక్తుల ఆవాహన’ చేసిన వసంతరావు గారు చెప్పిన రచనా సంకల్పం మహత్తరమైనది. ఆధునిక సమాజానికి వలసిన సర్వ శక్తులను సమీకరించి ప్రతి ఆత్మలో ఆవిష్కృతం చేసే దివ్యసంకల్పం ఇది. సంఘంలో, సంఘంలోని మనలో ఎన్నదగిన దోషాలున్నాయని అందరికీ తెలుసు. ఆ దోషాలను ఎలా నివారించుకోవాలో అరటిపండు ఒలిచి చేతిలో ఉంచినట్లు చెపారు రచయిత. “బలమే జీవనం – బలహీనతయే మరణం” అనే స్వామి వివేకానందుని ప్రబోధం నిజం కావాలంటే ఈ చిరుపొత్తం లోని ప్రతి అంశాన్నీ ఆచరణ యోగ్యముగా అనువర్తింప చేసుకోవాలి. “వాగ్భూషణం భూషణం” అనే హితోక్తిని గుర్తు చేస్తూ మాటే మంత్రం అంటూ మనో నిగ్రహంతో ఏకాగ్రతతో భాష, భావం ఏకీకృతం గా స్థిరమైన మనస్సుతో మాట్లాడే మాట ఎంత ప్రభావితం చేస్తుందో రచయిత వివరించిన తీరుచూస్తే మహనీయుల వాక్కుకు అంతటి శక్తి ఎలా లభించిందో అర్ధమవుతుంది. “సద్భావనా స్రవంతి’లోని ప్రతి భావన అత్యంత విలువైన రత్నం లాంటిది. ఒక్కొక్క భావనను త్రికరణ శుద్ధిగా ఆచరించటానికి, సాధన చేయటానికి జీవితమే చాలదేమో! కనీసం ఒక్కటి ఆచరించగలిగినా మానవుడు మాధవుడౌతాడు, చెడ్డ ఆలోచనలను దూరం చేసుకొని, ఏకాగ్రతతో సద్భావనలను పెంచుకొని, ఉత్తమ ఆదర్శం కోసం ఈర్ష్యా ద్వేషాలను వీడి, జ్ఞాన సరస్వతిని ఆవాహన చేసికొని, విశాల దృష్టితో, మృదు భాషతో, సద్గ్రంధ పఠనతో, సత్కార్యా చరణ చేయమని సన్మార్గ ప్రేరణ కల్గిస్తున్న తత్త్వరచన ఇది! శ్రీ గురు ఆశీర్వాదబలం ఇది.

ఆత్మ సౌందర్యం అనుభవైక వేద్యమేగాని చర్మ చక్షువులకు అందేది కాదు. “అందరిలోనూ ప్రకాశించే ఆ దివ్యాత్మ ఒకటే” అని గ్రహించ గలిగితే దు:ఖం ఉండదు. అంతా పరమానందమే!ఆనంత చైతన్య స్వరూపమే!
ఇటువంటి ఉదాత్త భావాలను ప్రోదిచేసుకొని అక్షర రూపం ఇచ్చిన వసంత రావుగారు సహోద్యోగిగా ఎందరికో చిరపరిచితులైనా ఈ గ్రంధపఠనం వల్ల వారిలోని వెలుగు కోణాన్ని దర్శించగలిగానని ఆనందిస్తున్నాను. స్వగతం వెలుగై వసంత రావుగారు వ్యాపించిన తీరును వివరించి స్పందింప జేసింది, కొన్ని సంస్కారాలు పూర్వజన్మ సుకృతులు. వివిధ వికృత పోకడలతో సమాజం తలలు దించుకుంటున్న వేళ ఇటువంటి సద్భావనా కిరణాలు ప్రసరించే జ్ఞాన స్రవంతిని పఠితల కందించిన శ్రీ నాగులవంచ వసంతరావును అభినందించ డం కాదు, జన్మ పరమార్ధాన్ని గుర్తు చేస్తున్నందుకు అభివందనాలు తెలుపు దాం. ఆత్మ సంస్కారాన్ని మేల్కొలుపుతున్నందుకు శుభాభివందన చందనాలతో పలకరిద్దాం!
-డా. చిల్లర భవానీదేవి, ప్రముఖ రచయిత్రి, సచివాలయం, హైదరాబాద్.

* మంచిగా ఆలోచించటం, మంచిగా స్పందించటం మానవ లక్షణం ఐతే సమాజం మహోన్నతంగా ఉంటుంది. మనిషి ఆలోచన మంచి
దైతే మంచి పనులే చేస్తాడు. మంచి ఫలితాలే సాధిస్తాడు. సమాజం చెడిపోవడం అంటే మానవ స్వభావం చెడిపోయినట్లే. మంచి భావ
నతో కుటుంబాన్ని చక్కదిద్దుకోగలిగితే దేశం అభ్యున్నతి సాధించినట్లే.
మనిషికి ఒక నిర్ధుష్టమైన ప్రణాళిక, లక్ష్యం, ఆదర్శం ఉండడం తప్పనిసరి. అప్పుడే మహోన్నత సమాజం రూపుదిద్దుకుంటుంది.

మనిషి ఉదాత్తమైన, ఉత్కృష్టమైన ఆలోచనలతో ఎలా ఆదర్శ జీవితాన్ని గడపవచ్చో, లక్ష్యాలను, గమ్యాలను నిర్దేశించుకొని ఉన్నత స్థితికి రావచ్చునో ఇందులో రచయిత సూచించారు. రచయిత వసంతరావుగారు ఈ చిన్న గ్రంధములో మానవ జీవితములోని భిన్న కోణాలను తార్కిక దృష్టితో విశ్లేషించడం ప్రశంసనీయం. సద్భావనలే జీవజగత్తు సుఖ శాంతులకు మూలమన్న సత్యాన్ని ఎవరూ కాదనలేరు.
-డా. ఫరుచూరి గోపాలకృష్ణ, సుప్రసిద్ధ సినిమా రచయిత, హైదరాబాద్.


* ఎంత అద్భుతంగా మకరందాన్ని సేకరించాడు వసంతరావు. ఎన్నో రకాల పూలలోని సుగంధాన్ని చిన్న పుస్తకములో పొందుపరిచారు. ఎంతో కస్టపడి తేనెటీగలు పుష్పాలలోని తియ్యటి తేనెను సంగ్రహించి, పరపరాగ సంపర్కానికి తోడ్పడి, ఫల పుష్ప జాతి అభివృద్ధి చెసేటట్లు చేస్తే, ఈగలు చెత్తకుప్పల మీద వ్రాలి మళ్ళీ వచ్చి మనం తినే వస్తువులమీద వ్రాలి వ్యాధులు కలుగజేస్తాయి. అలాగే మంచివాడికి, చెడ్డవాడికి అంత తేడా
ఉన్నది. సద్భావనా తరంగాలను మనస్సునిండా నింపుకుంటే అందరూ మంచి వాళ్ళు కావచ్చునని మిత్రుడు వసంతరావు ”సద్భావనా స్రవంతి”లో తెలియ జేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలనుంచి వసంతరావుతో పరిచయం ఉన్నది. ఆయనలోని భావతరంగాలను దర్శించే అవకాశం కలుగలేదు ఎప్పుడూ. “అంతర్యామి” శిర్శికలో ఆయన వ్రాసినది చదువగానే ఆశ్చర్యమేసినది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, పరుషంగా ఎప్పుడూ ఒక్కమాట మాట్లాడని ఈ వసంతరావుగారి అంతరంగం లో అద్భుత, అందమైన ప్రపంచం దాగివుందని తెలిసింది. నిశ్చలముగా ఉండే మనిషి ప్రపంచాన్ని జయిస్తాడన్న సూక్తి గుర్తుకొచ్చింది. ఇక్కడ ప్రపంచాన్ని జయించడమంటె బ్రతుకును ఆనందమయం చేసుకోవడం. ఎన్నో మార్గాలు ఆయన తన రచనలో చూపించాడు ఆనంద ముగ బ్రతుకమని బ్రతిమాలుతూ.

ఛితి నిర్జీవమైన శరీరాన్ని దహిస్తుంది. చింత సజీవమైన శరీరాన్ని క్రుంగదీస్తుంది, దహించివేస్తుంది. అందుకే అందమైన గులాబీని గుండెలో నాటు కుంటే ఆ పువ్వు సువాసనలు వెదజల్లి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. దేహ భావం నుండి దైవభావం లోకి ప్రవేశించడానికి కష్టపడాలిగాని, మాటల్లో, ప్రవర్తనలో ఉదాత్తముగా ఉంటేచాలు మానవజన్మ సార్ధకం ఐనట్లే.
-అలపర్తి రామకృష్ణ, ప్రముఖ,కధా, నవలా రచయిత, వనస్థలిపురం.

* నేటి ప్రజలకు కావలసిన చక్కని శాంతి సందేశములు “సద్భావనా స్రవంతి” లో దండిగా గలవు. మానవులకు చాలా ఉపయుక్త ముగా నున్నవి. ప్రతి తెలుగు సోదరీ సోదరులకు ఈ పుస్తకం అందవలెనని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఇంకా ఇటువంటి పుస్తకములు రచించి నూతన సమాజమునకు తోడ్పడగల రని ఎదురుచూస్తున్నాము. “చైతన్య స్రవంతి”, “నిత్య సత్యాలు” పుస్తకాలలో ఎ టు జెడ్ మీరు వ్రాసినవన్నీ చాలా చాలా బాగున్నవి. మీలోనున్న ఓంకారమే స్వయముగా వ్రాసి నవిగా ఉన్నవి. ఇది పొగడ్త కాదు. ఓంకారుల వారికి జోహార్లు. ఛెప్పరా నంత ఆనందముగా ఉన్నది. మీ కవితలు, పద్యాలు, అందరి హృదయాలలో దీపాలు వెల్గించినట్లుగా ఉన్నవి.
- స్వామి చిత్ శివానంద, శ్రీ శాంతి ఆశ్రమం, శంఖవరం, తూ.గో.జిల్లా.

* అద్వైతమును నమ్మినవారికి దేహాలు వేరుగా ఉన్నా ఆత్మ ఒక్కటే కదా! ఆందువలననే ఇద్దరి భావనలు, తాపత్రయం. తమవలె ఈ ప్రపంచ ములోని ఇతర దేహధారులు ఆస్వాదించి, ఆనందించవలెనని అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టినట్లు అందించారు సద్భావనా స్రవంతిని. “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను” (శ్రీశ్రీ) అన్నట్లు సంతృప్తితో ఉండండి. అంతకంటే చేయగలిగింది ఏముంది? అందించిన వానిని అందుకుని సుఖశాంతులు పొందటం వారి వారి పురుష ప్రయత్నం పై
ఆధారపడి ఉంటుంది. అందుకునే అర్హత ఉన్నవారికే అర్ధమౌతుంది దాని విలువ. “చైతన్య స్రవంతి”, “నిత్య సత్యాలు” పుస్తకం చదివాను. కవితలు చాలా బాగున్నాయి. చెప్పవలసినదంతా ఏమీ మిగల్చకుండ చెప్పారు.ఆస్వాదించి, అనుభవించి, ఆనందం గా జీవించగల అదృస్టవంతులు ఎవరో? మీ పని మీరు చేసినారు. ఆనుభవించి, పలువరించు వారి కోసం ఎదురుచూడండి.
-కోకా నాగేంద్ర రావు, ఆధ్యాత్మిక గ్రంధ రచయిత, తిరువణ్ణామలై, తమిళనాడు.

అహంకారం నశిస్తే ఆత్మజ్ఞానం కలుగును
దేవుడంటే ఆకాశం అవతల లేడు
నీ హృదయములో దాగివున్నాడు దేవుడు
మల్లెపూవు లాంటిది సజ్జన సాంగత్యం
మానవునిలో మాధవున్ని చూడు!
ఇవి శ్రీ రమణ మహర్షి హృదయములోనివి.
("సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి" గ్రంధ ముద్రణకొరకు రూ.10,000/-సహాయం చేసి, జ్ఞాన దానం చేయుటకు సహకరించిన దాత)
- ఓ. నాగేశ్వరరావు, (ప్రస్తుత నివాసం:తిరువణ్ణామలై, తమిళనాడు)
ఒంగోలు, ప్రకాశం జిల్లా.



* మీ రచన “సద్భావనా స్రవంతి” సంతృప్తిగా చదివాను. మహదానంద మైనది. మీ దివ్యానుభూతిలో పాలు పంచుకొనే అదృష్టానికి నోచుకున్నందుకు ధన్యున్ని. మీరు ధన్యజీవులు. బాబా సర్వకేంద్రుల “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” గ్రంధం చదివేకొలది మన ప్రాచీన ఆర్ష సంస్కృతి పున:స్మరణ గలుగుచున్నది. ప్రస్తుత కలుషిత సమాజం లో గత వైభవం పునరావృతం కాగలదాయను సందేహం కలుగక మానదు. జ్ఞాన దాతగా విశ్వవిఖ్యాతి గాంచిన భారతీయ ఋషి సంప్రదాయం నేడు దానవాధీనమైనది. త్యాగ నిరతిగల దేశం లో వంచన, లోభం విస్తృతంగా వ్యాప్తమైనవి. గతాన్ని స్మరించుచూ వర్తమానమును తిలకిస్తే దుర్భర భవిష్యత్తు ఊహాతీతంగా గోచరిస్తుంది.
- “విద్యాభాస్కర” “లలితకవి” తాటిమాను నారాయణ రెడ్డి, బేతంచెర్ల.

* “సద్భావనా స్రవంతి” లోని వ్యాసాలన్నీ విజ్ఞానదాయకంగా ఉన్నాయి. అభినందనలతో…
- బులుసు-జీ-ప్రకాష్, విజయనగరం.

* “సద్భావనా స్రవంతి” పుస్తకం లో జీవన సత్యాలను మీ మనస్సు చెప్పిన రీతిలో, మీ గురువుగారి ఆశీస్సులతో వ్రాసిన తీరు బావుంది. మీ కృషిని అభినందిస్తున్నాను. మరిన్ని మంచి రచనలు మీ కలం నుండి రావాలని ఆకాన్స్కిస్తున్నాను.
- కాటూరు రవీంద్ర త్రివిక్రం, విజయవాడ.
* మీరు ప్రేమతో పంపిన మీ “సద్భావనా స్రవంతి” గ్రంధం అందినది. ‘సూక్ష్మంలో మోక్షం’ అనే విధంగా చిన్న చిన్న అంశాలలో అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. ముఖ్యంగా ‘విపశ్యన’ ధ్యానాన్ని గూర్చి మీరు వ్రాసిన వ్యాసం నాకెంతో నచ్చింది. మీ రచన సరళం గానూ, సుబోధకం గానూ ఉంది. ఆత్మోన్నతికై సాధనచేసే వారికి మీ గ్రంధం అత్యంత ఉపయోగ మని నా భావన. ఆధ్యాత్మికతలో విశేషానుభవాన్ని గడించిన మిమ్మల్ని అభినందిస్తున్నాను.
-డా.అయాచితం నటేశ్వరశర్మ, రీడర్, సంస్కృత శాఖ, కామారెడ్డి.

* “సద్భావనా స్రవంతి” పుస్తకం చదివాను. పదిమందిలో మంచిని పెంచే ప్రయత్నం చేశారు. సంతోషం.
- ‘మహా సహస్రావధాని’ డా.గరికిపాటి నరసిం హారావు, హనుమకొండ.

* భావితరాలకు, ఒక సాత్త్విక సమాజ స్థాపనకు మీ పుస్తకాలు ఉపయుక్తమవుతాయి. మీ ధార్మిక భావుకతకు అభినందనలు. మీ కృషి నిరంతరం సాగాలని ఆశిస్తున్నాను.
- డా.టి.శ్రీరంగస్వామి, ఎడిటర్, “ప్రసారిక” మాస పత్రిక, హసన్ పర్తి.

* మానవజాతికి దిక్సూచిగా నిర్దేశించే మంచి పుస్తకం “సద్భావనా స్రవంతి”. మానవజాతి సంస్కృతిని సంస్కరించే మార్గాన్ని చూపే జ్ఞాన ప్రసూన మాలిక “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి”. జాతికి కావలసిన వెలుగు దీపాలుగా వెలువరించిన సాహితీ సేద్యకారులుగా అభినందిస్తూ, ఇలాంటి సధావనా స్రవంతులు మీ కలం నుండి మరిన్ని జాలువారాలని మనసారా కోరుకుంటున్నాను.
- బొబ్బిలి జోసెఫ్, ప్రముఖ రచయిత, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.

* మీ సద్భావనలు వర్తమాన సమాజాన్ని జాగృతం చేసేవి. ఫ్రతి మనిషికీ కర్తవ్య బోధచేసేవి. మానవుణ్ణి మానవోత్తముణ్ణి చేసే ఆలోచనలు మీవి. మానవాళికి ఉపకరించే చక్కని గ్రంధాన్ని రచించిన మిమ్మల్ని అభినందిస్తున్నాను. “కలాలు-గళాలు” లో మీ కవిత చదివాను. బాగుంది. మీకు ఉజ్జ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ…
- ‘భారత్ భాషా భూషణ్’, ‘కవితిలక’ డా. తిరునగరి.

* అన్నిరకాల, అన్ని మతాల వారికి సర్వదా ఆచరణీయమైన ప్రవచనాలను మీ పుస్తకములో చూశాను. ఒకసారి కాకుండా మళ్ళీ మళ్ళీ చదువవలసిన, మననం చేసుకోవలసిన అంశాలు పుస్తకం నిండా ఉన్నాయి. మీరు పె ట్టిన సబ్ హెడింగ్స్, వానిలో ఒక్కొక్క అంశమును విశదీకరించిన విధానము అతి రమణీయముగా నున్నది.
ఏ జాతికి, ఏ మతానికి ప్రత్యేకించి ప్ర్రతినిధ్యం వహించని విశాల భావాలుగల ప్రవక్త చెప్పే మాటల్లా ఉన్నాయి మీ వాక్యాలు. నా చిరునామా ఎలా సంపాదించారోగాని నా చేత మంచి, ప్రయోజనకర మైన పుస్తకాన్ని చదివించారు. ఆందుకు మీకు నా అభినందనలు. మనసు వ్రాలిన ప్రతిచోట నిఘావేసి చూడు, చేదు నాలుకలో ఉంది, పదార్ధం లో కాదు, ముక్కోటి దేవతల మీద నమ్మకమున్న మీమీద మీకు నమ్మకం లేనిచో ముక్తి శూన్యం, మనిషి తినటానికే దేవుడు ఇతర జీవుల్ని పుట్టించాడనటం తప్పు, పులికి ఆహారం గా మనిషిని దేవుడు పుట్టించాడంటే నమ్ముతారా? ఇలాంటివి అలోచన రేకెత్తించేవి గా ఉన్నాయి. నాకు మీ పుస్తకం బాగా నచ్చింది. ధన్యవాదములతో…
- గాదేపల్లి సీతారామమూర్తి, రచయిత, అద్దంకి.

* “సద్భావనా స్రవంతి” యనే పుస్తకం ఇంత చిన్న వయసులోనే రచించి, ఆధ్యాత్మిక శిఖరాల నధిరోహించిన మిమ్ములను అభినందిస్తున్నాను. ఆషామాషీగా చదివి ‘పుస్తకం చదివాం’ అనిపించుకొనే పుస్తకం కాదిది. సద్భావనతో చదివి, జీర్ణించుకొని, ఏ కొంచెమైనా ఆచరణ వైపు ప్రయత్నిస్తే మానవ జన్మ ధన్యమై నట్లేనని చెప్పక తప్పదు.
- కొట్టి రామారావు, రచయిత, మచిలీపట్నం.

* “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” యనే గ్రంధం ఇంటింటా, గ్రంధాలయములయందు ఆవశ్యకముగ నుంచదగి ఉన్నది. వివిధ శీర్షికలతో విద్యాలయములలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు గ్రహిచవలసిన ప్రధానాంశములన్నింటిని విపులీకరించి సర్వులకు అవగతమగు లాగున తయారుచేసి అందజేసిన మీకృషిని అభినందిస్తున్నాను.
-కె.ఎస్.ఆర్.కె.వి.వి.ప్రసాద్,రచయిత, నల్ల జెర్ల, ప.గో. జిల్లా.

* మీరు ప్రేమతో పంపిన “సద్భావనా స్రవంతి” పుస్తకం చదివి ఆనందించాను. మానవుడు సర్వోన్నతుడూ, సమగ్రమైన వ్యక్తిత్త్వంతో వికసించడానికి మీరు సూచించిన మార్గం ఉత్కృష్టమైనది. ఈనాటి సమాజం ఈ సన్మార్గం నుండి వైదొలగినందుకే ఇన్ని వైపరీత్యాలు, అశాంతి, అలజడులు పొడసూపినాయి. ప్రతి మనిషి ఆచరించవలసిన సూత్రాలను బోధించినారు. మీకు నా అభినందనలు. మీ కలం నుండి ఇలాంటి సదుపదేశాలు వెల్లివిరిసే గ్రంధాలు వెలువడుతాయని ఆశిస్తున్నాను.
- ప్రొ. పేర్వారం జగన్నాధం, హనుమకొండ.

* మీరు ప్రేమతో పంపిన “సద్భావనా స్రవంతి” “సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి” యనే ఆధ్యాత్మిక భావనలతో పరిపుష్టి కలిగిన గ్రంధములు అందుకుని చాలా సంతోషించాను. దివ్యమణులు దొరికినంత సంతసము కలిగినది. మీలాంటి పుణ్యపురుషులు నూటికి పదిమంది ఉన్నా భారతావని పూర్వపు స్థాయికి రాగలదని నా భావన. మీ కృషిని అభినందిస్తున్నాను.
- యం. లక్ష్మీకాంతరావు, రచయిత, ఒంగోలు, ప్రకాశం జిల్లా.

* సత్య చైతన్య ధార:
ఏదో అద్భుతం జరగాలి … ఈ దుర్మార్గాలన్నీ అంతరించాలి. ఈ దేశం బాగుపడాలి అని దేశం పట్ల ఆత్మీయత, ప్రేమ, గౌరవ భావం, బాధ్యత గలవాళ్ళంతా మూగగా ప్రార్ధిస్తున్న ఈ సమయములో శ్రీ నేతి విజయదేవ్ ఆధ్యాత్మిక నామంగా కలిగిన ధన్యజీవి శ్రీ నాగులవంచ వసంతరావు. ‘చైతన్య స్రవంతి’, ‘నిత్య సత్యాలు’ పేరిట లోకవృత్త పరిశీలనతో కవితా సంకలనం వెలువరించటం చీకటిని తిడుతూ కూర్చోవటం కన్నా చిరు దివ్వెను వెలిగించటం లాంటిది. శ్రీ వసంతరావు ఆధ్యాత్మిక సాధనలో అక్షరాన్ని కూడా జ్ఞాన మార్గ సాధనంగా భావించటం అభినంద నీయం. కవి ఈ కావ్యం లో మనిషి కోసం పరితపిస్తున్నాడు. మనిషి కోసం ఆలోచిస్తున్నాడు. ఆ తపన, ఆలోచనల ఫలితం ఈ కావ్యం. ‘నానృషి: కురుతే కావ్యం’ కదా! ఇందులోని కవితలన్నీ నేటి సమాజం లో మనుషుల మనస్తత్త్వాలను పరిశీలించి వారిని మరోసారి ఆలోచింప జేసేవి. వివిధ పత్రికల్లో ప్రచురితాలు కూడా. విద్యార్ధి, ఉద్యోగి, అమ్మ, దేశం, మాతృభాష, డబ్బు, భక్తి ఇలా పలు అంశాలు కవికి వస్తువులైనాయి.

ఏ కవి ఐనా ఎందుకు రాస్తాడు? ఒక సంఘటనను చూసినా, విన్నా, దాని గురించి తాను విశ్లేషించుకొని పదిమందిని ఆలోచింప జేస్తాడు. రాయకుండా ఉండలేక రాస్తాడు. వసంతరావూ అంతే! అంతర్మధనం లోంచి అమృతాన్ని పంచాలనుకోవటం సుకవి లక్షణం. ఫరతత్త్వం పై పై నటనలతో తెలియదనీ, బాహ్యాడంబరాలను నిరసించి, మానసిక పరిణతిని ప్రభోధిస్తారు. బ్రహ్మ సత్యం-జగన్మిధ్య అనీ, మాయను జయించాలనీ, దృస్టినిబట్టి సృష్టి అనీ, దేహం అనిత్యమనీ తరతరాలుగా గురుపరంపర బొధించిన సత్య సూత్రాలను కవితాత్మతతో కవి అందించారు. సుజ్ఞానోదయాన్ని కలిగించే ప్రయత్నం చేయాలనుకొవ టమే చైతన్యం.

ఆధ్యాత్మిక మార్గములో పయనిస్తున్నా మనం సమాజాన్ని అంటకుండా వీలుకాదు. బురదలోని పద్మం బురద అంటకుండా ప్రకాశించినట్లు మనిషి సమాజం అనే బురదలోంచి మంచి మాత్రమే గ్రహించి పద్మ కాంతులతో ప్రకాశించగలగాలి. అందుకే వసంతరావు గురువు అనుగ్రహంతో సామాజిక స్పృహతో “చైతన్య స్రవంతి” “నిత్య సత్యాలు” లో సమాజం తలుపులు తీసి అంతరార్ధాలను అందించారు. ఇటువంటి నీతిసూక్తులు ఇప్పటి సమాజం ఎంత గ్రహిస్తుంది అని కవి ఆలోచించరు. తన కర్తవ్యాన్ని నెరవేర్చటమే వీరి ధ్యేయం. రాసే వరకే కవిత్వం కవిది. రాశాక ప్రజలది. అందుకనే విజ్ఞత ప్రజలదే మరి. ఆనేక దురలవాట్ల గురించి, అవినీతి గురించి, విదేశీ వ్యామోహం గురించి, డబ్బుకోసం పరుగెత్తే మనిషి గురించి ఆవేదనతో రాసిన ప్రతి కవిత నిత్య పారాయణ యుక్తం. ‘పాలించట్లేదన్న మాటేగాని పచార్లు మాత్రం వాళ్ళచుట్టే! (పరానుకరణ) కొరడాతో చెళ్ళుమనిపించినంత! ‘పనియందే పరమాత్మను నిండా దర్శించు’ (ఉద్యోగి-ఉద్బోధ) అన్నప్పుడు ‘వర్క్ ఈజ్
వర్షిప్’ అనే స్వామి వివేకానంద వాణి స్ఫురిస్తుంది. శౌర్య ధైర్య ప్రతాపాలతో నూతన దివ్య శక్తిగా భారతమాతను చూడాలనె కవి ఆకాంక్ష కావ్యం నిండా పరుచుకుని పులకరింప జేస్తుంది. సహకారం ఊపిరిగా పాడిన ఈ మేలుకొలుపులో ఆత్మ శక్తి ఉంది. నిజాయితీ ఉంది. మనిషిగా పుట్టినందుకు కన్నతల్లి, ఉన్నవూరు, మాతృదేశ గౌరవం నిలబెట్టాలనే పిలుపునిచ్చిన శ్రీ నేతి విజయ దేవ్ కలం నుండి మరిన్ని ఆణిముత్యాలు రావాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తున్నాను.
- డా.చిల్లర భవానీదేవి, ప్రముఖ రచయిత్రి, సచివాలయం.

* ఉదాత్తమైన ఆశయాలు స్పందించే మనసు ఉన్నకవి తన రచనలో వాటిని ప్రతిబింబిస్తాడు. తద్వారా మనకు ఆదర్శవంతమైన జీవితం గడపడానికి ప్రేరణ దొరుకుతుంది. సాహిత్యం పరమార్ధం మనిషిని మనీషిగా మార్చటమేగా! ఆ దిశగా సాగినాయి శ్రీ వసంతరావు గారి చైతన్య స్రవంతిలోని కవితా సంకలనం లోని కవితలు. వర్తమాన భారతదేశ నిరుద్యోగ చిత్రపటాన్ని కనులముందు ఆవిష్కరింపజేసిన
కవిత ‘భరతమాత కన్నీటి భాష్యం.’ డబ్బులకోసం జీవితమంతా పరుగులు తీస్తే వచ్చే జబ్బులు గ్గించుకోవటానికి ‘ప్రాత:కాల నడకలు తప్పవు సుమా అని ‘డబ్బు-జబ్బు’ కవితలో హెచ్చరిస్తారు. సహ ఉద్యోగుల మధ్య చిచ్చు రగిల్చే సీనియార్టీ, కోర్టు విభేదాల గురించి మనసుకి హత్తుకునే విధముగా ‘ఉద్యోగి-ఉద్బోధ’లో వివరిస్తారు. ప్రపంచములో ఏ అణు విస్పోటనం జరగాలన్నా ఏదో ఒక హృదయం లో బీజం పడాల్సిందేగా! అందుకే హృదయం మహోన్నత దేవాలయం లా ఉండాలని స్పష్టముగా చెప్పిన కవిత “హృదయశుద్ది.” ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని కవితల్లో కవి పడే ఆరాటం, ఆవేదన మనల్ని ఆలోచింప జేస్తాయి. విస్తృత గ్రంధపఠనం, సాహితీ మిత్రుల సాంగత్యం, ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులతో మున్ముందు ఇంకా చక్కటి కవితలు ఎన్నో వ్రాయాలని ఆకాంక్షిస్తూ… అభినందనలతో!
- శ్రీమతి ఎస్. రమాదేవి, ఉపకార్యదర్శి, సచివాలయం.

* ప్రేమ, దయ, విద్య, అన్నీ రెండక్షరాలే. వసంతరావు కవితలన్నీ
ఈ రెండక్షరాల చుట్టూ తిరుగుతూ అనంతమైన సృష్టి రహస్యాలను, జీవిత సత్యాలను తెలియజేస్తాయి. డబ్బు, కల్తీ, మాయ, ఇవీ రెండక్షరాలే! మనిషిని మత్తులో పడేసి చిత్తు చేసే సత్తాగలవి. వీటి మాయలో పడొద్దని వసంతరావు కవితలు బ్రతిమాలతాయి, ప్రభోదిస్తాయి.
- అలపర్తి రామకృష్ణ,ప్రముక కధా నవలా రచయిత,వనస్ధలిపురం.


* మిత్రుడు “నేతి విజయదేవ్” (నాగులవంచ వసంతరావు) ఆధ్యాత్మిక లోతుల్ని తరచి, మధించి, వెలికితీసిన విజ్ఞాన గుళికలు ఇందులో ఉన్న కవితలు. విద్యార్ధులకు, మేధావులకు, సంపన్నులకు, సామాన్యులకు, సాధకులకు - ఇలా ప్రతి ఒక్క వర్గానికి దిశా నిర్దేశం చేసే చక్కటి కవితలు ఇందులో ఉన్నాయి. సంస్కారం, ఆత్మవికాసం కలిగించే కవితలే ఇందులో ఉన్నవన్నీను. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కవితలు వెలుగు కిరణాలు…కాంతి పుంజాలు…
-అవధానుల సుధాకరరావు, ప్రముఖ కధా రచయిత, సచివాలయం.

* శ్రీ నేతి విజయదేవ్ గురుప్రసాదిత నామధేయంతో పరిచయం కాబోతున్న శ్రీ నాగులవంచ వసంతరావుగారి కవితా సంకలనం నేటి ప్రపంచానికొక వెలుగుబాట. విద్యార్ధులను నిద్రలేపుతూ, భరతమాత రోదనను వినిపించుకొనక డిగ్రీలనే భిక్షా పాత్రలు చేకొని విదేశా లకు డాలర్ల మోజులో డబ్బు డబ్బు అనుకుంటూ డబ్బులోనే విలువను చూస్తూ పరుగులు పెట్టే యువతకు కనువిప్పు కలిగిస్తూ, స్వధర్మాన్ని మరచిన ఉద్యోగులకు మంచి ఫలితాలవైపు పయనింపజేసే మార్గదర్శిగా, మాతృదేశాన్ని మరచిన మేధావులకు కనువిప్పుగా, మూఢ నమ్మకాలతో మానవత్వాన్ని మంటగలిపే వారికి ఒక హెచ్చ రికగా సాగి, తృప్తి కలిగిన మనిషిగా, మంచి మాట, హృదయశుద్ధితో మానవుని మాధవత్వంవైపు నడిపించి, నీవు సామాన్యుడవు కాదు – మహాత్ముడివని తెలియజేస్తూ, విషయవాసనలను విసర్జించి, పరిపూర్ణ మైన మానవునిగా దైవత్వంవైపు నడిపించే ఒక చక్కని మార్గదర్శకంగ నిలిచి, మానవుని దివ్య జీవనంవైపు నడిపించే చైతన్య స్రవంతి కవితా సంకలనం మనందరికి అనుసరణీయం కావాలి.
- పి. రాజేశ్వరరావు, సహాయ కార్యదర్శి, సచివాలయం.

* “చైతన్య స్రవంతి”లోని వసంతరావు కవితా గుళికలు - అభినవ యువతకు తేనె పలుకులు, జీవితానికవి మూలాధారాలు - చదవాలి తప్పక నేటి యువతరం, అనుసరిచాలి వాటి భావం - అనుభవించాలి తత్ ఫలం, అదే భావి భారత బలం.
-ఎన్.పి.సిహెచ్. భాస్కరరావు, సచివాలయ నగర్, వనస్ధలిపురం.

* Dear Sri Vasantha Rao, I have read your well written book ‘Sadbhavana Sravanti’ which you gave me in the meeting. I have enjoyed and profited by reading.

You have briefly presented the qualities of an ideal person and a road map for human perfection. In these days of drastic decline in values and culture when fair is foul and foul is fair, the significance and usefulmenss of your book can hardly be exaggerated. It points the spiritual path. I am circulating your book among a few young men.
26-11-2006
Dear Sri Vasantha Rao, The two books ‘Sadupadesa Vidyalaya Pradeepti’ and ‘Chaitanya Sravanth/Nitya Satyalu’ are excellent books which I read with great interest and found them unputdownable.

Theformer is an unvaluable guide to every one connected with education – teacher, student, parent and the management of Schools. It is a store house of knowledge, wisdom and constructive criticism. It should find pride of place in the libraries of all educational institutions and public libraries too.

The latter contains capsules of wisdom and counsel useful in daily life. After Independence, we are hizacked from India’s pristine culture and value system into a new culture which may be called, Five-Star Hotel Culture, which consists in the pursuit of filthy lucre. Fair is foul, and found is fair.

Pranams to Baba who has done so much to revive our ancient glory, making use of your good self as an instrument. Hearty congratulations to you for your dedication and commitment to values.

Prof. I.V. Chalapati Rao, Editor, Triveni, Gandhi Nagar, Hyderabad.


* Blessed Immortal Self Sri Vasantha Rao. Trust this letter find you in best of health and high spiritis. Received your copy of “Sadhavana Sravanthi” written in Telugu. The topics imbibed in the book are to heart’s content. The work of spiritual enlightenment through this small book is a key to knowledge to many who go through it and is indeed appreciable. May Lord Shiridi Saibaba bestow his divine grace upon you to continue such divine works at large.
- H.H.Sadguru Dr. Sai Kumar, Founder, Sai Geetha Ashram, Sec-bad.

* My Dear Vasantha Rao, I congratulate you in authoring and compiling the two books, which are really eye openers. I wish that these books should be available to the masses, who will be benefited by inculcating the habit of following the truths to live in peace and nearer to the creator and to finally reach Him.
- D.L.N.M. Patnaik, Dy. Director (Retd.), Local Fund, Vanasthalipuram.